బంగ్లాదేశ్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం! తమ పౌరులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసిన ఇంగ్లండ్!

Header Banner

బంగ్లాదేశ్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం! తమ పౌరులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసిన ఇంగ్లండ్!

  Wed Dec 04, 2024 14:23        Others

హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్నబంగ్లాదేశ్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలంటూ తమ పౌరులకు యూకే హెచ్చరికలు జారీ చేసింది. జనసమ్మర్థ ప్రాంతాలు, ప్రార్థనా మందిరాలు, మతపరమైన భవనాలు, విదేశీయులు ఎక్కువగా సందర్శించే ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందంటూ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. 

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవుల అంశంపై సీఎం, డిప్యూటీ సీఎం సీరియస్ డిస్కషన్! ఢిల్లీ పర్యటనపై కీలక అప్డేట్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

దేశద్రోహం ఆరోపణలతో గత నెల 25న ఇస్కాన్ ప్రచార కర్త చిన్మయి కృష్ణదాస్ బ్రహ్మచారిని బంగ్లాదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేసిన తర్వాత అక్కడి హిందూ సమాజంపై దాడులు పెచ్చుమీరాయి. అవి క్రమంగా హింసాత్మక రూపు దాల్చాయి. ఈ నేపథ్యంలో స్పందించిన యూకే తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. ఇస్లాంకు విరుద్ధమైన అభిప్రాయాలు, జీవనశైలి కలిగిన వ్యక్తులను ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్నట్టు యూకే పేర్కొంది. ఈ నేపథ్యంలో ముఖ్య నగరాల్లో ఐఈడీ దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.  

 

ఇంకా చదవండిమందుబాబులకు బిగ్ షాక్.. రాష్ట్రంలో వైన్స్ బంద్! ఎప్పటి నుంచంటే..? ఎందుకంటే? 

 

బంగ్లాదేశ్‌లోని 17 కోట్ల జనాభాలో 8 శాతం మాత్రమే ఉన్న మైనార్టీలపై ఇటీవలి కాలంలో 200కుపైగా దాడులు జరిగాయి. చిన్మయిదాస్ అరెస్ట్ తర్వాత ఢాకా, చిట్టగాంగ్‌లలో ఆయన మద్దతుదారులు ఆందోళనకు దిగాయి. ఈ సందర్భంగా భద్రతా దళాలకు వారికి మధ్య తోపులాట జరిగింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆ జిల్లాలో కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్! ఇలా అప్లై చేసుకుంటే - నేరుగా అకౌంట్లోకి రూ. 2.50 లక్షలు జమ!

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ... ఐటీ గ్లోబల్ పాలసీకు ఆమోదం! ఆంధ్రా పెట్టుబడులు పెట్టేవారికి గొప్ప అవకాశం!

 

అమరావతి అభివృద్ధికి కోటి విరాళం అందించిన మహిళ! తల్లి కోరిక నెరవేర్చిన కుమార్తె!

 

చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేటీ! పలు కీలక అంశాలపై!

 

టీడీపీలోకి వైసీపీ కీలక నేత..చంద్రబాబు సమక్షంలో చేరిక! మరో మాజీ మంత్రిమాజీ ఎమ్మెల్యే కూడా! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Bangladesh #Parliamnet #Dhaka #Reservations #Riots #Strike #Revolutions ##Revolts #BangladeshPeople