సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం తెలుగు ఆడపడుచు... భూతల స్వర్గం అమెరికా వెళ్ళాలనే పట్టుదల... ఏమైది చివరకు...

Header Banner

సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం తెలుగు ఆడపడుచు... భూతల స్వర్గం అమెరికా వెళ్ళాలనే పట్టుదల... ఏమైది చివరకు...

  Sat Mar 14, 2020 14:05        Rachanalu (రచనలు), U S A

ఒకప్పుడు అమెరికా అంటే భూతల స్వర్గమన్న భావన ప్రతి ఒక్కరిలో ఉండేది. అమెరికా నుండి ఎవరైనా వచ్చారంటే, వారిని ఎంత అపురూపంగా చూసేవారో మనమదరికి తెలుసు. నా వరకు నాకు మా గోపాలరావు అన్నయ్య, శిరీష వదిన అమెరికా నుండి వస్తే ఎంత గొప్పగా ఉండేదో. చిన్నప్పుడు మా ఆటల్లో కూడా వాళ్ళలా అమెరికా వెళ్ళినట్లుగా వారిని అనుకరిస్తూ ఆడుకునేవాళ్ళం. బహుశా నా అమెరికా ప్రయాణానికి బీజం అక్కడే పడి ఉండవచ్చు.

సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం నుండి వచ్చి, ఆ రోజుల్లో ఆడపిల్ల అదీ పక్క రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదవడమే ఓ సాహసం. ఇంటరు వరకు తెలుగు మీడియంలో చదివి ఇంజనీరింగ్ పూర్తి చేసి, అమెరికాలో ఎమ్ ఎస్ చేయాలన్నారు కోరికతో జి ఆర్ ఈ, టోఫెల్ రాసి క్వాలిఫై అయ్యి కూడా ఆర్థిక వెసులుబాటు లేక అమెరికా కలకు తాత్కాలిక విరామం ఇచ్చినా...నా అమెరికా వెళ్ళినట్లుగా కోరికను తీర్చడానికి మా రాధ పెదనాన్న తన చుట్టాన్ని అడిగితే, వాళ్ళు AS/400 చేయమనండి తీసుకువెళతాం అని చెప్తే.. అప్పట్లో అందరు IBM Mainframes చేస్తుంటే..ఎలక్ట్రానిక్స్ చదివిన నేను బెంగుళూరులో CMC లో ఈ కోర్స్ చేసి, అనుకోని కారణాల వలన పెళ్ళి, తర్వాత మద్రాస్ లో ఉద్యోగం, బాబు పుట్టడం, లెక్చరర్ గా కొన్ని నెలలు, తర్వాత నా అమెరికా సన్నాహాలకి నాన్న ఫ్రెండ్ మంతెన నరసరాజు అంకుల్ సాయం చేయడం, H1 రావడం, టికెట్ కూడ అంకుల్ తీసుకోవడంతో సంవత్సరం నర్ర బాబుని, అందరిని వదిలి అమెరికా ప్రయాణం డాలర్ల కోసం మెుదలయ్యింది.

మళ్ళీ కలుద్దాం...

 

రచయిత్రి శ్రీమతి మంజు యనమదల గారి పరిచయం...

 


   part-1-andhra-adapaduchu-america-journy