కొత్త ఏడాదిలో మరో కొత్త స్కీమ్! రూ.500 ఉంటే చాలు! జనవరి 16 వరకే ఛాన్స్!

Header Banner

కొత్త ఏడాదిలో మరో కొత్త స్కీమ్! రూ.500 ఉంటే చాలు! జనవరి 16 వరకే ఛాన్స్!

  Thu Jan 02, 2025 20:23        Business

ఈక్విటీ ఇన్వెస్టర్లకు ఈ కొత్త ఏడాదిలోనూ కొత్త పథకాలు అందుబాటులోకి వస్తున్నాయి. మొదటి రోజునే ప్రముఖ ఏఎంసీ యూటీఐ కొత్త స్కీమ్ ప్రకటించింది. ఇందులో ఇన్వెస్ట్ చేసేందుకు జనవరి 16 వరకే అవకాశం ఉంటుంది. కనీస పెట్టుబడి రూ.500 నుంచి మొదలవుతోంది. మరి ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

 

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే వారిలో చాలా మంది కొత్త ఫండ్ ఆఫర్ల కోసం చూస్తుంటారు. అలాంటి వారందరికీ ఈ కొత్త సంవత్సరం 2025 తొలి రోజునే అదిరే శుభవార్త అందించింది ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ యూటీఐ మ్యూచువల్ ఫండ్. న్యూ ఫండ్ ఆఫర్ ప్రకటించింది. యూటీఐ క్వాండ్ ఫండ్ పేరుతో ఈ స్కీమ్ తీసుకొస్తోంది. మరి ఇందులో కనీస పెట్టుబిడ ఎంత? సబ్‌స్క్రిప్షన్ ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుంది? అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

 

యూటీఐ క్వాంట్ ఫండ్ ఒక ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీమ్. పరిమాణాత్మక పెట్టుబడి థీమ్‌తో ఈ స్కీమ్ తెచ్చింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ సబ్‌స్క్రిప్షన్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టేందుకు జనవరి 16 వరకు సబ్‌స్క్రిప్షన్ అవకాశం ఉంటుంది. ఆ తర్వాత యూనిట్ల కేటాయింపు ఉంటుంది మళ్లీ జనవరి 24వ తేదీ నుంచి ఓపెన్ మార్కెట్లో క్రయ విక్రయాలకు ఈ స్కీమ్ అందుబాటులోకి వస్తుంది. ఈక్విటీ, ఈక్విటీ అనుబంధ పెట్టుబడి మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి దీర్ఘకాలంలో మూలధన లాభాలు అందించాలనే లక్ష్యంతో ఈ స్కీమ్ తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది.

 

నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈ స్కీమ్ బెంచ్ మార్క్ బీఎస్ఈ 200 టీఆర్ఐగా ఉంది. ఈ కొత్త పథకాన్ని శర్వాన్ కుమార్ గోయల్, దీపేశ్ అగర్వాల్‌లు నిర్వహిస్తారని యూటీఐ మ్యూచువల్ ఫండ్ తెలిపింది. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టి యూనిట్ల కేటాయింపు జరిగిన 90 రోజుల్లోపు తమ డబ్బులు వెనక్కి తీసుకుంటే 1 శాతం మేర ఎగ్జిట్ లోడ్ పడుతుంది. ఆ తర్వాత అయితే ఎలాంటి ఛార్జీలు (ఎగ్జిట్ లోడ్) లేకుండా డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు. ఈస్కీమ్‌లో ఒకేసారి పెట్టుబడి పెట్టేందుకు కనీస్ పెట్టుబడి రూ.1000గా ఉంది. ఆ తర్వాత ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా అయితే కనీస పెట్టుబడి నెలకు రూ.500గా ఉంది. త్రైమాసికానికి అయితే రూ.1500గా ఉంది.

 

ఈ కొత్త స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసే డబ్బులను 80-100 శాతం ఈక్విటీ, ఈక్విటీ అనుబంధ రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. మిగిలిన 0-20 శాతం డెట్, మనీ మార్కెట్ ఇన్‌స్ట్రూమెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే 0-10 శాతం ఆర్ఈఐటీ, ఇన్వైటీలు జారీ చేసే యూనిట్లలో పెట్టుబడి పెడతారు. ఈ స్కీమ్ యాక్టివ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీని అనుసరిస్తుంది. దీర్ఘకాలంలో మంచి రాబడి కోరుకునే వారికి ఈ స్కీమ్ సరైన ఎంపికగా ఏఎంసీ తెలిపింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
వైసీపీకి మరో ఊహించని బిగ్ షాక్! ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా! ఇప్పట్లో ఆగవేమో!

 

సూపర్ ఆఫర్.. ఇదీ కావాల్సింది.. అంటూ.. మందుబాబులు! ఆ ఆఫర్ ఏంటో తెలిస్తే క్యూ కట్టాల్సిందే - అక్కడ మాత్రమే!

 

బంగాళాఖాతంపై అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఉగాది పండుగ సందర్భంగా మహిళలకు ప్రత్యేక బహుమతి! సీఎం చంద్రబాబు విస్తృత ప్రణాళిక!

 

రాష్ట్రానికి మరో ప్రాజెక్టులు - లక్షలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు! ఎస్ఐపీబీ సమావేశంలో చంద్రబాబు ఆమోదం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Business #Investments #Schemes #Government