భారత సంతతికి చెందిన ఏడేళ్ల బ్రిటన్ బాలిక మోక్ష రాయ్ .. ప్రతిష్టాత్మక 'బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డు' ..
Thu Jul 20, 2023 11:49 Europe, Indiaభారత సంతతికి చెందిన ఏడేళ్ల బ్రిటన్ బాలిక మోక్ష రాయ్ (Moksha Roy) ప్రతిష్టాత్మక 'బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డు' (UK PM's Points of Light Award) ను గెలుచుకుంది. మైక్రోప్లాస్టిక్ కాలుష్యానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి చేపట్టిన కార్యక్రమం కోసం ఆమె మూడేళ్ల ప్రాయం నుంచే స్వచ్ఛందంగా పని చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె సేవలకు గుర్తింపుగా బ్రిటన్ ఉపప్రధాని ఆలివర్ డౌడెన్ (Deputy British Prime Minister Oliver Dowden) గతవారం మోక్షకు పురస్కారాన్ని అందజేశారు. ఆర్థిక సహకారం అవసరమైన చిన్నారులను ఆదుకునేందుకు నిధుల సేకరణ సహా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై పలు కార్యక్రమాలను చేపట్టడం ద్వారా మోక్ష బ్రిటన్‌లో మంచి గుర్తింపు పొందారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే...
క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Andhra pravasi ఆంధ్ర ప్రవాసి
Pulse of Telugu Migrants తెలుగు ప్రవాసుల జీవ నాడి
https://t.me/joinchat/G6eU_lFHk6AH_IG8zfJqdg
https://chat.whatsapp.com/Jd5iZoDyMjfKhVU2IvOe5f
#AndhraPravasi
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.