గూగుల్ పే, ఫోన్‌పే వంటి యాప్స్ వాడుతున్నారా? ఇక ఆ UPI ఐడీలు పని చేయవు!

Header Banner

గూగుల్ పే, ఫోన్‌పే వంటి యాప్స్ వాడుతున్నారా? ఇక ఆ UPI ఐడీలు పని చేయవు!

  Thu Jan 02, 2025 18:50        Business

మీరు ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్ వాడుతున్నారా? అయితే ఇది మీకోసమే. ఆ కేటగిరీకి చెందిన యూపీఐ ఐడీలు ఇకపై పని చేయవు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI కొత్త రూల్స్ తీసుకొచ్చింది. దీంతో ఆ యూపీఐ ఐడీలను కంపెనీలు బ్లాక్ చేయనున్నాయి. మరి ఆ వివరాలు ఇప్పుడే తెలుసుకుందాం. 

 

మన దేశంలో డిజిటల్ పేమెంట్లు వేగంగా వృద్ధి చెందాయి. ప్రధానంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) పేమెంట్లు అధికంగా జరుగుతున్నాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా యూపీఐ పేమెంట్లు భారీగా చేస్తున్నారు. కిరాణ షాప్ నుంచి పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్ల వరకు వీటిని ఉపయోగించేందుకు అవకాశం ఉన్న క్రమంలో నిత్యంక కోట్లలో ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. ఒక్కొక్కరు రెండు, మూడు అంటూ పలు కంపెనీల యూపీఐ యాప్స్ ఉపయోగిస్తున్నారు. ఇలా ఎక్కువ యాప్స్ వినియోగిస్తున్న వారు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి. అందులో కొన్ని యూపీఐ ఐడీలు పని చేయకుండా ఆగిపోతాయి. 

 

నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ తీసుకొచ్చింది. 2025, జనవరి 1 నుంచి గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ వినియోగిస్తున్నట్లయితే కొన్ని మార్పులు తెలుసుకోవాలి. ఎక్కువ కాలం వినియోగించని ఇనాక్టివ్ యూపీఐ ఐడీలను బ్లాక్ చేయనున్నారు. భద్రతా సమస్యలను పరిష్కరించేందుకు ఎన్‌పీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఏడాదికిపైగా యూపీఐ ఐడీతో ఎలాంటి ట్రాన్సాక్షన్లు నిర్వహించకపోతే వాటిని ఇనాక్టివ్ యూపీఐ ఐడీలుగా పరిగణిస్తారు. ఇలాంటి ఐడీలన్ని ఇకపై నిలిచిపోనున్నాయి. ఎవరైతే ఒకటికి మించి యూపీఐ ఐడీలు క్రియోట్ చేసుకున్నారో వారు ఓసారి చెక్ చేసుకోవడం మంచిది. 

 

సాధారణంగా మొబైల్ నెట్‌వర్క్ మార్చినప్పుడు, లేదా కొత్త ఫోన్ నంబర్ తీసుకున్నప్పుడు యూపీఐ ఐడీ, బ్యాంక్ ఖాతాకు లింకైన నంబర్ మార్చడం మర్చిపోతారు. ట్రాయ్ నిబంధనల ప్రకారం ఇనాక్టివ్ ఫోన్ నంబర్లను 90 రోజుల తర్వాత కొత్త వారికి కేటాయిస్తాయి టెలికాం సంస్థలు. దీంతో బ్యాంక్ ఖాతా, యూపీఐ ఐడీలకు సమస్యలు తలెత్తుతాయి. కొత్త వారికి మీ యూపీఐ, బ్యాంక్ ఖాతాల యాక్సెస్ లభిస్తుంది. దీంతో మోసాలకు పాల్పడే ప్రమాదం ఉంటుంది. అటువంటి సమస్యలకు చెక్ పెట్టేందుకే ఈ ఇనాక్టివ్ యూపీఐ ఐడీలను బ్లాక్ చేస్తోంది ఎన్‌పీసీఐ. 12 నెలలు అంత కంటే ఎక్కువ కాలం పాటు ఇనాక్టివ్‌గా ఉన్న యూపీఐ ఐడీలను క్లోజ్ చేయనున్నారు. యూపీఐ ప్రొవైడర్లు గత ఏడాది కాలంలో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు నిర్వహించని సంబంధిత మొబైల్ నంబర్లతో పాటుగా యూపీఐ ఐడీలను గుర్తిస్తాయి. ఇలాంటి ఇనాక్టివ్ యూపీఐ ఐడీలను ఇన్‌వర్డ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్లు బ్లాక్ చేస్తారు. యూపీఐ మ్యాపర్ నుంచి డీరిజిస్టర్ చేస్తారు. అయితే, ఇలా ఇనాక్టివ్ అయిన మళ్లీ యాక్టివ్ చేసుకోవచ్చు. అందుకోసం యూపీఐ యాప్‌లోకి వెళ్లి బ్యాంక్ ఖాతాకు లింకైన మొబైల్ నంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
వైసీపీకి మరో ఊహించని బిగ్ షాక్! ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా! ఇప్పట్లో ఆగవేమో!

 

సూపర్ ఆఫర్.. ఇదీ కావాల్సింది.. అంటూ.. మందుబాబులు! ఆ ఆఫర్ ఏంటో తెలిస్తే క్యూ కట్టాల్సిందే - అక్కడ మాత్రమే!

 

బంగాళాఖాతంపై అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఉగాది పండుగ సందర్భంగా మహిళలకు ప్రత్యేక బహుమతి! సీఎం చంద్రబాబు విస్తృత ప్రణాళిక!

 

రాష్ట్రానికి మరో ప్రాజెక్టులు - లక్షలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు! ఎస్ఐపీబీ సమావేశంలో చంద్రబాబు ఆమోదం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Business #PhonePay #GooglePay #UPI #Paymennts