Header Banner

తిరుమలలో సాలకట్ల వసంతోత్సవాలు.. ఆ సేవలకు తాత్కాలిక బ్రేక్! టీటీడీ కీలక నిర్ణయం!

  Thu Apr 10, 2025 10:24        Devotional

టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ రోజు నుంచి తిరుమలలో మూడు రోజుల పాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. అటు ఒంటిమిట్టలో ఈ నెల 11న సీతారామ కల్యాణం వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ నిర్ణయించింది. కల్యాణం కు వచ్చే ప్రతీ భక్తుకుడికి కల్యాణ తలంబ్రాలతో పాటుగా శ్రీవారి లడ్డూ.. అన్న ప్రసాదం అందించేలా నిర్ణయం తీసుకున్నారు. వసంతోత్సవాలు జరిగే మూడు రోజులు ఆర్జిత సేవలను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.

భక్తులకు దర్శనం
తిరుమలలో ఈ రోజు నుంచి వసంతోత్సవాలు జరుగుతున్నాయి. ఆలయం వెనుక వైపున వున్న వసంతమండపంలో వసంతోత్సవాలను అర్చకులు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణ రధంపై తిరుమాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ ఉదయం శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి నాలుగు మాఢ వీధులలో ఊరేగుతూ దర్శనమిచ్చారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేస్తారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు. రేపు (శుక్రవారం) భూ సమేత మలయప్పస్వామి ఉదయం 8 నుండి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాఢ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు.

వసంతోత్సవం
మూడో రోజు (చివరిరోజు) శనివారం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారితో పాటుగా సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. కాగా ప్రతి రోజు సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు. వసంత ఋతువులో మలయప్పస్వామికి జరిగే ఈ ఉత్సవానికి 'వసంతోత్సవ'మని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో ఈరోజు తిరుప్పావడ సేవ నిర్వహిస్తారు.

తలంబ్రాలు - లడ్డూ ప్రసాదం
కాగా ఈ రోజు నుంచి 3 రోజుల వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ అధికారులు రద్దు చేసారు. ఒంటిమిట్ట శ్రీకోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 11వ తేదీన జరుగనున్న శ్రీసీతారాముల కల్యాణం ఏర్పాట్లను టిటిడి అధికారులు పరిశీలించారు. ఒంటిమిట్ట శ్రీ సీతా రాముల‌ కల్యాణానికి విచ్చేసే భ‌క్తుల‌కు అందించేందుకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు సిద్ధమయ్యాయి. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ - 2లో బుధవారం శ్రీవారి సేవ‌కుల‌ సహకారంతో లడ్డూల ప్యాకింగ్‌ నిర్వహిం చారు. మహిళా, పురుష శ్రీ‌వారి సేవ‌కులు 70 వేల లడ్డూలను ప్యాకింగ్ చేశారు. 11వ తేదీ సాయంత్రం 6:30 నుంచి 8:30 గంటల మధ్య అత్యంత వైభ‌వంగా జరిగే రాష్ట్ర పండుగ శ్రీ సీతా రాముల‌ కల్యాణంలో పాల్గొనే భక్తులకు ఈ లడ్డూలను ప్రసాదంగా అందజేయనున్నారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. అమరావతిలో ఇ-13, ఇ-15 కీలక రహదారుల విస్తరణ! అక్కడో ఫ్లైఓవర్ - ఆ ప్రాంతం వారికి పండగే!

 

వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #Tirumala #Vasanthotsavam #TTDUpdates #LordVenkateswara #TirumalaDarshan