ఆంద్ర ఆడపడుచు అమెరికాలో ఉన్నపుడు తన 2 సం// పిల్లవాడికి సీరియస్... అయినా రాలేని పరిస్థితి... 10 నెలల తరువాత ప్రయాణం
Wed Jul 22, 2020 15:08 Rachanalu (రచనలు), U S Aగోవర్ధన్ ఇండియా వెళుతున్నానంటే నా కొడుకుని చూసిరా అని చెప్పాను. ఓరోజు ఫోన్ చేసి అర్జంట్ గా ఫోన్ చేయమన్నాడు. వెంటనే ఫోన్ చేసా ఏమయ్యిందోనని. నీ కొడుకు నాలుగు మెట్ల మీద నుండి కాదు పడింది. మీ డాబా పోర్టికో పైనుండి దూకేసాడు. అమ్మావాళ్ళు చూపించారు ఎక్కడ నుండి దూకాడో. అది చూసాకా నాకు ఇప్పటికి వణుకు తగ్గలేదు అని చెప్పాడు.
అప్పటికి వాడికి సరిగ్గా 2వ పుట్టినరోజు అయ్యి 2 నెలలు. విషయం తెలిసాక వెంటనే ఇండియా వెళిపోవాలనిపించింది. కాని అన్ని మనకనుకూలంగా ఉండవు కదా. ఈయనకు వీసా క్వరీ పడింది. నాకేమెా ఊపిరి సలపని పని. దానికి తోడు రామస్వామి గారు డ్రైవింగ్ నేర్చుకోమనడం. రోజూ నన్ను డ్రాప్ చేయాలి కదా అందుకు. అప్పుడప్పుడూ విక్రమ్ కాస్త నేర్పేవాడు ఇంటికి వచ్చేటప్పుడు.
మధు, సంధ్య అని ఓ ఫామిలి పరిచయం అయ్యారు. మధు రామస్వామి గారికి బేగిల్స్ అమ్మిన నార్త్ ఇండియన్ మరో షాప్ లో చేసేవాడు. సంధ్యను కూడా ఇండియన్ గ్రాసరిస్టోర్ లో పెడదామని రామస్వామి గారి ఆలోచన. అలా నాకు పరిచయమై బాగా దగ్గరయ్యారు. బాబీ, రీనా వాళ్ళు మాధవి అక్కకు చుట్టాలు. విజయ్ బాబీ రూమ్మేట్స్. బాబీ, విజయ్ కూడా రెస్టారెంట్ కి వచ్చేవాళ్ళు. రామస్వామి గారి ఇంట్లో బేస్మెంట్ లో కంప్యూటర్ ఉండేది. వీళ్ళకు తెలిసిన అబ్బాయి అక్కడ ఉండేవాడు. కొన్ని రోజులకు వాళ్ళ చెల్లి MS చేయడానికి వచ్చింది. కొన్ని రోజులుండి ఆ అమ్మాయి వెళిపోయింది. నేను మెయిల్స్ టైమ్ కుదిరినప్పుడు బేస్మెంట్ లో చూసుకునేదాన్ని.
మాధవి అక్క కూతురు వందన నాలుగో, ఐదో చదువుతుండేది అప్పుడు. రకరకాల జడలు వేసుకుంటూ ఉండేది. కుక్కీస్ వెరైటీస్ చేస్తూ ఉండేది. అప్పుడప్పుడూ బేగిల్స్ షాప్ లో నాకూడా ఉండేది తన స్కూల్ అయ్యాక బోర్ కొడితే. మా ఆయన చుట్టాలు జలజ వదిన వాళ్ళాయన అమెరికన్ సిటిజన్. అన్నయ్య నన్ను కలవడానికి నా వర్క్ అయ్యే టైమ్ లో వచ్చేవారు. చాలా మంచివారు అన్నయ్య. నేను ఇండియా వెళదామనుకుంటున్నానని అన్నయ్యకు చెప్తే వెంటనే నాకు డబ్బులు అకౌంట్ లో వేసారు. జలం వదిన అప్పుడు ఇండియాలోనే ఉంది.
నేను ఇండియా వెళతానని మాధవి అక్కకు కూడా చెప్పాను. అప్పటికి నేను అమెరికా వచ్చి సంవత్సరం నర్ర అయ్యింది. మౌర్య మూడో పుట్టినరోజుకి ఇండియా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నా. పిల్లాడికి మాజిక్ స్లేట్, కొన్ని బొమ్మలు మాధవి అక్క కొనిపెట్టింది. నా క్లాస్మేట్ శేఖర్ బాబు ఉండేది చికాగోలోనే. అప్పుడప్పుడూ ఫోన్ లో మాట్లాడేవాడు. కాలేజ్ లో మేమిద్దరం ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు. ఇండియా వెళుతున్నానంటే తను వచ్చి దీవాన్ స్ట్రీట్ కి తీసుకువెళ్ళాడు.అక్కడ ముత్యాలు, పచ్చలు తనకు తెలిసిన షాప్లో తీసుకున్నా.
నా చిన్నప్పటి ఫ్రెండ్ రాధ తమ్ముడు రాము కూడా అమెరికా వచ్చాడు నా తర్వాత. పిట్స్ బర్గ్ లో ఉన్నప్పటి నుండి మాట్లాడేవాడు. మా సీనియర్ రాంకుమార్ కూడా నేను పిట్స్ బర్గ్ లో ఉన్నప్పుడు అమెరికా వచ్చారు. రవీంద్ర ప్రసాద్ గారు రాంకుమార్ ని ఎయిర్ పోర్ట్ లో పిక్ చేసుకుని అక్కడే నాతో మాట్లాడించారు. ఇంజనీరింగ్ కాలేజ్ లో మా సీనియర్లు వీళ్ళు. రవీంద్ర ప్రసాద్ గారు బాగా కేర్ తీసుకునే వారు కాలేజ్ లో. రాంకుమార్ నన్ను కలవడానికి చికాగో వచ్చివెళ్ళారు. బాబీ నాకు షాపింగ్ లో చాలా హెల్ప్ చేసాడు.
పిల్లలకు చాక్లెట్స్, బట్టలు, గిఫ్ట్ బొమ్మలు, ఓ కామ్ కాడర్ మాత్రం తీసుకున్నాను. డబ్బులు కావాలని రామస్వామి గారిని అడిగితే అప్పటి వరకు ఏం లెక్కలు చూసారో నాకు తెలియదు. నేను ఇవ్వాల్సిన డబ్బులు మినాయించుకుని ఓ లక్ష ఇండియాలో తీసుకోమన్నారు. సరేనని ఇండియా బయలుదేరా. ఎయిర్ పోర్ట్ లో బాబీ దించాడు. దుబాయ్ మీదుగా మద్రాస్ వచ్చాను. రోజుకి 18, 20 గంటల పని చేసానేమెా ఫ్లైట్ లో వకటే నిద్ర. ఎయిర్ హోస్టెస్ నిద్ర లేపి తినడానికి ఇచ్చేది. మా మామయ్య, ప్రయాణం మావారు ఎయిర్ పోర్ట్ కి వచ్చారు.
హోటల్ రూమ్ కి రాజగోపాల్, వాళ్ళ కాబోయే ఆవిడ, మా కిరణ్ చేసుకుందామనుకున్న అమ్మాయి వచ్చారు. మధ్యాహ్నం రెండింటికి పినాకినిలో విజయవాడ బయలుదేరాం. ఉచిత క్లాసిఫైడ్ కొరకు ఆంధ్ర ప్రవాసి అందిస్తున్న గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోండి. తెలుగులోనే మీ ప్రకటనలు మీరే స్వయం గా పోస్ట్ చేసుకోవచ్చు
మళ్ళీ కలుద్దాం..
గమనిక: ఔత్సాహిక ప్రవాసులకు గొప్ప అవకాశము. మీ విదేశీ ప్రయాణాలు, లేదా అక్కడ మీ అనుభవాలు, మీ ముచ్చట్లు, మీరు ఎదుర్కున్న ఇబ్బందులు లేదా సంతోషకర విషయలు... ఏదైనా కాని మీరు అందరితో పంచుకోవ్వాలని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలశ్యం... వెంటనే మాకు ఈమెయిలు చేయండి. మేము వాటిని ఆంధ్ర ప్రవాసి లో ప్రచురిస్తాము.
మా మెయిల్ అడ్రస్: andhrapravasi@gmail.com or
andhrapravasi@andhrapravasi.com
ముందు వారాల లింకులు
ఆంద్ర ఆడపడుచు అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగాలు... అక్కడ లైఫ్ అంటే అంత సులభం కాదు... 18
ఆంద్ర ఆడపడుచు అమెరికాలో జీతం ఎకోట్టిన యజమానిపై కేసు... డబ్బు దండగ, ఫలితం సూన్యం... 16
ఆంద్ర ఆడపడుచు అమెరికాలో 2001 సెప్టెంబర్ 11 ఉగ్రవాద దాడి... ఘటనకు సాక్షి... 15
ఆంద్ర ఆడపడుచు అమెరికాలో... థాంక్స్ గివింగ్ రోజు జరిగిన సంఘటన... షాపింగ్ కుడా కష్టమై పోయింది... 6
ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో 200 డాలర్లతో వెళ్లి ఏమి చేసింది... ఒంటరిగా రూమ్ లో ఏమయ్యేదో... అంత కష్టమా... 5
ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో అడుగుపెట్టిన మొదటి రోజే ఏమైంది??? ఇలా ఆమెకేనా లేదా అందరికి అదే జరుగుతుందా? 4
రచయిత్రి శ్రీమతి మంజు యనమదల గారి పరిచయం...
andhra-women-in-amrica
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.