ఆంద్ర ఆడపడుచు అమెరికాలో... థాంక్స్ గివింగ్ రోజు జరిగిన సంఘటన... షాపింగ్ కుడా కష్టమై పోయింది...

Header Banner

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో... థాంక్స్ గివింగ్ రోజు జరిగిన సంఘటన... షాపింగ్ కుడా కష్టమై పోయింది...

  Sat Apr 18, 2020 15:23        U S A, Rachanalu (రచనలు)

కళ్యాణ్ వాళ్ళింట్లో ఆ రాత్రి భోజనాలయ్యాక మా కాలేజ్ కబుర్లు చెప్పుకుంటూ, ఆ మాటల్లోనే నా పెళ్ళి కబుర్లు చెప్తే, అంతా విని కళ్యాణ్ బాధ పడుతుంటే వాళ్ళావిడ వింతగా చూస్తుంటే...తనకేమీ తెలియదు, మేమందరం బాగా చూసుకునేవాళ్ళం,  చాలా అమాయకురాలని కళ్యాణ్ చెప్పడం..ఇలా ఆ మాటా ఈ మాటా చెప్పుకున్నాం చాలాసేపు. మరుసటి రోజు జమ్ షో ఉందని చూద్దామని వెళ్ళాం. అక్కడికే ఫణి వాళ్ళు కూడా వచ్చారు. నేను ఏమీ కొనలేదు. నాకు షాపింగ్ చేయడం పెద్దగా ఇష్టం కూడా ఉండదు. అలా వీకెండ్ గడిచిపోయింది. నన్ను మళ్ళీ గెస్ట్ హౌస్ లో దించేసారు. మరో వారం మెుదలయ్యింది.

నాతోపాటు గెస్ట్ హౌస్ లో మరొక తెలుగావిడ  ఉంది. హైదరాబాదు ఆమెది. తన ఫామిలి వేరే చోట ఉన్నారు. ఆవిడ అమెరికా వచ్చి చాలా రోజులయింది. ఆమెను మార్కెటింగ్ చేయడం మెుదలుపెట్టారు పారాడైమ్ కంపెనీ వాళ్ళు. ఫోన్ కాల్స్ వస్తూ ఉండేవి ఆమెకు, లేదా ఆమె ఫోన్ లో బిజీగా ఉండేది. ఆవిడ మంచి మాటకారి, గడసరి కూడానూ.

ఈలోపల మరొక కన్నడ ఫామిలీ పరమేశ్వరన్ వాళ్ళు ఇండియా నుండి వచ్చారు. కాస్త సందడిగానే ఉంది నాకు. పరమేశ్వరన్ వాళ్ళ ఫ్రెండ్ సీతారాం తన వైఫ్ శిరీషతో వీళ్ళని కలవడానికి వచ్చి నాకు కూడా బాగా దగ్గరైపోయారు. వీకెండ్ వాళ్ళింటికి మమ్మల్ని ముగ్గురిని భోజనానికి పిలిచారు. హైదరాబాదు ఆవిడ రాలేదు. అలా శిరీష నాకు బాగా దగ్గరైంది. తర్వాత పరమేశ్వరన్ కు జాబ్ వచ్చి వేరే చోటికి వెళిపోయారు. సతీష్ ఫోన్ చేసినా మాట్లాడటానికి వీలయ్యేది కాదు. ఆమెకు సెల్ ఫోన్ ఉన్నా కూడా లాండ్ లైన్ ఇచ్చేది కాదు. అప్పట్లో కంప్యూటర్ లో ఇంటర్నెట్ కూడా లాండ్ లైన్ తోనే ఉండేది.

నరసరాజు అంకుల్ ఫోన్ చేసినప్పుడు డబ్బుల గురించి అడిగారు. ఉన్నాయి నా దగ్గర అంటే ఎంత తెచ్చుకున్నావన్నారు. చెప్తే వెంటనే అడ్రస్ తీసుకుని 1000 డాలర్స్ పంపించారు. ఇంతలో థాంక్స్ గివింగ్ వచ్చింది. నరసరాజు అంకుల్ ఫోన్ చేసి రాజగోపాలరావు వాళ్ళింటికి వెళుతున్నావా అంటే అన్నయ్య పండగ గురించి ఇంకా ఫోన్ చేయలేదని చెప్పాను. టికెట్ బుక్ చేస్తాను సెంట్ లూయీస్ రమ్మంటే, శిరీష ఫోన్ చేసి వాళ్ళింటికి రమ్మందని చెప్పాను. సరే నీ ఇష్టమన్నారు. నేను శిరీష వాళ్ళింటికి బయలుదేరుతుంటే అన్నయ్య ఫోన్ చేసాడు. అమ్మాయ్ నేను వస్తున్నాను ఇంటికి తీసుకువెళ్ళడానికి అని. నేను చెప్పాను, శిరీష వాళ్ళింటికి వెళుతున్నానని. నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చిన సీతారాంతో మాట్లాడి, వాళ్ళింటికి వచ్చి ఇంటికి తీసుకువెళ్ళాడు అన్నయ్య.

అమెరికన్స్ కు టైమ్ ఉండదు కదా అందుకే సంవత్సరంలో ఓ రోజు దేవుడికి థాంక్స్ చెప్పడానికి ఈ థాంక్స్ గివింగ్ ని కేటాయించారని చెప్పింది. అన్నయ్య వాళ్ళిల్లంతా ఫ్రెండ్స్ తో నిండిపోయింది. అందరు తలొక వంట చేసుకుని వచ్చారు. సందడిగా థాంక్స్ గివింగ్ అమెరికాలో మెుదటి పండగ గడిచిపోయింది. ఉచిత క్లాసిఫైడ్ కొరకు ఆంధ్ర ప్రవాసి అందిస్తున్న గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోండి. తెలుగులోనే మీ ప్రకటనలు మీరే స్వయం గా పోస్ట్ చేసుకోవచ్చు

 

మళ్ళీ కలుద్దాం..

గమనిక: ఔత్సాహిక ప్రవాసులకు గొప్ప అవకాశము. మీ విదేశీ ప్రయాణాలు, లేదా అక్కడ మీ అనుభవాలు, మీ ముచ్చట్లు, మీరు ఎదుర్కున్న ఇబ్బందులు లేదా సంతోషకర విషయలు... ఏదైనా కాని మీరు అందరితో పంచుకోవ్వాలని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలశ్యం... వెంటనే మాకు ఈమెయిలు చేయండి. మేము వాటిని ఆంధ్ర ప్రవాసి లో ప్రచురిస్తాము.  

మా మెయిల్ అడ్రస్: andhrapravasi@gmail.com or

andhrapravasi@andhrapravasi.com

 

ముందు వారాల లింకులు

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో 200 డాలర్లతో వెళ్లి ఏమి చేసింది... ఒంటరిగా రూమ్ లో ఏమయ్యేదో... అంత కష్టమా... 5

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో అడుగుపెట్టిన మొదటి రోజే ఏమైంది??? ఇలా ఆమెకేనా లేదా అందరికి అదే జరుగుతుందా? 4

ఆంద్ర ఆడపడుచు మొదటి సారి విమానం లో అమెరికా ప్రయాణం... ఇబ్బందులు ఎలా ఎదుర్కుంది ఒంటరిగా... స్వ-గత అనుభవాలు... 3

ఆంద్ర ఆడపడుచు అమెరికా విసా కోసం చదువుల ట్రైనింగ్, ప్రయాణం కోసం ఏర్పాట్లు సర్దుకోవతటాలు ... ఆసక్తికరంగా... 2

సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం తెలుగు ఆడపడుచు... భూతల స్వర్గం అమెరికా వెళ్ళాలనే పట్టుదల... ఏమైది చివరకు... 1

రచయిత్రి శ్రీమతి మంజు యనమదల గారి పరిచయం...


   Thanksgiving-day-in-USA