25 వేలతో ప్రపంచాన్నే చుట్టేయొచ్చు! ఎన్నిసార్లైనా విమానం ఎక్కేయొచ్చు!

Header Banner

25 వేలతో ప్రపంచాన్నే చుట్టేయొచ్చు! ఎన్నిసార్లైనా విమానం ఎక్కేయొచ్చు!

  Sun Dec 22, 2024 15:29        U S A

ఈమధ్య కాలంలో సందర్శనల కోసం విదేశాలకు వెళ్లడం కామన్ అయిపోయింది. మధ్యతరగతికి చెందిన ప్రజలు కూడా పలు దేశాలను చుట్టేసి వస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే అందుకోసం ప్రతీసారి బడ్జెట్‌లో వచ్చే విమాన సేవలను వెతుక్కుంటున్నారు. వాళ్లు మాత్రమే కాకుండా బిజినెస్ పనుల మీద తరచుగా వేర్వేరు ప్రాంతాలకు వెళ్లే వాళ్లు కూడా విమానాలను ఉపయోగిస్తున్నారు. సడెన్‌గా వెళ్లాల్సి వచ్చినప్పుడు ఎక్కువ డబ్బులు పెట్టి వెళ్లడం ఇష్టంలేక ఇతర మార్గాల్లో వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు. 

 

ఈ విషయం అర్థం చేసుకున్న అమెరికా ఎయిర్ లైన్స్ సంస్థ.. ఓ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. అతి తక్కువ ధరలోనే ప్రపంచాన్ని చుట్టేసే సౌకర్యాన్ని కల్పించింది. కేవలం 299 డాలర్లకే ఏడాది పాటు ఎన్ని సార్లు అయినా విమానం ఎక్కేసే అవకాశాన్ని అందించింది. ఇంత అద్భుతమైన అన్ లిమిటెడ్ ట్రావెల్ పాస్ వల్ల కల్గే లాభాలు ఏంటి.. ఇందుకోసం పాటించాల్సిన నియమాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

 

ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండిఎస్‌బీఐలో 13735 ఖాళీలు! హైదరాబాద్‌ స ర్కిల్‌లో 342 పోస్టులు!

 

అమెరికాలోని ఫ్రాంటియర్ ఎయిర్ లైన్స్ సంస్థ తాజాగా "గోవైల్డ్" అనే 'ట్రావెల్ పాస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం 299 డాలర్లకే (25,388 రూపాయలు) ఏడాది పాటు చెల్లే.. అన్ లిమిటెజ్ ట్రావెల్ పాస్‌ను కల్పించింది. దీని ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు అంతర్జాతీయ విమానాల్లోనూ ప్రయాణించవచ్చు. ప్రపంచంలోని ఏ చోటుకు అయినా వెళ్లవచ్చు. అయితే దేశీయ విమానాలను వినియోగించుకోవాలి అనుకునే వారు ఒక్కరోజు ముందు బుక్ చేసుకుంటే సరిపోతుంది. కానీ వివిధ దేశాలకు వెళ్లాలనుకుంటే మాత్రం 10 రోజుల ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

 

ఈ పాస్‌ను పొందిన వారు ఒక్క సారి విమానంలో వెళ్లడానికి చెల్లించే సొమ్ము 0.01 డాలర్. కానీ పన్నులు, అడిషనల్ ఛార్జీలను, బ్యాగేజీ ఛార్జీలు, సీట్ సెలక్షన్ కోసం మాత్రం మరిన్ని డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ఆఫర్ 2025 మే 1వ తేదీ నుంచి 2026 ఏప్రిల్ 30వ తేదీ వరకు అందుబాటులో ఉండబోతుంది. 2022లో కూడా దేశీయ విమానాల కోసం ఫ్రాంటియర్ ఎయిర్ లైన్స్ సంస్థ ఇదే విధమైన పాస్‌ను ప్రవేశ పెట్టింది. అది సక్సెస్ కావడంతో.. అంతర్జాతీయ సేవలను కూడా అందుబాటులోకి తీసుకు రావాలనుకుని గోవైల్డ్ పాస్‌ను తీసుకువచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అనేక మంది తెగ ఎగ్జైట్ అవుతున్నారు. ఈ సేవులను ఉపయోగించుకోవడానికి ముందుకు వస్తున్నారు. అలాగే ఇందులో ఉండే షరతులను కూడా ముందుగానే తెలుసుకుంటూ.. సరికొత్త అన్‌లిమిటెడ్ ట్రావెల్ పాస్‌ను పొందబోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వెళ్లండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో మద్యం ధరలు తగ్గించుకున్న 11 కంపెనీలు!

  

కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరుఅప్లై చేసుకోండి ఇలా! ఈ డాక్యుమెంట్లు ఉంటే చాలు!

 

తగ్గనున్న అమెరికా వీసా కష్టాలు.. తగ్గనున్న అపాయింట్మెంట్ వెయిట్ టైమ్! ఏ కారణం చేతనైనా..

 

రేషన్ కార్డుదారులకు అలర్ట్! బియ్యంతో పాటు అది కూడా ఇస్తారు.. తీసుకోకపోతే మోసపోయినట్లే!

 

ఏపీలో కొత్త బైపాస్‌ రోడ్డు నిర్మాణం - పూర్తయితే దూసుకుపోవడమే! ఎంపీ రిక్వెస్టుకు కేంద్రం ఓకే!

 

మరికాసేపట్లో పెళ్లి.. ఇంతలోనే సీన్ రివర్స్.. కట్ చేస్తే! కుమార్తె పెళ్లిని రాజకీయం!

 

ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం వినూత్న నిర్ణ‌యం! డ్వాక్రాకు దీటుగా పురుషుల గ్రూపులు! 18 నుంచి 60 ఏళ్ల లోపు.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants