2024లో తిరుమల వెంకన్న హుండీ ఆదాయం ఎంతో తెలుసా? జులై-ఆగస్టులో రికార్డ్ బ్రేక్!

Header Banner

2024లో తిరుమల వెంకన్న హుండీ ఆదాయం ఎంతో తెలుసా? జులై-ఆగస్టులో రికార్డ్ బ్రేక్!

  Thu Jan 02, 2025 18:09        Others

నూతన సంవత్సరం నేపథ్యంలో గతేడాది తిరుమల శ్రీవారి హుండీ లెక్కలను టీటీడీ వెల్లడించింది. 2024లో హుండీ ద్వారా వెంకన్నకు 1,365 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపింది. ఈ లెక్కన.. సగటున ఒక్కో నెల హుండీ ఆదాయం 113.75కోట్లు టీటీడీ ఖాతాకు జమవుతోంది. సగటున ఒక్క రోజు హుండీ ఆదాయం 3.73కోట్లుగా రికార్డకెక్కుతోంది. గతేడాదిలో జులై, ఆగస్టులో అత్యధికంగా 125 కోట్ల హుండీ ఆదాయం లభించింది. భక్తులు సామాజిక, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా కానుక ప్రియుడైన శ్రీ వేంకటేశ్వరునికి వ్యవసాయ ఉత్పత్తులు, బెల్లం, నవధాన్యాలు, పశువులు, బంగారం, వాహనాలు, విలువైన రాళ్లు, విదేశీ కరెన్సీ, భూమితో సహా వివిధ కానుకలను సమర్పిస్తూ ఉంటారు. శ్రీవారికి ముడుపులు కట్టి హుండీలో భక్తులు చెల్లించే కానుకలు టీటీడీకి కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుతున్నాయి.



ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 



తిరుమలేశుడి హుండీ ఆదాయం ప్రతి నెల వంద కోట్లు క్రాస్ అవుతుండడంతో వెంకన్న ఆదాయం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఎంతలా అంటే.. కొవిడ్ తర్వాత గత 33 నెలలుగా వంద కోట్ల ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. ఈ క్రమంలోనే.. సామాన్య భక్తుల నుండి సంపన్నుల వరకు హుండీలో సమర్పిస్తున్న కానుకలతో గతేడాది శ్రీవారి హుండీ ఆదాయం 1,365 కోట్ల రూపాయలు దాటింది. హుండీ ద్వారా సగటు రోజువారీ సాధారణ రోజుల్లో రూ.3.6 కోట్లు, వారాంతాల్లో రూ.3.85 కోట్లుగా ఉంది. డిసెంబర్ 31న ఆలయానికి హుండీ ఆదాయం రూ.4.10 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. గత ఏడాది సుమారు 99 లక్షల మంది భక్తులు తలలు నీలాలు ససమర్పించగా... 9 లక్షల మంది యాత్రికులు తమ మూడు కత్తెర్లు ఇచ్చారు.
2024లో శ్రీవారికి మొత్తం 1,365 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
• -జనవరిలో 116.46 కోట్ల ఆదాయం
• -ఫిబ్రవరిలో 111.71 కోట్లు
• -మార్చిలో 118.49 కోట్లు
• -ఏప్రిల్లో 101. 63 కోట్లు


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



• -మే నెలలో 108.28 కోట్లు
• -జూన్లో 113.64 కోట్లు
• -జులైలో 125.35 కోట్లు
• -ఆగస్టులో 125.67 కోట్లు
• -సెప్టెంబర్లో 114.11 కోట్లు
• -అక్టోబర్లో 107.30 కోట్లు
• -నవంబర్లో 111.30 కోట్లు
• -డిసెంబర్లో 111.27 కోట్లు
మొత్తంగా.. ఏడుకొండలస్వామి ఆదాయం కొండలు కొండలుగా పెరుగుతూనే ఉంది. ఇక.. గతేడాది మొత్తం 2.55 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ ప్రకటించింది.



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు



వైసీపీకి మరో ఊహించని బిగ్ షాక్! ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా! ఇప్పట్లో ఆగవేమో!

 

సూపర్ ఆఫర్.. ఇదీ కావాల్సింది.. అంటూ.. మందుబాబులు! ఆ ఆఫర్ ఏంటో తెలిస్తే క్యూ కట్టాల్సిందే - అక్కడ మాత్రమే!

 

బంగాళాఖాతంపై అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఉగాది పండుగ సందర్భంగా మహిళలకు ప్రత్యేక బహుమతి! సీఎం చంద్రబాబు విస్తృత ప్రణాళిక!

 

రాష్ట్రానికి మరో ప్రాజెక్టులు - లక్షలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు! ఎస్ఐపీబీ సమావేశంలో చంద్రబాబు ఆమోదం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #thirumala #hundi #thirupathi #temple #todaynews #recordbreak #flashnews #latestupdate