ప్రకాశం జిల్లా లో మరోసారి భూప్రకంపనలు! భయాందోళనకు గురైన ప్రజలు!

Header Banner

ప్రకాశం జిల్లా లో మరోసారి భూప్రకంపనలు! భయాందోళనకు గురైన ప్రజలు!

  Thu Jan 02, 2025 15:50        India

ప్రకాశం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు భయాందోళనలకు గురిచేశాయి. గురువారం మధ్యాహ్నం జిల్లాలోని రేపాయి, ముండ్లమూరు మండలంలోని గ్రామాల్లో సెకన్‌ పాటు భూమి కంపించింది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గత నెల ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలంలో గత నెల 21, 22వ తేదీల్లో వరుసగా ఉదయం 10.35 నుంచి 10.40 గంటల మధ్య కొన్ని క్షణాలపాటు రెండురోజులు భూమి కంపించడంతో ప్రజలు ఆందోళనకు లోనయ్యారు. ముండ్లమూరు, శింగన్నపాలెం, వేంపాటు, పెద్దఉల్లగల్లు, పసుపుగల్లు గ్రామాల్లో భూమి కంపించిందని స్థానికులు ఆందోళనకు గురయ్యారు. తాజాగా గురువారం కూడా ఇదే మండలంలోని పలు గ్రామాల్లో భూమి కంపించడం ఆందోళనకు గురి చేస్తుందని గ్రామస్థులు పేర్కొన్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
వైసీపీకి మరో ఊహించని బిగ్ షాక్! ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా! ఇప్పట్లో ఆగవేమో!

 

సూపర్ ఆఫర్.. ఇదీ కావాల్సింది.. అంటూ.. మందుబాబులు! ఆ ఆఫర్ ఏంటో తెలిస్తే క్యూ కట్టాల్సిందే - అక్కడ మాత్రమే!

 

బంగాళాఖాతంపై అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఉగాది పండుగ సందర్భంగా మహిళలకు ప్రత్యేక బహుమతి! సీఎం చంద్రబాబు విస్తృత ప్రణాళిక!

 

రాష్ట్రానికి మరో ప్రాజెక్టులు - లక్షలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు! ఎస్ఐపీబీ సమావేశంలో చంద్రబాబు ఆమోదం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #AndhraPradesh #Earthquake #PrakasamDistrict #Prakasam