రైల్వే ప్రయాణికులకు షాకింగ్‌ న్యూస్‌! ఆ దుప్పట్లు నెలకోసారే ఉతుకుతారట!

Header Banner

రైల్వే ప్రయాణికులకు షాకింగ్‌ న్యూస్‌! ఆ దుప్పట్లు నెలకోసారే ఉతుకుతారట!

  Wed Oct 23, 2024 13:17        Travel

రైలు ప్రయాణికులకు ఇది చేదు వార్తే. ఏసీ కోచ్‌లలో ప్రయాణికులకు అందించే దుప్పట్లను నెలకోసారి మాత్రమే ఉతుకుతారట. ఈ విషయాన్ని స్వయంగా రైల్వేనే వెల్లడించింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నకు రైల్వే ఇచ్చిన ఈ సమాధానం ప్రయాణికులను ముక్కున వేలేసుకునేలా చేస్తున్నది. ఏసీ కోచ్‌లలో ప్రయాణించే వారికి రైల్వే ఓ బెడ్‌షీట్‌, తలగడ, దుప్పటిని కవర్‌లో పెట్టి అందిస్తుంది. తెల్లగా ఉండే ఇవి చూడగానే శుభ్రంగా ఉన్న భావనను కలిగిస్తాయి. నిజానికి ఈ భావన తప్పని తాజాగా తేలిపోయింది.

 

ఇంకా చదవండిబంగ్లాదేశీ ఏజెంట్ చేతిలో చిక్కుకొని మోసపోయిన ఆంధ్ర ఆడపడుచులు! చివరికి జీవితాలు బుగ్గి పాలు! గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి హెచ్చరిక! 12 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ప్రయాణికులకు అందించే బెడ్‌షీట్‌, పిల్లో కవర్లను మాత్రం ఒకసారి ఉపయోగించిన తర్వాత ఉతుకుతారట. కానీ, దుప్పట్లను మాత్రం వాటి పరిస్థితిని బట్టి నెల, రెండు నెలలకోసారి మాత్రమే శుభ్రం చేస్తారట. అంటే ఒకరు ఉపయోగించిన దుప్పటిని వందలాదిమంది ప్రయాణికులు ఉపయోగిస్తారన్నమాట. రైలు జర్నీ పూర్తి చేసుకున్న తర్వాత దుప్పట్లను శుభ్రంగా ప్యాక్‌ చేసి యథాస్థానంలో పెడతారట. అవి దుర్వాసన వస్తున్నా, మురికిగా అనిపించినా అప్పుడు మాత్రమే వాటిని లాండ్రీకి పంపిస్తామని ఆర్టీఐ కింద అడిగిన ప్రశ్నకు రైల్వే సమాధానం ఇచ్చింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో ఫ్రీ గ్యాస్ సిలిండర్లు.. కావాల్సిన అర్హతలు, డాక్యుమెంట్స్ ఇవే! దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే!

 

మీ పేరుతో ఎక్కువ సిమ్ కార్డులు ఉన్నాయా? భారీ జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష తప్పదు! ఎందుకో తెలుసా?

 

మహిళలు తస్మాస్ జాగ్రత్త.. ఈ లక్షణాలు ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు! 30 నుంచి 52 సంవత్సరాల..

 

విజయవాడ మెట్రోని అమరావతికి అనుసంధానం చేయాలి! కేంద్రరాష్ట్ర మంత్రుల కీలక భేటీ!

 

తిరుపతిలో రాజకీయ కక్షలతో తెదేపా నేత హత్య! పెట్రోల్ పోసి నిప్పంటించి దారుణం!

 

మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!

    

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Travel #Trains #TrainTravel #GoaTravel #GoaVibes #GoaIsOn #Secundrabad #SpecialTrainToGoa #Vascodagama