వాషింగ్టన్: భారత తొలి స్పేస్ టూరిస్టుగా విజయవాడ వాసి? 90 ఏళ్ల వయసులో నెరవేరిన కల

Header Banner

వాషింగ్టన్: భారత తొలి స్పేస్ టూరిస్టుగా విజయవాడ వాసి? 90 ఏళ్ల వయసులో నెరవేరిన కల

  Mon May 20, 2024 09:25        Travel, Technology, U S A

తెలుగు తేజం గోపీచంద్ తోటకూర ఆదివారం దిగ్విజయంగా రోదసియాత్ర చేశారు. భారత తొలి అంతరిక్ష పర్యాటకుడిగా చరిత్ర సృష్టించారు. రాకేశ్ శర్మ తర్వాత రోదసియాత్ర చేసిన రెండో భారతీయుడిగా గుర్తింపు పొందారు. న్యూషెపర్డ్ రాకెట్ కు ఇది ఏడో మానవసహిత అంతరిక్షయాత్ర. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9.36 గంటలకు పశ్చిమ టెక్సాస్లోని ప్రయోగ వేదిక నుంచి ఇది నింగిలోకి దూసుకెళ్లింది.

 

అమెరికా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ రూపొందించిన న్యూషెపర్డ్-25 (ఎన్ఎస్-25) వ్యోమనౌకలో గోపీచంద్ ఈ యాత్ర పూర్తిచేశారు. తాజా యాత్రలో గోపీచంద్ తోపాటు వెంచర్ క్యాపిటలిస్ట్ మేసన్ ఏంజెల్, ఫ్రాన్స్ పారిశ్రామికవేత్త సిల్వైన్ చిరోన్, అమెరికా టెక్ వ్యాపారి కెన్నెత్ ఎల్ హెస్, సాహస యాత్రికురాలు కరోల్ షాలర్, అమెరికా వైమానికదళ మాజీ కెప్టెన్ ఎడ్ డ్వైట్ పాల్గొన్నారు. డ్వైట్ 1961లో అంతరిక్షయానానికి ఎంపికైన తొలి ఆఫ్రోఅమెరికన్ వ్యోమగామి. వివిధ కారణాల వల్ల ఆయనకు రోదసిలోకి వెళ్లే అవకాశం రాలేదు. ఇప్పుడు 90 ఏళ్ల వయసులో ఆ కల నెరవేరింది. రోదసియాత్ర చేసిన అత్యంత పెద్ద వయస్కుడిగా ఆయన గుర్తింపు పొందారు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

భారత్ కు  చెందిన రాకేశ్ శర్మ 1984లో అంతరిక్షయానం చేశారు. ఆ తర్వాత కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, రాజాచారి, శిరీష బండ్ల కూడా రోదసి యాత్రలు చేసినప్పటికీ.. వీరంతా భారత మూలాలున్న అమెరికా పౌరులు. గోపీచంద్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నప్పటికీ ఆయనకు భారత దేశ పాస్ పోర్ట్ ఉంది. అందువల్ల రాకేశ్ శర్మ తర్వాత రోదసిలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా ఆయన గుర్తింపు పొందారు. దీనికితోడు ఆయన పర్యాటకుడి హోదాలో అంతరిక్షయానం చేశారు. తద్వారా భారత తొలి స్పేస్ టూరిస్టుగా గుర్తింపు పొందారు. విజయవాడలో పుట్టిన గోపీచంద్ తోటకూర.. అట్లాంటా శివారులోని 'ప్రిజర్వ్ లైఫ్’ సంస్థకు సహ-వ్యవస్థాపకుడిగా ఉన్నారు. గోపీచంద్ పైలట్గానూ శిక్షణ పొందారు. వాయు మార్గంలో రోగుల అత్యవసర తరలింపు విభాగంలో సేవలు అందించారు.

ఇవి కూడా చదవండి:

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు! AI పరంగా మొదటి స్థానం! రానున్న కాలం లో భారత దేశానిదే! 

 

ఏపీ ఎన్నికల ఫలితాల పై ఇంటెలిజెన్స్ అలర్ట్! కేంద్ర సాయుధ బలగాలు

  

జమ్మలమడుగులో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సమీక్ష! ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులను! 

 

కిర్గిస్తాన్ లోని భారతీయ విద్యార్ధులు ఇళ్లలోనే ఉండాలి! మంత్రి జై శంకర్ హెచ్చరికలు! అత్యవసర పరిస్థితుల్లో ఎంబసీ ని సంప్రదించాలి! 

 

 Evolve Venture Capital 

 

చంద్రబాబు దంపతుల విదేశీ పర్యటన! వారం రోజులపాటు అమెరికాలో! నేటి నుండి మొదలు! 

 

ఓరి దేవుడో! పిల్ల ఏనుగుకు ఇంత సెక్యూరిటీ నా! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో! 

 

ఉప్పును తగ్గిస్తే 25 లక్షల ప్రాణాలు కాపాడొచ్చు! ప్రజలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన! 

   

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 


   #USA #AndhraPravasi #Pravasi #TeluguMigrants #Washington