ఇకపై స్పామ్ మెయిల్స్ కు చెక్! గూగుల్ నుంచి త్వరలో మరో కొత్త ఫీచర్!

Header Banner

ఇకపై స్పామ్ మెయిల్స్ కు చెక్! గూగుల్ నుంచి త్వరలో మరో కొత్త ఫీచర్!

  Wed Nov 20, 2024 13:30        Technology

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను ప్రవేశ పెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా స్పామ్ మెయిల్స్ కు చెక్ పెట్టేందుకు గూగుల్ మరో అదిరిపోయే ఫీచర్ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. షీల్డ్ ఈ మెయిల్ పేరుతో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ సాయంతో యూజర్లు తాత్కాలికంగా ఒక మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ షీల్డ్ ఈ-మెయిల్ ఐడీతో వినియోగదారులు ఏదైనా యాప్, అకౌంట్కి లాగిన్ కావచ్చు. అయితే ఈ-మెయిల్ ఐడీ కేవలం పది నిమిషాలు మాత్రమే పని చేస్తుందని తెలుస్తోంది. ఆ తర్వాత మళ్లీ అవసరం అనుకుంటే యూజర్లు కొత్త షీల్డ్ ఈమెయిల్ను క్రియేట్ చేసుకోవాలి. ఈ మెయిల్స్ యూజర్లు స్పామ్ మెయిల్స్ సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించి గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫీచర్ గురించి గూగుల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే దీనిపై ఓ సృష్టత రానుంది. ఇదిలా ఉంటే ఈ తరహా ఫీచర్ను టెక్ దిగ్గజం యాపిల్ తన యూజర్లకు ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చింది. హైడ్ మై ఈ-మెయిల్ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్ సాయంతో తాత్కాలిక మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకొని యాప్ లో లాగిన్ కావచ్చు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

శుభవార్త చెప్పిన చంద్రబాబు సర్కార్! ఏపీలో మూడు రోజులపాటు ఉచిత బస్సు సేవలు - ఎందుకు అంటే!

 

ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

రాజధాని అమరావతిపోలవరం రాష్ట్రానికి రెండు కళ్లు లాంటివి! ఎత్తుకు పై ఎత్తు - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

ఎమ్మెల్యే కట్టుకున్న చీరపై రఘురామకృష్ణరాజు ఆసక్తికర ప్రశ్న! ఏం అడిగారంటే!

 

నేడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

రూ.లక్షా 80 వేల జీతంతో సొంత జిల్లాలో ఉద్యోగం! పరీక్ష లేకుండా నేరుగా జాబ్ పొందండి! అస్సలు మిస్ అవ్వదు!  

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Google #World #Technology