ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో మరో కొత్త ఉద్యోగం కొత్త సిటీ లో... కేవలం 3 వారాలు మాత్రమే... అయితే...

Header Banner

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో మరో కొత్త ఉద్యోగం కొత్త సిటీ లో... కేవలం 3 వారాలు మాత్రమే... అయితే...

  Wed Aug 12, 2020 13:39        U S A, Rachanalu (రచనలు)

రోనెక్ సిటిలో AMSOL రవి ముదునూరు బుక్ చేసిన హోటల్కి వెళ్ళాను. పొద్దున్నే నన్ను అంతకు ముందు ఇంటర్వూ చేసినామెకి కాల్ చేసాను. తను 11 కి వచ్చి పిక్ చేసుకుంటానని చెప్పింది.  సరిగ్గా 11 కి మా టెస్టింగ్ మేనేజర్ టీనా ఫీల్డ్స్ ఓ పెద్ద కార్ లో వచ్చి కంపెనీకి తీసుకువెళ్ళింది. కార్ లో తనతో మాట్లాడుతూ నా టెన్షన్ తగ్గించుకోవడానికి ప్రాజెక్ట్ వివరాలడిగాను. అప్పటికి నాకు మాన్యువల్ టెస్టింగ్ వచ్చు కాని ఆటోమేషన్ టెస్టింగ్ రాదు. ఈ ప్రాజెక్ట్ లో ఏ టెస్టింగ్ వాడుతున్నారని అడిగితే మాన్యువల్ అని చెప్పింది.

అప్పుడు హమ్మయ్య అనుకున్నాను. టీనా చాలా చాలా మంచిది. నేను ఈ ప్రాజెక్ట్ కి వచ్చేసరికి దగ్గర దగ్గర 7, 8 నెలల నుండి వర్క్ పెండింగ్ ఉండిపోయింది. మెుదటిరోజు సిస్టమ్ అంతా సెట్ చేయడము, నేను వర్క్ ప్లాన్ చేసుకోవడంతో కాస్త పనే చేయగలిగాను. వంచిన కల ఎత్తకుండా ఓ 10, 12 రోజులు పని చేసి పెండింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసాను. ఇంతకీ కంపెనీ పేరు చెప్పలేదు కదా అడ్వాన్స్ ఆటో పార్ట్స్. అమెరికాలో చాలా పెద్ద పేరున్న కంపెనీ. ఈ కంపెనీలో ఇండియన్స్ చాలా తక్కువ మంది. ఓ ఐదారుగురు వచ్చి పరిచయం చేసుకున్నారు. కొసమెరుపేంటంటే తెలుగువారు ఒక్కరూ లేదన్న మాట. తమిళ్, మళయాళీ, నార్త్ ఇండియన్స్ ఉన్నారు. ఇలా ఇండియన్స్ ఎవరు వచ్చినా అందరు కలిసి ఒకరింట్లో గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తారట. నన్నూ అలాగే ఇన్వైట్ చేసారు. 

ఆఫీస్ వర్క్ అయ్యాక ఈవెనింగ్ నన్ను పిక్ చేసుకుని తీసుకువెళ్ళారు. అందరం చక్కగా పలకరించుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేసాం. తర్వాత మైల్డ్ లేడీస్ డ్రింక్ వైన్ ఆఫర్ చేసారు. అలవాటు లేదని చెప్తే, ఏం కాదు తాగమవ్నారు. నేను ప్రెగ్నెంట్ అని చెప్తూ, ఏదీ పడదని నా కండిషన్ గురించి చెప్పాను. ఆఫీస్ లో పని చేసే తమిళాయన వైఫ్ కూడా ప్రెగ్నెంట్ అని చెప్పింది. గెట్ టుగెదర్ బాగా జరిగింది. 

వర్క్ లో పడి తిండి కూడా సరిగా తినేదాన్ని కాదు. ఓ వేళ తిందామన్నా, కనీసం మంచినీళ్ళు కూడా పొట్టలో ఉండేవి కాదు. వామిటింగ్ అయిపోయేవి. ఆకలికి పేగులు మెలితిరిగి పోయేవి. ఆఫీస్ కాంటిన్ లో అప్పుడప్పుడూ తింటూ, మా టెస్టింగ్ టీమ్ కొలీగ్స్ లంచ్ కి బయటకెళుతూ ఏమైనా కావాలా అని అడిగితే మెక్ డోనాల్డ్స్ డాలర్ చికెన్ శాండ్ విచ్ తెమ్మని చెప్పేదాన్ని. అమెరికన్ గ్రాసరిస్టోర్ లో వేయించిన వేరుశనగపప్పు, ఎగ్స్, పాలు, ఏవో కొన్ని వెజిటబుల్స్ తెచ్చుకునేదాన్ని. ఇంటి దగ్గర నుండి తెచ్చిన వాటిలో నల్లకారం, శనగపప్పు కారం నాతో రోనెక్ తెచ్చుకున్నా. మిగిలినవన్నీ జలజ వదిన వాళ్ళింట్లోనే వదిలేసాను త్రీ వీక్స్ ప్రాజెక్టే కదా అని. అప్పటి వరకు తిండి విలువ తెలియలేదు. రోనెక్ పుణ్యమా అని తిండి విలువ బాగా తెలిసింది. మూడు వారాలే కదా అని హోటల్ లోనే ఉంటానని రవికి చెప్పాను. నా దగ్గర డబ్బులు లేవని కూడా చెప్పాను. 1000 డాలర్స్ అకౌంట్ లో వేశారు. 

ఆఫీస్ లో ఉన్నంతసేపు నా సెల్ సిగ్నల్ వచ్చేది కాదు. చాలా దూరం బయటకు రావాల్సి వచ్చేది బ్రేక్ టైమ్ లో. అందరూ సిగిరెట్లు కాల్చుకుంటుంటే నేను ఫోన్ మాట్లాడుకునేదాన్ని. కాని నా ప్లాన్ లో డే మినిట్స్ ఎక్కువ ఉండేవి కాదప్పుడు. అందుకని ఆఫీస్ లాండ్ లైన్ అదీ లంచ్ టైమ్ లోనో, ఈవెనింగ్ ఆఫీస్ అవర్స్ అయిపోయాకో వాడేదాన్ని. మధ్య మధ్యలో మరో జాబ్ కోసం ఆఫీస్ లాండ్ లైన్, ఈమెయిల్ వాడాల్సివచ్చేది రెజ్యూమ్ పంపడానికి.ఈ ప్రాజెక్ట్ ఉండేది మూడు వారాలే కదా అని. ఆఫీస్ కి మార్నింగ్ నడుచుకుంటూ వచ్చేదాన్ని.

సాయంత్రం ఎవరో ఒకరు హోటల్ దగ్గర డ్రాప్ చేసేవారు. స్నో బాగా పడినప్పుడు కాబ్ బుక్ చేసుకునేదాన్ని. కాబ్  రానప్పుడు టీనాకి రావడం లేటవుతుందని ఫోన్ చేసి చెప్తే, రావద్దులే రెస్ట్ తీసుకో అని చెప్పేది. మాకు ప్రాజెక్ట్ రివ్యూ మీటింగ్స్ జరుగుతూ ఉండేవి. నేను ముందే టీనాకి వివరమంతా చెప్పేసేదాన్ని నేను చేసిన వాటి గురించి. మీటింగ్ లో తను నా గురించి కూడా బాగా మెచ్చుకుంటూ చెప్పేది. అది కొందరికి నచ్చలేదు. మా టెస్టింగ్ టీమ్ లో అందరు అమెరికన్సేనండోయ్. మా గోపాలరావు అన్నయ్య, వదిన వాళ్ళు, జలజ వదిన వాళ్ళు, ఉమ, మధు,సంధ్య,ఉష ఇలా అందరు ఫోన్ చేసి నా క్షేమ సమాచారాలు కనుక్కుంటూ ఉండేవారు. అలా మూడు వారాలు గడిచిపోయాయి. ఉచిత క్లాసిఫైడ్ కొరకు ఆంధ్ర ప్రవాసి అందిస్తున్న గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోండి. తెలుగులోనే మీ ప్రకటనలు మీరే స్వయం గా పోస్ట్ చేసుకోవచ్చు

మళ్ళీ కలుద్దాం..

గమనిక: ఔత్సాహిక ప్రవాసులకు గొప్ప అవకాశము. మీ విదేశీ ప్రయాణాలు, లేదా అక్కడ మీ అనుభవాలు, మీ ముచ్చట్లు, మీరు ఎదుర్కున్న ఇబ్బందులు లేదా సంతోషకర విషయలు... ఏదైనా కాని మీరు అందరితో పంచుకోవ్వాలని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలశ్యం... వెంటనే మాకు ఈమెయిలు చేయండి. మేము వాటిని ఆంధ్ర ప్రవాసి లో ప్రచురిస్తాము.  

మా మెయిల్ అడ్రస్: andhrapravasi@gmail.com or

andhrapravasi@andhrapravasi.com

 

ముందు వారాల లింకులు

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో నుండి ఇండియా రాక... తిరిగి వెళ్ళిన తరువాత ఉద్యోగాల వేట... ఎన్ని ఎబ్బందులో...  20

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో ఉన్నపుడు తన 2 సం// పిల్లవాడికి సీరియస్... అయినా రాలేని పరిస్థితి... 10 నెలల తరువాత ప్రయాణం – 19

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగాలు... అక్కడ లైఫ్ అంటే అంత సులభం కాదు... 18

ఆంద్ర ఆడపడుచు అమెరికాకు వెళ్ళింది సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం... ఆర్ధిక మాన్యం తో చివరికి రెస్టారెంట్ లో అంట్లు, బాత్ రూమ్ క్లీనింగ్... 17

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో జీతం ఎకోట్టిన యజమానిపై కేసు... డబ్బు దండగ, ఫలితం సూన్యం... 16

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో 2001 సెప్టెంబర్ 11 ఉగ్రవాద దాడి... ఘటనకు సాక్షి... 15  

ఆంద్ర ఆడపడుచు ఆ రోజుల్లో అమెరికాలో ఈమెయిలు చేయడానికి ఎన్ని కస్టాల పడాల్సి వచ్చేదో... HIB కి ఎన్ని తిప్పలో... 14

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో H1B విసా కోసం వెతుకులాట... సరైన ఉద్యోగం దొరక్క తాత్కాలికం గా ఆయా గా... అమెరికా వెంకటేశ్వర స్వామి గుళ్ళో... 13

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగం లో ఇబ్బందులు... జీతం కుడా ఇవ్వకుండా పని చేపించుకునే యాజమాన్యం... రాజీనామా... మరో ఉద్యోగ వేట... ఎన్ని ఎబ్బందులో... 12

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో మొదటి ఉద్యోగం అనుభవాలు... అప్పట్లో టెలిఫోన్ మరియు ఇంటర్నెట్ లు రేట్లు ఎలా ఉండేవో తెలిస్తే... 11

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో మొదటి ఉద్యోగం... సబ్జెక్టు ఉంది కాని ప్రాక్టికల్ లేదు... ఉదోగం లో ఎలా నెట్టుకు వచ్చిందో... 10

 ఆంద్ర ఆడపడుచు కొత్త ఉద్యోగ లో చేరడం కోసం మరో సిటీకి ప్రయాణం... ఫ్లైట్ డిలే తో 3 కనెక్టింగ్ ఫ్లైట్లు మిస్... మూడు ఎయిర్ పోర్టులలో నిరీక్షణలో ఏమి జరిగిందంటే... 9

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగం కోసం కొత్త కోర్సుల  ట్రైనింగ్... అమెరికా ఇంగ్లిషు యాస కోసం కుకిటులు... 8

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగ అన్వేషణ లో... అక్కడ ఎన్ని కష్టాలో ఉద్యోగం కోసం... జెమ్ షో అంటే ఏమిటి? - 7

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో... థాంక్స్ గివింగ్ రోజు జరిగిన సంఘటన... షాపింగ్ కుడా కష్టమై పోయింది... 6

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో 200 డాలర్లతో వెళ్లి ఏమి చేసింది... ఒంటరిగా రూమ్ లో ఏమయ్యేదో... అంత కష్టమా... 5

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో అడుగుపెట్టిన మొదటి రోజే ఏమైంది??? ఇలా ఆమెకేనా లేదా అందరికి అదే జరుగుతుందా? 4

ఆంద్ర ఆడపడుచు మొదటి సారి విమానం లో అమెరికా ప్రయాణం... ఇబ్బందులు ఎలా ఎదుర్కుంది ఒంటరిగా... స్వ-గత అనుభవాలు... 3

ఆంద్ర ఆడపడుచు అమెరికా విసా కోసం చదువుల ట్రైనింగ్, ప్రయాణం కోసం ఏర్పాట్లు సర్దుకోవతటాలు ... ఆసక్తికరంగా... 2

సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం తెలుగు ఆడపడుచు... భూతల స్వర్గం అమెరికా వెళ్ళాలనే పట్టుదల... ఏమైది చివరకు... 1

రచయిత్రి శ్రీమతి మంజు యనమదల గారి పరిచయం...

 


   andhra-aadapaduchu-amerikaalo, andhra-women-in amerika