గుంటూరు: ప్రత్తిపాడులో నార్త్ అమెరికా తెలుగు సంగం NATS ఉచిత కంటి వైద్య శిబిరం! హాజరైన పలువురు ప్రముఖులు! 1000 మందికి పైగా తరలి వచ్చిన ప్రజలు!

Header Banner

గుంటూరు: ప్రత్తిపాడులో నార్త్ అమెరికా తెలుగు సంగం NATS ఉచిత కంటి వైద్య శిబిరం! హాజరైన పలువురు ప్రముఖులు! 1000 మందికి పైగా తరలి వచ్చిన ప్రజలు!

  Mon May 27, 2024 13:00        Associations

ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండలి పెద్దలు చెప్పే మాటకు ఆదర్శం బాపు సేవలు అభినందనీయం: ఎమ్మెల్సీ KS లక్ష్మణరావు అన్నారు

 

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం. పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నాట్స్ సహకారం తో ఉచిత మెగా కంటి వైద్య శిబిరంలో లక్ష్మణరావు మాట్లాడుతూ... రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతమైన సేవా కార్యక్రమాలు నిర్వహించడం పేద ప్రజలకు అందించటం గొప్ప విషయం అన్నారు. నాట్స్ చేపట్టేటువంటి కార్యక్రమాల్లో నేను కూడా భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని అన్నారు. రెండు రాష్ట్రాల్లో కుట్టు మిషన్ శిక్షణ శిబిరాలు, ఉచిత కంటి వైద్య శిబిరాలు ,ప్రభుత్వ పాఠశాలలకు సైకిల్ స్టాండు నిర్మాణం ,మెడికల్ క్యాంపులు నిర్వహించడం, గ్రూప్ 2 అభ్యర్థులకు ఉచితంగా మెటీరియల్ అందజేయడం అభినందనీయమన్నారు.

 

నాట్స్ అద్యక్షులు నూతి బాపయ్య చౌదరి (బాపు) మాట్లాడుతూ ఈ 3 సంవత్సరాల కాలంలో పేద ప్రజలను లక్ష్యంగా చేసుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. నల్లమల ఫారెస్ట్ లో నివసించేటువంటి గిరిజనులకు కూడా నాట్స్ సేవలను విస్తృతపరిచామని అన్నారు. అధ్యక్షుడిగా ఉండి పేద ప్రజలకు సేవలు చేయటం సంతోషంగా ఉందన్నారు. నాట్స్ ఆధ్వర్యంలో యూత్ ఎంపవర్మెంటు మరియు ఉమెన్ ఎంపవర్మెంట్ కార్యక్రమాలు చేయడం ఎంతో సంతృప్తి అందించిందని అధ్యక్ష పదవి అనంతరం కూడా యధాతధంగా సేవలు కొనసాగిస్తామనీ శంకర్ కంటి వైద్యశాల ప్రజలకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తుందని వారు కొనియాడారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆల్ ఇండియా లాయర్ యూనియన్ రాష్ట్ర నాయకులు నర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ.... ఈ మూడు సంవత్సరాల కాలంలో నాట్స్ ఆధ్వర్యంలో పెదనందిపాడు లో చేపట్టినటువంటి మెగా కంటి వైద్య శిబిరాలు విజయవంతంగా పేద ప్రజలు పాల్గొని ఉపయోగించుకున్నారన్నారు. ముందుగా కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. సభలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, మాజీ ఎంపీపీ నర్రా బాలకృష్ణ ,ముద్దన నాగరాజుకుమారి ,పారిశ్రామిక వేత్తలు దాసరి శేషగిరిరావు, శీలం అంకారావు ,కొల్లా సాంబశివరావు (నవత) మాట్లాడారు. ఉచిత మెగా కంటి వైద్య శిబిరంలో 620 మంది పరీక్షలు చేయించుకొనగా 374 మంది ఆపరేషన్ల కు ఎంపిక కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో NRI ఆళ్ల వెంకట్, రావి శివరామకృష్టయ్య దివి నాగరాజు,ఆళ్ల రాజారావు వెలిశెట్టి రమణ కంటి వైద్య శిబిరం నిర్వహణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

ఆళ్ల వెంకటరమణ మాట్లాడుతూ NATS సంస్థ ద్వారా రెండు రాష్ట్రాలలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కంటి వైద్యం కోసం ఏర్పాటుచేసిన మూడో క్యాంప్ ఇది. వెయ్యి మందికి పైగా ఇక్కడ వైద్య సేవలు అందుకోడానికి వచ్చారు. ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు బాపు గారికి మరియు NATS సంస్థకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామస్తులు ముందుకొస్తే తాము చేయగలిగినంత సహాయం చేస్తామని ఆయన అన్నారు. గ్రామాలలో సమస్యలు పరిష్కరించి, ఇన్ఫ్రా స్ట్రక్చర్, శానిటేషన్ అభివృద్ధి చేయాలనే ప్లాన్ లో ఉన్నాము అని తెలిపారు.

 

ఇవి కూడా చదవండి: 

ఐపీఎల్ లో కోల్‌కతా గెలవడం పై స్పందించిన మమతా బెనర్జీ! రానున్న సంవత్సరాల్లో కూడా కోల్‌కతా అద్బుత విజయాలు సాధిస్తుంది! ఎక్స్ లో పోస్ట్! 

 

హైదరాబాద్ ఓటమితో కన్నీళ్లు పెట్టుకున్న కావ్య! వీడియో వైరల్! ఎడవకమ్మా... వచ్చేసారి గెలుస్తారులే అంటున్న నెటిజెన్లు! 

 

ఖతార్ ఎయిర్‌వేస్‌ విమానంలో అల్లకల్లోలం! గాయపడిన 12 మంది ప్రయాణికులు! క్యాబిన్ సిబ్బంది కూడా! 

 

ABV పోస్టింగ్ పై కొనసాగుతున్న ఉత్కంఠ! రిటైర్మెంట్ కు ఇంకా 4 రోజులే! ప్రభుత్వం ఏం చేయనుంది! 

 

ప్రయాణికులకు ముఖ్య గమనిక! యూఏఈ-ఇండియా మధ్య పలు విమానాలు రద్దు! రెమల్ తుఫాను కారణంగా! 

 

పర్యాటకుల కోసం అవస్థలు పడుతున్న మాల్దీవ్స్! దేశాన్ని సందర్శించమంటూ టూరిస్ట్ లకు విజ్ఞప్తి! తగ్గిపోతున్న ఆదాయం! 

 

అమెరికాలో మొదటి జడ్జిగా ప్రమాణ స్వీకారం - జయ బాడిగ! తెలుగు లోనే అద్భుతంగా! ఇలాంటి వారినే కదా ఆదర్శంగా తీసుకోవాలి! 

 

కువైట్: అక్రమ మద్యం తయారీ కేంద్రం సీజ్! నలుగురు ప్రవాసులు అరెస్ట్! 

 

తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన రేవ్ పార్టీ కేసు! ఏపీ మంత్రి అనుచరుడి అరెస్ట్! 

 

గుజరాత్ లో తీవ్ర విషాదం! మంటల్లో చిక్కుకొని 22 మంది సజీవ దహనం! భారీ అగ్ని ప్రమాదం! కొనసాగుతున్న సర్చ్ ఆపరేషన్! 

 

యూఏఈ: టూరిస్ట్ లకు పెద్ద షాక్ ఇచ్చిన ప్రభుత్వం! వీసా గడువు తీరిపోతే భారీ జరిమానాలు! ముఖ్యంగా ఏజెన్సీలకు! 

 

వామ్మో... మీరు ఎప్పుడైనా విన్నారా ఇది! ఎలుగుబంటి మాంసం తిని ఆసుపత్రి పాలైన కుటుంబం! మెదడుకి సోకిన పురుగులు! 

                       

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Associations #TeluguMigrants #NATS #Guntur #EyeCheckingCamp