గూగుల్ కు భారీ ఫైన్ విధించిన యూరోపియన్ కోర్టు! కారణం ఏంటంటే!

Header Banner

గూగుల్ కు భారీ ఫైన్ విధించిన యూరోపియన్ కోర్టు! కారణం ఏంటంటే!

  Tue Oct 29, 2024 13:00        Europe

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ కు భారీ ఫైన్ పడింది. ఓ స్మాల్ వెబ్సైట్ మీద గూగుల్ చూపిన నిర్లక్ష్యం వల్ల ఆ సంస్థ జరిమానా చెల్లించాల్సి వస్తోంది. వివరాల్లోకెళ్తే.. యూకేకు చెందిన శివన్, ఆడమ్ రాఫ్ జంట 2006లో 'ఫౌండెమ్' అనే వెబ్సైట్ స్టార్ట్ చేశారు. ఈ వెబ్సైట్ మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్ ప్రైస్ లను కంపేర్ చేస్తుంది. అయితే దీన్ని వినియోగంలోకి తీసుకువచ్చిన తరువాత గూగుల్ సెర్చ్ లో క్రమక్రమంగా విజిబిలిటీ తగ్గడం మొదలైంది. ప్రజలు షాపింగ్, ప్రైస్ కంపారిజాన్ వంటి కీవర్డ్స్ ఉపయోగించి గూగుల్ లో వెతికినప్పటికీ వెబ్సైట్ కనిపించకపోవడాన్ని శివన్, ఆడమ్ రాఫ్ కని పెట్టారు.

 

ఇంకా చదవండిపార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?   

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

గూగుల్ కు చెందిన ఆటోమేటెడ్ స్పామ్ ఫిల్టర్స్ విధించిన పెనాల్టీ కారణంగా తమ వెబ్సైట్ పడిపోతుండటాన్ని ఫౌండర్స్ గమనించారు. ఈ విషయాన్ని గూగుల్ దృష్టికి తీసుకెళ్లారు. గూగుల్ రెండేళ్ళైనా ఆ పెనాల్టీని తొలగించలేదు. దీంతో వారు చేసేదేమీ లేక 2010లో యూరోపియన్ కమిషన్ను ఆశ్రయించారు. వారు ఇచ్చిన ఫిర్యాదును కమిషన్ అధికారులు దర్యాప్తు చేసి.. గూగుల్ కంపెనీ తన షాపింగ్ సర్వీసును ప్రమోట్ చేసుకోవడానికే వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవరించి అన్యాయం చేసిందని గుర్తించింది. దీంతో కమిషన్ గూగుల్ సంస్థకు 2.4 బిలియన్ ఫౌండ్స్ (దాదాపు రూ.26వేల కోట్లు) జరిమానా విధిస్తూ 2017లో తీర్పునిచ్చింది. దీనిపై గూగుల్ అప్పీల్ కు వెళ్ళింది. దాదాపు ఏడు సంవత్సరాల తరువాత కమిషన్ ఇచ్చిన తీర్పును 2024లో యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సమర్థించింది. తీర్పు చాలా ఆలస్యమైనా.. తమ సుదీర్ఘ న్యాయ పోరాటానికి ఫలితం దక్కిందని శివన్, ఆడమ్ రాఫ్ అన్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!

 

ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్‌పై మరో కీలక అప్‌డేట్! 24 గంటల్లో గ్యాస్ సిలిండర్లు డెలివరీ! వాళ్లు డబ్బులు కట్టాల్సిందే!

 

USA: ప్రపంచంలోనే అతి పెద్ద డేటా కంపెనీని సందర్శించిన మంత్రి లోకేష్! పెట్టుబడికి సుముఖం! ఎన్ని కోట్లు అంటే!

 

ఏపీలో రైతులకు భారీ శుభవార్త... ఇకనుంచి రూ.3వేలు! అర్హులు ఎవరు అంటే!

 

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జగన్‌కు భారీ షాక్! పతనం కోరుకుంటున్న వైఎస్ షర్మిల!!

 

దీపావళి పండగ ముందు సామాన్యులకు బ్యాడ్‌న్యూస్! భారీగా పెరిగిన వంటనూనె ధరలు! ఎంతో తెలిస్తే షాక్!  

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Technology #Google #Gadgets #Tools #SearchEngine #SearchGPT #AI #ArtificialIntelligence