భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు - ఆ ముగ్గురులో కొత్త కార్యదర్శి... ఎవరంటే!

Header Banner

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు - ఆ ముగ్గురులో కొత్త కార్యదర్శి... ఎవరంటే!

  Sun Jan 05, 2025 11:58        Sports

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కొత్త కార్యదర్శిగా దేవ్‌జిత్ సైకియా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఈ నెల 12న ముంబయిలో బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ కార్యదర్శి, కోశాధికారి పదవులకు ఎన్నిక జరగనున్న నేపథ్యంలో నామినేషన్ల దాఖలు ప్రకియ శనివారంతో ముగిసింది. కార్యదర్శి పదవికి ప్రస్తుత తాత్కాలిక కార్యదర్శిగా ఉన్న దేవ్‌జిత్ సైకియా (అస్సాం), కోశాధికారి పదవి కోసం ఛత్తీస్‌గడ్‌కు చెందిన ప్రభతేజ్‌లు నామినేషన్లు దాఖలు చేశారు. శనివారం సాయంత్రం నామినేషన్ల స్వీకరణ ముగిసే సమయానికి వీరిద్దరే నామినేషన్లు దాఖలు చేయడంతో వీరు ఇద్దరూ ఆయా పదవులకు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం లాంఛనప్రాయమైంది. 12వ తేదీన జరిగే బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో ఎన్నికల అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అచల్ కుమార్ జ్యోతి వీరిరువురి ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు. ఇటీవలి కాలం వరకూ బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన జై షా ఐసీసీ చైర్మన్‌గా ఎన్నిక అవ్వడం, బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన అశిష్ షెలార్ మహారాష్ట్రలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో కార్యదర్శి, కోశాధికారి ఎన్నికల ప్రక్రియను బీసీసీఐ చేపట్టింది.   

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో ప్రధాని మోదీ పర్యటన! ఎప్పుడు? ఎందుకు..?

లోకేశ్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు భారీ శుభవార్త! ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. అకౌంట్లోకి డబ్బులు, చెల్లింపు ఇలా!

పవన్ కల్యాణ్ గారే రియల్ గేమ్ చేంజర్! ర్యాలీ గుర్తొస్తోందన్న రామ్ చరణ్..

లోకేశ్: విద్యాశాఖలో నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఇదే! ఎప్పుడూ టఫ్ టాస్క్ తీసుకుంటా..

ఆ మూడు తేదీల్లోనే శ్రీవారిని దర్శించుకోవాలని అనుకోవద్దు! భక్తులకు టీటీడీ చైర్మన్ విజ్ఞప్తి!

ఏపీలో ఆ 10 జిల్లాలకు కేంద్రం శుభవార్త! నిధులు విడుదల!

గుడ్ న్యూస్.. ఏపీలో కొత్తగా 7 ఎయిర్‌పోర్టులు! ఏ జిల్లాలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, ప్రస్తుతం స్టేటస్ ఏంటంటే!

ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుపై అత్యధిక వికెట్లు! 46 ఏళ్ల రికార్డు బద్దలు..

తల్లికి వందనం పథకం అమలుకు డేట్ ఫిక్స్! మంత్రి కీలక ప్రకటన!

నేడు (4/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఇకపై తెలుగులోనూ ఉత్తర్వులు ఇవ్వాలి! ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు!

HDFC నుంచి మరో 2 కొత్త పథకాలు! రూ.100 ఉంటే చాలు! పూర్తి వివరాలు ఇవే!

రూ.10 వేలలోపు ధరలో... మంచి శాంసంగ్​ ఫోన్లు ఇవే! వాటి ధరలు మారే అవకాశం.. Don't Miss!

ఏపీ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్! మరో కొత్త రైల్వే లైను ప్రకటించిన కేంద్రం!

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు తీపికబురు! రేపటి నుంచి ఆ పథకం అమలు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #devajitsaikia #BCCI #JaiShah #Sports #Cricket