కంటెంట్‌ పిచ్చి! ఎత్తైన బ్రిడ్జ్‌ పై నుంచి జారిపడి ఇన్‌ఫ్లుయెన్సర్‌...

Header Banner

కంటెంట్‌ పిచ్చి! ఎత్తైన బ్రిడ్జ్‌ పై నుంచి జారిపడి ఇన్‌ఫ్లుయెన్సర్‌...

  Tue Oct 15, 2024 15:45        Europe

ప్రస్తుత సమాజంలో రీల్స్‌ ట్రెండ్‌ నడుస్తోంది. ప్రతి ఒక్కరి వద్దా స్మార్ట్‌ ఫోన్లు ఉండటంతో.. రాత్రికి రాత్రే స్టార్స్‌ అయిపోవాలని చూస్తున్నారు. ఇందుకోసం సోషల్‌ మీడియాను విచ్చల విడిగా వాడేసుకుంటున్నారు. ఎక్కడున్నాం.. ఏం చేస్తున్నాం..? అవేవీ పట్టించుకోకుండా ప్రాణాలకు తెగించి ప్రమాదకర స్టంట్స్‌ చేస్తున్నారు.

 

ఇంకా చదవండికొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మళ్ళి గట్టి షాక్! ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో! 

 

తాజాగా కంటెంట్‌ క్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాలో లైక్స్‌, షేర్స్‌ కోసం బ్రిటన్‌కు చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్‌ సాహసోపేత స్టంట్‌ చేశాడు. స్పెయిన్‌లోని అత్యంత ఎత్తైన వంతెనను ఎక్కేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకోగా.. ఇప్పుడు ఆలస్యంగా బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రిటన్‌కు చెందిన సదరు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ (26) స్పెయిన్‌లోని అత్యంత పొడవైన తలావెరా డి లా రీనాలోని కాస్టిల్లా-లా కేబుల్‌ బ్రిడ్జ్‌ ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పట్టుకోల్పోయి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. అతడి పూర్తి వివరాలు మాత్రం అధికారులు వెల్లడించలేదు. 

 

ఇంకా చదవండిబంగ్లాదేశీ ఏజెంట్ చేతిలో చిక్కుకొని మోసపోయిన ఆంధ్ర ఆడపడుచులు! చివరికి జీవితాలు బుగ్గి పాలు! గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి హెచ్చరిక! 12

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

కాగా, ఈ వంతెన ఎక్కడంపై నిషేధం ఉందని స్థానిక అధికారులు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వంతెనపైకి పర్యాటకుల్ని అనుమతించడం లేదని స్పష్టం చేశారు. అయితే, కొందరు ఈ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ.. థ్రిల్‌ కోరుకునే పర్యాటకులు సోషల్‌ మీడియా కంటెంట్‌ కోసం తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారన్నారు. ఫలితంగా ఇలాంటి విషాదకరమైన సంఘటనలు జరుగుతున్నాయన్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మీ బెంగళూరులో ఏమో కానీ... ఇక్కడ మాత్రం! జగన్ కు టీడీపీ కౌంటర్! ఏ నిమిషమైనా తాడేపల్లి కొంప వరకు!

 

ఏపీలో మద్యం దుకాణాల కోసం నేడే లాటరీ! అనంతపురం జిల్లాలో 12 షాపులకు అతి తక్కువగా!

 

చంద్రబాబా మజాకా.. మరోసారి ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం! రూ. 4,500 కోట్ల నిధులతో 30,000 అభివృద్ధి!

 

మంత్రి కొండా సురేఖను వదలని వివాదాలు! అధికారులపై ఆగ్రహం వ్యక్తం!

 

వైసీపీకి మరో షాక్! పార్టీ వీడనున్నట్లు మాజీ ఎమ్మెల్యే ప్రకటన!

 

ఆ మాజీ మంత్రిని చంపింది మేమే! లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన!

 

రేపే మద్యం దుకాణాలకు డ్రా! ఎన్ని దరఖాస్తులు వచ్చాయో తెలుసా?

 

పాకిస్థాన్‌లో రెండు తెగల మధ్య ఘర్షణ! 11 మంది దుర్మరణం!

 

దేశంలో తయారయ్యే విదేశీ మద్యం రేట్లు పెరుగుదల! అదనపు ప్రివిలేజ్ ఫీజు వసూలు! గరిష్టంగా ఎంత అంటే?

 

చంపేస్తామంటూ 15 రోజుల క్రితమే వార్నింగ్! అన్నట్టుగానే మాజీ మంత్రి హత్య! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Europe #UK #Spain #Influencer #SocialMedia