ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో అడుగుపెట్టిన మొదటి రోజే ఏమైంది??? ఇలా ఆమెకేనా లేదా అందరికి అదే జరుగుతుందా?

Header Banner

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో అడుగుపెట్టిన మొదటి రోజే ఏమైంది??? ఇలా ఆమెకేనా లేదా అందరికి అదే జరుగుతుందా?

  Sat Apr 04, 2020 14:05        U S A, Rachanalu (రచనలు)

అమెరికాలో మెుదటిరోజు నిద్ర గురించి.. అన్నయ్య వాళ్ళ అమ్మాయి సుమి రూమ్ లో పడుకున్నా. జట్ లాగ్ కదా నిద్ర రాలేదు. అదీనూ అంతా కొత్త కొత్తగా ఉంది. ఆలోచనలతో ఎప్పటికో నిద్ర పోయా. పొద్దున్నే నిద్ర లేచే సరికే వదిన వర్క్ కి వెళిపోయింది. అన్నయ్య కాఫీ కలిపిస్తూ ఎలా కలుపుకోవాలో చూపించాడు.

మైక్రోవేవ్ ఎలా వాడాలో చూపించాడు. టిఫిన్  గురించి చెప్తూ సీరిల్స్ ఎలా పాలల్లో కలుపుకుని తినాలో చెప్పాడు. తర్వాత సోషల్ సెక్యూరిటీ నంబర్ అప్లై చేయడానికి తీసుకువెళ్ళి, అక్కడే స్టేట్ ఐడికి కూడా అప్లై చేయించాడు. ఉచిత క్లాసిఫైడ్ కొరకు ఆంధ్ర ప్రవాసి అందిస్తున్న గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోండి. తెలుగులోనే మీ ప్రకటనలు మీరే స్వయం గా పోస్ట్ చేసుకోవచ్చు నాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు కదా అందుకన్న మాట స్టేట్ ఐడి.

 ఫోన్ ఇండియాకి ఎలా చేయాలో చెప్పాడు.  అమ్మా వాళ్ళతో మాట్లాడించాడు. అమెరికాలో నా ఫ్రెండ్స్, కాలేజ్ మేట్స్ చాలామంది అప్పటికే ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళకి అందరికి అన్నయ్య వాళ్ళ ఇంటి నెంబరు పెట్టి ఈ మెయిల్ చేసాను. అలా అమెరికాలో కమ్యూనికేషన్ మెుదలైంది. 

నేను అమెరికాకి వెళ్ళింది GIS కంపెనీ H1B తో. వాళ్ళు జాబ్ చూడాలంటే డబ్బులు అడిగారని నరసరాజు అంకుల్ జాబ్ మేం చూసుకుంటాం, H1B చేయండి చాలు అన్నారు. అందుకని వాళ్ళ అబ్బాయి పారాడైమ్ ఇన్ఫోటెక్ కంపెనీ ఉచిత క్లాసిఫైడ్ కొరకు ఆంధ్ర ప్రవాసి అందిస్తున్న గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోండి. తెలుగులోనే మీ ప్రకటనలు మీరే స్వయం గా పోస్ట్ చేసుకోవచ్చు శ్రీధర్ ని జాబ్ అడిగితే సరే చూస్తామన్నారు. నేను ఇండియా నుండి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కూడా VC++ నేర్చుకుని రండి అని చెప్పారు.

 అన్నయ్య బాల్టిమెార్ లో ఉన్న పారాడైమ్ కంపెనీ ఆఫీస్ కి తీసుకువెళ్ళాడు. అప్పుడే ఓ క్లయింట్ వస్తే ఇంటర్వూ ఎరేంజ్ చేసారు. నేను రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళాలెండి అప్పటికే. దానిలో 6 నెలల ఎక్స్పీరియన్స్ పెట్టమన్నారు కూడా. క్లయింట్ అడిగితే ఫ్యూ డేస్ అయింది వచ్చి అని చెప్పాను. తను నవ్వి మరి 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ పెట్టావు కదా అంటే.. అలా పెట్టకపోతే మీరు ఇంటర్వూకి పిలవరు కదా అన్నా. క్లయింట్ నవ్వేసి గుడ్ లక్ చెప్పాడు. బయటికి వచ్చాక వీళ్ళని అడిగితే మీకు అలవాటు అవుతుందని ఇలా చేసామన్నారు. గెస్ట్ హౌస్ ఉంది కంపెనీది, మీరు వచ్చేయండి అన్నారు. 2 రోజులలో పంపిస్తాను అని చెప్పి అన్నయ్య ఇంటికి తీసుకువచ్చాడు. 

ఉచిత క్లాసిఫైడ్ కొరకు ఆంధ్ర ప్రవాసి అందిస్తున్న గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోండి. తెలుగులోనే మీ ప్రకటనలు మీరే స్వయం గా పోస్ట్ చేసుకోవచ్చు

 

మళ్ళీ కలుద్దాం.

 

గమనిక: ఔత్సాహిక ప్రవాసులకు గొప్ప అవకాశము. మీ విదేశీ ప్రయాణాలు, లేదా అక్కడ మీ అనుభవాలు, మీ ముచ్చట్లు, మీరు ఎదుర్కున్న ఇబ్బందులు లేదా సంతోషకర విషయలు... ఏదైనా కాని మీరు అందరితో పంచుకోవ్వాలని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలశ్యం... వెంటనే మాకు ఈమెయిలు చేయండి. మేము వాటిని ఆంధ్ర ప్రవాసి లో ప్రచురిస్తాము.  

మా మెయిల్ అడ్రస్: andhrapravasi@gmail.com or andhrapravasi@andhrapravasi.com

 ముందు వారాల లింకులు

3.  ఆంద్ర ఆడపడుచు మొదటి సారి విమానం లో అమెరికా ప్రయాణం... ఇబ్బందులు ఎలా ఎదుర్కుంది ఒంటరిగా... స్వ-గత అనుభవాలు...

2. ఆంద్ర ఆడపడుచు అమెరికా విసా కోసం చదువుల ట్రైనింగ్, ప్రయాణం కోసం ఏర్పాట్లు సర్దుకోవతటాలు ... ఆసక్తికరంగా...

1 -సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం తెలుగు ఆడపడుచు... భూతల స్వర్గం అమెరికా వెళ్ళాలనే పట్టుదల... ఏమైది చివరకు...

రచయిత్రి శ్రీమతి మంజు యనమదల గారి పరిచయం...


   andhra-women-in-america-job-joining