Header Banner

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో 3 వారాలనుకున్న జాబు 3 నెలలవరకు... మల్లి ఉద్యోగ ప్రయత్నాల తో డెట్రాయిట్ ప్రయాణం...

  Sat Aug 29, 2020 08:00        Rachanalu (రచనలు), U S A

మూడు వారాలు అన్న ప్రాజెక్ట్ అలా అలా  గడిచిపోతూ ఉంది. శాండి మెాబైల్ హౌస్ లో రోనెక్ సిటీ జీవితం బాగానే జరుగుతోంది. అమ్మానాన్నకు, మౌర్యకు అమెరికా రావడానికి పేపర్స్ పంపాను. ఆ పేపర్స్ నోటరి చేయించి పంపడంలో శాండి చాలా హెల్ప్ చేసింది. శాండి ఇంట్లో ఉండగానే మా చిన్న ఆడపడుచుకి పెళ్ళి సంబంధం అనుకోకుండా AMSOL రవి మూలంగా కుదిరింది. నేను ఇండియా వెళ్ళినప్పుడు మా పెద్దాడపడుచు వాళ్ళాయన కాస్త సూటిపోటి మాటలన్నారు. ఏదో మాటల మీద రవి ఈ సంబంధం గురించి చెప్తే, ఆ పిల్లకు ఫోన్ చేసి విషయం చెప్పాను.

ఫోటో పంపించి, చదువు, మిగతా వివరాలు చెప్పి నీకు నచ్చితేనే మాట్లాడతాను అని చెప్పాను. వాళ్ళ అక్కాబావ ఇష్టం అంది. అమ్మానాన్న లేరు చిన్నప్పుడే చనిపోయారు. తర్వాత వాళ్ళతో మాట్లాడితే సంబంధం మాట్లాడమన్నారు. అబ్బాయి జీతం గురించి అడిగితే 4000, 5000 నాకు తెలియదు అని ఫోన్ నెంబర్ ఇస్తాను, మీకేం అనుమానాలున్నా మాట్లాడండి అని నెంబర్ ఇచ్చాను. నాకుగా వాళ్ళు మాట్లాడిన వివరాలేం చెప్పలేదు. మా ఆయన అప్పుడు ఇండియాలోనే ఉన్నారుగా. మెుత్తానికి మాట్లాడి సంబంధం కుదిర్చారు. పెళ్ళికొడుకు..

మరి పెళ్ళి ఖర్చులు ఇవ్వరా అంటే వాళ్ళేం ఇవ్వలేరండి. నేనే ఇవ్వాలి అంటే నవ్వేసి ఊరుకున్నాడు. ఎంగేజ్మెంట్ అయ్యింది. ఓ రోజు మా మరిది ఫోన్ చేసి పిల్లకి ఇష్టం లేదని చెప్పాడు. ఆయన అప్పుడు అక్కాబావతో మాట్లాడడు. నేను వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి, ఆమెకు ఇష్టం లేకపోతే మానేయండి, ఆవిడ సంగతి మీకు బాగా తెలుసు కదా, చదువు ఏం చేసిందో గుర్తు చేసుకోండి. వాళ్ళకి నేను ఏదోకటి చెప్పుకుంటాను అని అంటే, మేం మాట్లాడతాం అని చెప్పారు. 

ఇదంతా శాండి వింటూనే ఉంది. విషయం ఏంటని అడిగితే ఇలా ఇలా అని వివరంగా చెప్పాను. మీకు ఇంత ప్రాసెస్ ఉంటుందా పెళ్ళికి అని ఆశ్చర్యపోయింది. ఈలోపల మా టెస్టింగ్ టీమ్  పుణ్యమా అని, నేను ఫోన్ ఎక్కువ మాట్లాడుతున్నానన్న కంప్లైంట్ తో, మా టీనాకి ఎగైనెస్ట్ గా, నా జాబ్ తీసేయించారు. టీనాకి తన పనిలో కూడా చాలా హెల్ప్ చేసేదాన్ని. టెస్టింగ్ చేయమంటే, బగ్స్ తో పాటు, కోడింగ్ ఏం చేయాలో, ఎక్కడ ఛేంజ్ చేయాలో చెప్తుండేదాన్ని. టీనానేమెా మంజూ మనం బగ్స్ ఐడెంటిఫై చేయాలంతే అని నవ్వేది. రామస్వామి నన్ను బెదిరిస్తే ఆ విషయం కూడా టీనాకి తెలుసు.

చాలా సపోర్టివ్ గా ఉండేది నాతో. అది మిగతావాళ్ళకి కంటగింపు. నాకు పని లేకపోతే ఏం చోష్యం ఫోన్ మాట్లాడేదాన్ని జలం వదినతో, చికాగోలో కొందరితో. ఆఫీస్ వాళ్ళు నేను ఫోన్ మాట్లాడిన అవర్స్ లెక్కబెట్టుకున్నారు కాని నేను పని చేసిన టైమింగ్స్ గుర్తుంచుకోలేదు. అవి అన్ని మా టీమ్ లో అందరికి తెలుసు. ఎక్స్ట్రా అవర్స్ పే చేయరు. అయినా వర్క్ చేసేదాన్ని. ఎప్పుడైనా స్నో పడి లేట్ అవుతుంది రావడానికంటే, టీనా లీవ్ తీసుకోమనేది. తర్వాత టైమ్ షీట్ ఫిల్ చేసేటప్పుడు లీవ్ ది కూడా టైమ్ వేసుకో, నీకెలాగు మేం ఎక్స్ట్రా అవర్స్ పే చేయడం లేదు.

నువ్వు లంచ్ టైమ్ కూడా తీసుకోవు అనేది. ఎంతయినా అందరు అమెరికన్స్ మధ్యన టీనా నాకు ఫేవర్ గా ఉండటం వారికి నచ్చలేదు. మెుత్తానికి నా మూడు వారాల ప్రాజెక్ట్ మూడు నెలలతో ఇలా ముగిసిందన్న మాట. అన్నట్టు చెప్పడం మరిచా మా శాండి వాళ్ళ ఫాదర్ మంచి కార్ రేసర్ అంట. నాకు శాండి డ్రైవింగ్ చూసి అనుమానమెుచ్చి అడిగితే ఆ విషయం చెప్పింది. అక్కడే ఓ రెండు రోజులుండి తర్వాత నా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ క్లాస్మేట్ శ్రీనివాసరెడ్డి వాళ్ళు ఏదైనా జాబ్ చూద్దాం, డెట్రాయిట్ వచ్చేయమంటే డెట్రాయిట్ బయలుదేరాను. ఉచిత క్లాసిఫైడ్ కొరకు ఆంధ్ర ప్రవాసి అందిస్తున్న గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోండి. తెలుగులోనే మీ ప్రకటనలు మీరే స్వయం గా పోస్ట్ చేసుకోవచ్చు

మళ్ళీ కలుద్దాం..

గమనిక: ఔత్సాహిక ప్రవాసులకు గొప్ప అవకాశము. మీ విదేశీ ప్రయాణాలు, లేదా అక్కడ మీ అనుభవాలు, మీ ముచ్చట్లు, మీరు ఎదుర్కున్న ఇబ్బందులు లేదా సంతోషకర విషయలు... ఏదైనా కాని మీరు అందరితో పంచుకోవ్వాలని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలశ్యం... వెంటనే మాకు ఈమెయిలు చేయండి. మేము వాటిని ఆంధ్ర ప్రవాసి లో ప్రచురిస్తాము.  

మా మెయిల్ అడ్రస్: andhrapravasi@gmail.com or

andhrapravasi@andhrapravasi.com

 

ముందు వారాల లింకులు

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో ఉండటం మొబైల్ హౌస్ లో... ఒకసారి కాలు జారి పడితె, ఆసుపత్రిలో ఏమైందంటే... 22

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో మరో కొత్త ఉద్యోగం కొత్త సిటీ లో... కేవలం 3 వారు మాత్రమె... అయితే... 21

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో నుండి ఇండియా రాక... తిరిగి వెళ్ళిన తరువాత ఉద్యోగాల వేట... ఎన్ని ఎబ్బందులో...  20

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో ఉన్నపుడు తన 2 సం// పిల్లవాడికి సీరియస్... అయినా రాలేని పరిస్థితి... 10 నెలల తరువాత ప్రయాణం – 19

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగాలు... అక్కడ లైఫ్ అంటే అంత సులభం కాదు... 18

ఆంద్ర ఆడపడుచు అమెరికాకు వెళ్ళింది సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం... ఆర్ధిక మాన్యం తో చివరికి రెస్టారెంట్ లో అంట్లు, బాత్ రూమ్ క్లీనింగ్... 17

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో జీతం ఎకోట్టిన యజమానిపై కేసు... డబ్బు దండగ, ఫలితం సూన్యం... 16

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో 2001 సెప్టెంబర్ 11 ఉగ్రవాద దాడి... ఘటనకు సాక్షి... 15  

ఆంద్ర ఆడపడుచు ఆ రోజుల్లో అమెరికాలో ఈమెయిలు చేయడానికి ఎన్ని కస్టాల పడాల్సి వచ్చేదో... HIB కి ఎన్ని తిప్పలో... 14

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో H1B విసా కోసం వెతుకులాట... సరైన ఉద్యోగం దొరక్క తాత్కాలికం గా ఆయా గా... అమెరికా వెంకటేశ్వర స్వామి గుళ్ళో... 13

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగం లో ఇబ్బందులు... జీతం కుడా ఇవ్వకుండా పని చేపించుకునే యాజమాన్యం... రాజీనామా... మరో ఉద్యోగ వేట... ఎన్ని ఎబ్బందులో... 12

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో మొదటి ఉద్యోగం అనుభవాలు... అప్పట్లో టెలిఫోన్ మరియు ఇంటర్నెట్ లు రేట్లు ఎలా ఉండేవో తెలిస్తే... 11

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో మొదటి ఉద్యోగం... సబ్జెక్టు ఉంది కాని ప్రాక్టికల్ లేదు... ఉదోగం లో ఎలా నెట్టుకు వచ్చిందో... 10

 ఆంద్ర ఆడపడుచు కొత్త ఉద్యోగ లో చేరడం కోసం మరో సిటీకి ప్రయాణం... ఫ్లైట్ డిలే తో 3 కనెక్టింగ్ ఫ్లైట్లు మిస్... మూడు ఎయిర్ పోర్టులలో నిరీక్షణలో ఏమి జరిగిందంటే... 9

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగం కోసం కొత్త కోర్సుల  ట్రైనింగ్... అమెరికా ఇంగ్లిషు యాస కోసం కుకిటులు... 8

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగ అన్వేషణ లో... అక్కడ ఎన్ని కష్టాలో ఉద్యోగం కోసం... జెమ్ షో అంటే ఏమిటి? - 7

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో... థాంక్స్ గివింగ్ రోజు జరిగిన సంఘటన... షాపింగ్ కుడా కష్టమై పోయింది... 6

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో 200 డాలర్లతో వెళ్లి ఏమి చేసింది... ఒంటరిగా రూమ్ లో ఏమయ్యేదో... అంత కష్టమా... 5

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో అడుగుపెట్టిన మొదటి రోజే ఏమైంది??? ఇలా ఆమెకేనా లేదా అందరికి అదే జరుగుతుందా? 4

ఆంద్ర ఆడపడుచు మొదటి సారి విమానం లో అమెరికా ప్రయాణం... ఇబ్బందులు ఎలా ఎదుర్కుంది ఒంటరిగా... స్వ-గత అనుభవాలు... 3

ఆంద్ర ఆడపడుచు అమెరికా విసా కోసం చదువుల ట్రైనింగ్, ప్రయాణం కోసం ఏర్పాట్లు సర్దుకోవతటాలు ... ఆసక్తికరంగా... 2

సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం తెలుగు ఆడపడుచు... భూతల స్వర్గం అమెరికా వెళ్ళాలనే పట్టుదల... ఏమైది చివరకు... 1

రచయిత్రి శ్రీమతి మంజు యనమదల గారి పరిచయం...


   andhra-aadapaduchu-amerikaalo, andhra-women-in amerika,mobile-house-in-USA