ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ స్పెషల్ సేల్స్! రూ.15వేలలో బెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే!

Header Banner

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ స్పెషల్ సేల్స్! రూ.15వేలలో బెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే!

  Sat Oct 05, 2024 08:00        Gadgets

పండుగ సీజన్ సందర్భంగా ఇ-కామర్స్ కంపెనీలు స్పెషల్ సేల్స్ నిర్వహిస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్‌పై ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్లు ఉన్నాయి. ఈ ఆఫర్లలో కొత్త బడ్జెట్ ఫోన్ కొనాలనుకునే వారికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో రూ.15వేల కంటే తక్కువ ధరలో లభిస్తున్న టాప్-5 మోడల్స్ ఏవో చూద్దాం.

 

 శామ్‌సంగ్ గెలాక్సీ M35 (Samsung Galaxy M35)

పండుగ ఆఫర్లలో మంచి బడ్జెట్ శామ్‌సంగ్ ఫోన్ కొనాలనుకునే వారు, గెలాక్సీ M35 మోడల్ సెలక్ట్ చేసుకోవచ్చు. ఈ డివైజ్‌ 6.6-అంగుళాల 120Hz సూపర్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ దీని సొంతం. ఎక్సినోస్ 1380 చిప్‌సెట్‌తో మంచి, ఫాస్టెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. కెమెరా యూనిట్‌లో OIS సపోర్ట్ ఉన్న 50MP ప్రైమరీ షూటర్, 8MP అల్ట్రావైడ్ సెన్సార్, 2MP మాక్రో షూటర్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. దీంట్లోని 6,000mAh బ్యాటరీ, మంచి బ్యాకప్ ఇస్తుంది. అమెజాన్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ M35 (8GB RAM, 256GB స్టోరేజ్‌) రూ. 14,999కి లభిస్తోంది. 8GB RAM వేరియంట్‌ ధర మరో రూ.1,500 ఎక్కువ.

 

ఇంకా చదవండి: క్రియేటర్లకు కొత్త అప్డేట్ తీసుకొచ్చిన యూట్యూబ్! ఇకపై షార్ట్స్?

 

CMF బై నథింగ్ ఫోన్ 1 (CMF Phone 1)

నథింగ్ సబ్-బ్రాండ్ CMF.. ఈ స్మార్ట్‌ఫోన్‌ను జులైలో లాంచ్ చేసింది. CMF ఫోన్ 1 డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌తో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల 120Hz AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ నథింగ్OS 2.6.0తో రన్ అవుతుంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 16 వరకు అప్‌డేట్స్ అందుకుంటుంది. CMF ఫోన్ 1 లోని 50MP ప్రైమరీ కెమెరా మంచి లైటింగ్‌లో మంచి ఫోటోలను తీస్తుంది. ఈ డివైజ్‌ 6GB RAM, 128GB స్టోరేజ్ వెర్షన్ ప్రస్తుతం రూ.14,999కి లభిస్తోంది. అయితే బ్యాంక్ ఆఫర్లతో రూ.2,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

 

పోకో M6 ప్లస్ (Poco M6 Plus)

ఈ బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ గత నెలలోనే లాంచ్ అయింది. పోకో M6 ప్లస్ ఫోన్‌ 6.79-అంగుళాల FullHD+ IPS LCD స్క్రీన్‌తో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ దీని సొంతం. ఈ హ్యాండ్‌సెట్‌లో స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 AE చిప్‌సెట్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హైపర్‌ఓఎస్‌తో డివైజ్ రన్ అవుతుంది. దీంట్లోని 108MP ప్రైమరీ కెమెరాతో మంచి పిక్చర్స్, వీడియోలు క్యాప్చర్ చేసుకోవచ్చు. పోకో M6 ప్లస్ బేస్ వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.11,499కి అందుబాటులో ఉంది. అయితే 8GB RAM వెర్షన్ రూ. 12,999కి లిస్ట్ అయింది.

 

 రియల్‌మి 12x 5G (Realme 12x 5G)

రియల్‌మి 12x 5G స్మార్ట్‌ఫోన్ 6.72-అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో వస్తుంది. దీంట్లో డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్ మంచి పర్ఫార్మెన్స్‌తో యూజర్లను ఇంప్రెస్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్‌మి UI 5.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. 50MP ప్రైమరీ కెమెరా దీని సొంతం. తాజా ఆఫర్లలో రియల్‌మి 12x 5G బేస్ వెర్షన్ (4GB RAM, 128GB స్టోరేజ్) రూ. 12,500కి లభిస్తోంది. 8GB RAM వేరియంట్‌ ధర మరో రూ.1,500 ఎక్కువగా ఉంటుంది. మంచి బిల్డ్ క్వాలిటీ, క్లీన్ ఆండ్రాయిడ్ ఇంటర్‌ఫేస్‌తో వచ్చే నోకియా G42, బెస్ట్ బడ్జెట్ 5G ఫోన్లలో ఒకటి. ఈ హ్యాండ్‌సెట్ 6.56-అంగుళాల IPS LCD స్క్రీన్‌, 90Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. దీంట్లో స్నాప్‌డ్రాగన్ 480+ చిప్‌సెట్ ఉంటుంది. నోకియా G42లో 50MP ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌తో డివైజ్ రన్ అవుతుంది. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రూ. 9,999కి అందుబాటులో ఉంది.

 

ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

డ్వాక్రా సంఘాలకు సీఎం అదిరిపోయే కానుక.. ఇక మహిళలకు పండగే పండగ!

 

తీవ్ర జ్వరంతో తిరుమలలోనే ఉండిపోయిన డిప్యూటీ సీఎం! వారాహి సభ ఉంటుందా? లేదా?

 

పిచ్చి ఆకులు అనుకోని పడేస్తున్నారా? వాటితో ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు!

 

తిరుమల లడ్డూ వివాదంపై పెరిగిపోతున్న ఉత్కంఠ! సుప్రీం కోర్టులో విచారణ వాయిదా!

 

బీజేపీకి షాక్ ఇచ్చిన మాజీ ఎంపీ! ఐదేళ్లలో నాలుగో సారి పార్టీ చేంజ్!

 

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు షాక్‌! మరో 14 రోజులు రిమాండ్‌ పొడిగింపు!

 

గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. సంక్రాంతి నుంచి మరో కొత్త పథకం! తాను చేసిన పనికి గుర్తింపు!

 

హత్యకు గురైన పవన్ కల్యాణ్ బౌన్సర్! ఎవరు? ఎందుకు చేశారు..! అసలేం జరిగింది..

 

చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కొత్త మలుపు! విచారణకు మళ్లీ పోలీసుల నోటీసులు!

 

ఏపీ లో కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్! నియామక ప్రక్రియ వేగవంతం! హోం శాఖ అనిత కీలక ప్రకటన!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Flipkart #NewFeature #OnlineShopping #FlipkartApp #FlipkartAppFeature