1 షేరు కొంటే 3 షేర్లు ఉచితం! ఆ కంపెనీ బంపర్ ఆఫర్! ఆ తేదీ లోపు మాత్రమే!

Header Banner

1 షేరు కొంటే 3 షేర్లు ఉచితం! ఆ కంపెనీ బంపర్ ఆఫర్! ఆ తేదీ లోపు మాత్రమే!

  Thu Jan 02, 2025 17:00        Business

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే డీల్ వచ్చింది. 1 షేరు కొంటే 4 షేర్లు తమ డీమ్యాట్ ఖాతాలోకి రానున్నాయి. అంటే 100 షేర్లు కొంటే 400 షేర్లు వస్తాయి. మరి ఈ ఆఫర్ కొద్ది రోజులే ఉంటుంది. ఈ బోనస్ షేర్లు, స్టాక్ స్ప్లిట్ సంబంధించిన రికార్డ్ తేదీని కంపెనీ తాజాగా ప్రకటించింది. ఆ లోపు కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఉచితంగా షేర్లు అందనున్నాయి. ఆ కంపెనీ ఏది, ఆఫర్ వివరాలు ఏమిటి? అనే విషయాలు తెలుసుకుందాం.

 

ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ బీఎన్ రాఠీ సెక్యూరిటీస్ (BN RATHI SECURITIES) తమ ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కళ్లు చెదిరే డీల్ తీసుకొచ్చింది. స్టాక్ స్ప్లిట్‌తో పాటుగా బోనస్ షేర్లు ప్రకటించింది. ఒకేసారి డబుల్ ధమాకా అన్నమాట. వాటికి సంబంధించిన రికార్డు తేదీని కూడా తాజాగా ప్రకటించింది. ఈ కంపెనీ స్టాక్ ఇప్పటి వరకు ఏకంగా 8,526 శాతం లాభాలు అందించి మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో ఒకటిగా నిలిచింది. మరి ఈ స్టాక్ డబుల్ ధమాకా, స్టాక్ పని తీరు గురించి తెలుసుకుందాం.

 

స్టాక్ స్ప్లిట్‌తో 1 షేరు 2 షేర్లు..
1:2 నిష్పత్తిల్లో స్టాక్ స్ప్లిట్ చేపడతున్నట్లు బీఎన్ రాఠీ సెక్యూరిటీస్ ప్రకటించింది. రూ. 10 ముఖ విలువ గల ప్రతి ఈక్విటీ షేరును రూ. 5 ఫేస్ వాల్యూ గల 2 షేర్లుగా మార్చనుంది. ఈ మేరకు స్టాక్ ఎక్స్చేంజీ ఫైలింగ్‌లో తెలియ జేసింది. స్టాక్ స్ప్లిట్ రికార్డు తేదీని జనవరి 24, 2025గా ఖరారు చేసినట్లు వెల్లడించింది. ఆ తేదీలోపు ఈ కంపెనీ షేర్లు కొనుగోలు చేసిన వారికి 1 షేరు 2 షేర్లుగా మారనుంది. 

 

ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

1:1 రేషియోలో బోనస్ షేర్లు..
బీఎన్ రాఠీ సెక్యూరిటీస్ సంస్థ బోనస్ షేర్లు సైతం జారీ చేస్తోంది. 1:1 రేషియోలో బోనస్ షేర్లు ప్రకటించింది. అంటే ప్రతి షేరుకు మరొక షేరును బోనస్ రూపంలో ఉచితంగా అందించనుంది. దీనికి సైతం రికార్డు తేదీని జనవరి 24గానే నిర్ణయించింది. ఆ తేదీ నాటికి షేర్లు కొన్నట్లయితే బోనస్ షేర్లు పొందేందుకు అర్హత పొందుతారు. 1 షేరుకు మరో షేరు ఫ్రీగా వస్తుంది. స్టాక్ స్ప్లిట్, బోనస్ షేర్ల ద్వారా 1 షేరు కొన్న వారికి 4 షేర్లు అవుతాయి. అంటే 100 షేర్లు ఉంటే 400 షేర్లు తమ డీమ్యాట్ ఖాతాలోకి వస్తాయి. అయితే, స్టాక్ ధర మారుతుందని గమనించాలి.

 

దూసుకెళ్తున్న స్టాక్..
స్టాక్ స్ప్లిట్, బోనస్ షేర్ల ప్రకటించిన నేపథ్యంలో బీఎన్ రాఠీ సెక్యూరిటీస్ షేరు ఇవాళ్టి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో దూసుకెళ్తోంది. గత ఐదు సెషన్లలో 30 శాతానికిపైగా పెరిగింది. గడిచిన 6 నెలల్లో ఈ స్టాక్ 107 శాతం లాభాల ఇచ్చింది. గత ఏడాది కాలంలో188 శాతం పెరిగింది. ప్రస్తుతం షేరు ధర రూ. 267 వద్ద ఉంది. అలాగే కంపెనీ మార్కెట్ విలువ రూ. 272.76 కోట్లుగా ఉంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 284.75 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ. 86.65 వద్ద ఉంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
వైసీపీకి మరో ఊహించని బిగ్ షాక్! ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా! ఇప్పట్లో ఆగవేమో!

 

సూపర్ ఆఫర్.. ఇదీ కావాల్సింది.. అంటూ.. మందుబాబులు! ఆ ఆఫర్ ఏంటో తెలిస్తే క్యూ కట్టాల్సిందే - అక్కడ మాత్రమే!

 

బంగాళాఖాతంపై అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఉగాది పండుగ సందర్భంగా మహిళలకు ప్రత్యేక బహుమతి! సీఎం చంద్రబాబు విస్తృత ప్రణాళిక!

 

రాష్ట్రానికి మరో ప్రాజెక్టులు - లక్షలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు! ఎస్ఐపీబీ సమావేశంలో చంద్రబాబు ఆమోదం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

   


   #AndhraPravasi #Business #Stocks #StockMarkets #MarketCrash