ఓరి దేవుడో... ఇదెక్కడి టెక్నాలజీ రా బాబు! మెదడులో మైక్రో చిప్ తో కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ వాడుతున్న యువకుడు! వైరల్ అవుతున్న వీడియో!

Header Banner

ఓరి దేవుడో... ఇదెక్కడి టెక్నాలజీ రా బాబు! మెదడులో మైక్రో చిప్ తో కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ వాడుతున్న యువకుడు! వైరల్ అవుతున్న వీడియో!

  Mon May 20, 2024 13:48        Technology

ప్రపంచ కుబేరుడు ఎలోన్‌ మస్క్‌ కు చెందిన న్యూరోటెక్నాలజీ సంస్థ న్యూరాలింక్‌ పక్షవాతానికి గురైన ఓ యువకుడి జీవితంలో కొత్త ఆశలను చిగురింపజేసింది. నోలాండ్ అర్బా అనే యువకుడి మెదడులో విజయవంతంగా చిప్‌ అమర్చడం ద్వారా అతని చేతులు పనిచేయకపోయినా కేవలం మెదడులోని ఆలోచనలతోనే అతను కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించేలా చేసింది. తద్వారా మనిషి మెదడులో ఇంప్లాంట్ అమర్చిన తొలి సంస్థగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 

 

ఇందుకు సంబంధించిన వీడియోను ఎలాన్ మస్క్ స్వయంగా నెటిజన్లతో ఇటీవల పంచుకున్నారు. తన సొంత సంస్థ ‘ఎక్స్’లో వీడియోను పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తన అనుభవాలను నోలాండ్ తాజాగా ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ షోలో పంచుకున్నాడు. 2016లో సమ్మర్‌ క్యాప్‌ కౌన్సిలర్‌గా పనిచేసే సమయంలో నోలాండ్‌ అర్బా టెక్సాస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో అతని వెన్నెముక విరగడంతో పక్షవాతానికి గురయ్యాడు. అప్పటి నుంచి వీల్‌ ఛైర్‌కే పరిమితమయ్యాడు. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మెడకింది భాగం వరకు చచ్చుపడిపోవడంతో నోలాండ్ చేతులు, కాళ్లు పనిచేయక ఏ పనీ చేసుకోలేకపోయాడు. అయితే మానవ మెదడులో ఎలక్ట్రానిక్‌ చిప్‌ను అమర్చే ప్రయోగాలు చేస్తోన్న న్యూరాలింక్‌ ఈ ఏడాది మార్చిలో నోలాండ్‌ అర్బా పుర్రెలో ఓ భాగాన్ని రోబో శస్ర్త చికిత్స ద్వారా తొలగించింది. అందులో 8 మిల్లీమీటర్ల వ్యాసంగల ఎన్‌1 అనే చిప్‌ను అమర్చింది. 

 

అయితే నోలాండ్ ఆర్బా మెదడులోని చిప్‌లో కొన్ని రోజులకే సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. అందులోని డేటా అంతా చెరిగిపోయింది. దీంతో న్యూరాలింక్‌ సంస్థ బాధితుడి బ్రెయిన్‌ నుంచి చిప్‌ను సరిచేసింది. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానంటూ నోలాండ్‌ ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘ఈ చిప్‌ నా జీవితాన్ని మార్చేసింది. కానీ ఒక్కసారిగా చిప్‌లో డేటా పోవడంతో భయపడ్డా. మళ్లీ నేను కంప్యూటర్ పై పనిచేసుకోలేనేమోనని ఏడ్చేశా. కానీ న్యూరాలింక్ అద్భుతం చేసింది. చిప్ లో సాంకేతికతకు మార్పులు చేయడంతో అది ఇప్పుడు బాగా పనిచేస్తోంది’ అని నోలాండ్ పేర్కొన్నాడు.

 

ఇవి కూడా చదవండి: 

బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసుల దాడి! తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు గుర్తింపు! మాదకద్రవ్యాలు స్వాధీనం! 

 

జూలై 20, 21 న కమ్మ గ్లోబల్ సమ్మెట్! విజయవాడలో ప్రముఖులతో సమావేశం! ప్రపంచానికి కమ్మవారు చేసే మేలు పై అవగాహన! 

 

జియో ఫోన్ వినియోగదారులకు శుభవార్త! ఈజీగా ట్రైన్ టికెట్ బుకింగ్ తో పాటు మరెన్నో! ఆలస్యం ఎందుకు మిత్రమా చూసేయ్! 

 

కిర్గిస్తాన్ లో ఉంటున్న భారతీయ పౌరులకు! విదేశాంగ శాఖ సూచనలు! తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి! 

 

ఐర్లాండ్ వెళ్ళాలి అనుకునే వారికి శుభవార్త! వర్క్ మరియు డిపెండెంట్ వీసాలు సులభతరం! ఆకర్షణీయమైన పథకాలు 

 

సింగపూర్‌లో మరోసారి కరోనా కలకలం! కొత్తగా 25,900 కేసులు నమోదు! మాస్క్ తప్పనిసరి! 

 

కెనడా: అంతర్జాతీయ విద్యార్ధులకు గుడ్ న్యూస్! రెండు సంవత్సరాల పోస్ట్-స్టడీ వర్క్ పొడిగింపు! ఆనందంలో స్టూడెంట్స్! 

 

తస్మాత్ జాగ్రత్త... విశాఖలో పట్టుబడ్డ గ్యాంగ్! విదేశాల్లో ఐటీ ఉద్యోగాలని ఘరానా మోసం! ముగ్గురు ఏజెంట్ లు అరెస్ట్! 

    

కిర్గిస్తాన్ లోని భారతీయ విద్యార్ధులు ఇళ్లలోనే ఉండాలి! మంత్రి జై శంకర్ హెచ్చరికలు! అత్యవసర పరిస్థితుల్లో ఎంబసీ ని సంప్రదించాలి! 

    

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Technology #Innovation #ElonMusk #TeluguMigrants