స్పెయిన్‌లో వరద బీభత్సం! 158కి పెరిగిన మృతుల సంఖ్య! ముమ్మరంగా సహాయక చర్యలు!

Header Banner

స్పెయిన్‌లో వరద బీభత్సం! 158కి పెరిగిన మృతుల సంఖ్య! ముమ్మరంగా సహాయక చర్యలు!

  Fri Nov 01, 2024 13:13        Europe

యూరప్‌ దేశం స్పెయిన్‌ ప్రకృతి ప్రకోపానికి గురైంది. ఇంతకుముందెన్నడూ లేనంత స్థాయిలో భారీ వర్షాలు, వరదలు ఆ దేశ తూర్పు, దక్షిణ ప్రాంతాన్ని ముంచెత్తాయి. గ్రామాలు, పట్టణాలు మొత్తం నీట మునిగాయి. ప్రధాన నగరాలు సైతం నదులను తలపిస్తున్నాయి. కార్లు, పెద్ద పెద్ద కంటైనర్లు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి.

 

ఇంకా చదవండిఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈ వరదల కారణంగా గురువారం వరకూ మరణించిన వారి సంఖ్య 158కి పెరిగింది. కేవలం వాలెన్సియాలోనే 155 మంది మరణించినట్లు గుర్తించారు. వరదల్లో డజన్ల కొద్దీ గల్లంతయ్యారు. ముఖ్యంగా వాలెన్సియా ప్రాంతం ఈ వరదలకు తీవ్ర ప్రభావితమైంది. ఇక్కడ అంచనాలకు మించి వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో ఏడాదికి కురవాల్సిన వర్షం ఎనిమిది గంటల్లో కురిసినట్లు పేర్కొన్నారు. భారీ వృక్షాలు, విద్యుత్‌ లైన్లు, ఇళ్లలోని సామగ్రి కొట్టుకుపోగా.. దుకాణాలు కూడా బుదరలో కూరుకుపోయాయి. రహదారులు సైతం గుర్తుపట్టకుండా మారిపోయాయి. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్! కుటుంబంలో 18 ఏళ్లు నిండిన వారికి శుభవార్త.. రూ.లక్షకు రూ.2 లక్షలు లాభం!Don't Miss

 

చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనలో మార్పు! ఎందుకో తెలుసా..?

 

ఈరోజే నామినేటెడ్ పోస్టుల రెండవ లిస్టు విడుదలటీటీడీ చైర్మన్ ఆయనేనా?

 

పోలీసుల వేషంలో కిడ్నాప్ డ్రామా...చంపుతామని బెదిరింపు! వాహన తనిఖీలో నిందితులు అరెస్ట్!

 

మద్యంపై చేసే ఖర్చులో తెలుగు రాష్ట్రాలే టాప్! సంవత్సరానికి ఎంతో తెలుసా?

 

ఏపీలో మందుబాబులకు వెరైటీ ఆఫర్! ఒక బాటిల్ కొంటే అవి ఫ్రీ!

 

గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ నియామక వివాదం! ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో హల్ చల్!  

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Europe #Spain #Floods