మీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ ను ఎవరైనా రికార్డు చేస్తున్నారా? ఇలా తెలుసుకోవచ్చు!

Header Banner

మీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ ను ఎవరైనా రికార్డు చేస్తున్నారా? ఇలా తెలుసుకోవచ్చు!

  Fri Nov 08, 2024 11:00        Technology

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఎన్నో సౌకర్యాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా స్మార్ట్ఫోన్ అందుబాటులోకి రావడంతో మానవ జీవితాల్లో గొప్ప మార్పే వచ్చింది. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కూర్చున్నచోటే ఒకే ఒక్క క్లిక్ తో అన్నీ తెలుసుకోవచ్చు. అయితే ఇలాంటి బెనిఫిట్స్తో పాటు నష్టాలు కూడా ఉంటున్నాయి. సైబర్ నేరగాళ్లు టెక్నాలజీని దుర్వినియోగం చేస్తుండటంతో ఫోన్లు హ్యాక్ అవడం, ప్రైవసీ పరమైన ఇబ్బందులు తలెత్తడం వంటి సంఘటనలు తరచుగా ఎక్కడో ఒకచోట జరుగుతున్నాయి. హ్యాకర్లు యూజర్ల ఫోన్ స్క్రీన్ను సీక్రెట్గా రికార్డ్ చేస్తూ బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ చేయడం, పాస్ వర్డ్స్, ప్రైవేట్ సమాచారం దొంగిలించడం వంటివి చేస్తున్నారు. అయితే అలాంటి అనుమానం మీ మదిలో మెదిలితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

 

మీ ఫోన్ గ్యాలరీలో మీరు ఎప్పుడూ చేయకపోయినా స్క్రీన్ రికార్డింగ్స్ ఏమైనా ఉన్నట్లు కనిపిస్తే ఏదో జరుగుతోందని అనుమానించండి. ఎందుకంటే మీ ప్రమేయం లేకుండా హ్యాకర్లు చేసి ఉండవచ్చు. అలాగే స్క్రీన్పై చిన్న గ్రీన్ లైట్స్ కనిపిస్తే మీ ఫోన్ను ఎవరో సీక్రెట్గా రికార్డ్ చేస్తుండవచ్చు. మీ ఫోన్ కెమెరా, ఆడియో ద్వారా సైబర్ నేరగాళ్లు సమాచారాన్ని రికార్డ్ చేసే అవకాశం ఉంది.

 

ఇంకా చదవండిఏపీకి అదిరిపోయే శుభవార్త.. మన సీఎం ఐడియా వారెవ్వా! కేంద్రం మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లా ప్రజలు ఎగిరి గంతేయాల్సిందే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ ఫోన్ మైక్ వాడకపోయినా, అలాగే స్టేటస్ బార్లో మైక్ సిగ్నల్స్ కనిపస్తున్నా ఏదో ప్రాబ్లం ఉందని అర్థం చేసుకోవాలి. అది హ్యాక్ అయి కూడా ఉండవచ్చు. ముఖ్యంగా సెట్టింగ్లలో మీరు పర్మిషన్ ఇవ్వకపోయినా మైక్ ఆన్ అవడం, సమాచారం రికార్డ్ అవడం జరిగితే తప్పకుండా హ్యాక్ అయినట్లే అంటున్నారు నిపుణులు. అలాగే ఫోన్ బ్యాటరీ మరీ త్వరగా ఖాళీ అవుతుంటే కూడా మీ స్మార్ట్ ఫోన్ బ్యాగ్రౌండ్లో ఏదో ఒక సీక్రెట్ యాప్ పనిచేస్తుండవచ్చు. దీంతోపాటు హానికరమైన యాప్ లేదా సాఫ్ట్ వేర్ మీ ఫోన్లోని మెమోరీని ఎక్కువగా వాడుకుంటుంటే ఫోన్ స్లోగా పనిచేస్తుందని కూడా నిపుణులు చెప్తున్నారు.

 

తెలియని యాప్ల నుంచి నోటిఫికేషన్లు తరచుగా వస్తున్నా ఫోన్ హ్యాక్ అయిందేమోనని అనుమానించాల్సిందే. ఇలాంటప్పుడు అవసరంలేని అప్లికేషన్లను డిలీట్ చేయడం, వాటికి ఇచ్చిన పర్మిషన్లను రివ్యూ చేసుకోవడం చేయాలి. నమ్మదగిన యాంటీ వైరస్ యాప్తో సెక్యూరిటీ స్కాన్ చేయాలి. అయినప్పటికీ మీ ఫోన్ హ్యాకర్లు నియంత్రిస్తున్నట్లు డౌట్ వస్తే చివరి ఆప్షన్గా మీ స్మార్ట్ ఫోన్ ఫ్యాక్టరీ సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్లి రీ సెట్ చేసుకోవాలి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నేడు ఢిల్లీలో అమిత్ షాను కలవనున్న పవన్ కల్యాణ్! ఎందుకో తెలుసా! కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే!

 

ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! విద్యావిధానంలో మరియు ఆ విషయంలో కీలక మార్పులు.. ఇక పండగే!

 

మీరు స్కూటీ కొనాలనుకుంటున్నారా..? అదిరిపోయే ఫీచర్లతో - అతి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటీ!

 

గత ఐదేళ్లలో తప్పులు జరిగిన మాట నిజమే! సంచలన వ్యాఖ్యలు చేసిన డీజీపీ! ఇక వారికి మోతే!

 

బీఎస్‌ఎన్‌ఎల్‌ స్పెషల్‌ రీఛార్జ్‌ ఆఫర్‌! అన్‌లిమిటెడ్‌ కాల్స్‌... 600 జీబీ డేటా!

 

ఆ న్యూస్ వెబ్సైట్ కి భారీ షాక్! కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ! ఎందుకంటే..  

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Technology #SmartPhones #ScreenRecording