స్ట్రెస్ ని తగ్గించుకోవాలి అనుకుంటున్నారా? అయితే వీటిని తినండి!
Mon Nov 18, 2024 12:11 Life Styleఈ ఆధునిక యుగంలో ప్రతీ ఒక్కరూ ఒత్తిడికి గురవుతున్నారు. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన జీవనం గడపాలి. ఈ ఉరుకులు పరుగుల జీవింతలో సరైన ఆహారం, వ్యాయామం వంటివి చేయకపోవడం వల్ల ప్రతి ఒక్కరూ ఒత్తిడి, డిప్రెషన్కు గురవుతున్నారు. ఈ సమస్య కామ్గా అనిపించవచ్చు. కానీ, ఈ మానసిక సమస్యలే రోజులు పెరుగుతున్న కొద్ది శారీరక సమస్యలకు కారణం అవుతాయి. దీనిని నిర్లక్ష్యం చేస్తే రిస్క్ పడతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మితిమీరిన ఒత్తిడి కారణంగా బీపీ, షుగర్, గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణలు చెబుతున్నారు. అయితే, మనం తీసుకునే ఆహారాలు కొన్ని మానసిక ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యాన్ని మెరుచుపర్చడానికి సహాయపడుతుంది. అవి ఎలాంటి ఆహారాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంకా చదవండి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... రైతుల కోసం వాట్సాప్ నెంబర్! ఆ వివరాలు మీ కోసం!
ఇంకా చదవండి: 6 వ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టు? ఎవరెవరికి అంటే?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
చేపలు: సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ వంటి కొవ్వు చేపలు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ చేపల్లో ఒమేగా-3 ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఆకు కూరలు: స్ట్రెస్ను తగ్గించి, శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి ఆకు కూరలు సహాయపడతాయి. వీటిలో ఉండే మెగ్నీషియం ఆరోగ్యానికి ఎంతగానే ఉపయోగపడుతుంది. అంతేకాకుండా భావోద్వేగాలకు కారణమయ్యే మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్లను నియంత్రిస్తుంది.
బ్లూబెర్రీస్: బ్లూబెర్రీలు అద్భుతమైన ఆహారం. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. వీటిని స్మూతీలు, ఓట్స్ వంటి వాటిలో తింటే మంచిది. ఇవి మాత్రమే కాకుండా స్ట్రాబెర్రీ, బ్లాక్ బెర్రీ వంటి రకరకాల బెర్రీలు తినడం వల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడతాయి. ఇవి శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.
దానిమ్మ: ఒత్తిడిగా అనిపించినప్పుడు ఆక్సీకరణ తక్కువగా ఉంటుంది. అలా జరగకుండా ఉండేందుకు దానిమ్మ శక్తిని ఇస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీన్ని పెరుగు, సలాడ్లో కలుపుకుని తింటే మంచిది.
బీట్రూట్ : బీట్రూట్లోని నైట్రిక్ ఆక్సైడ్ అధికంగా ఉంటుంది. ఇది రక్తప్రసరణను మెరుగుపరిచి, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. బీట్రూట్ను తరుచుగా ఆహారంలో భాగంగా తినడం వల్ల ఒత్తిడిని నియంత్రిస్తుంది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్.. భారీగా విమానాల సర్వీసులు పెంపు!
గుడ్ న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధర! ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరు!Don't Miss
వైసీపీకి మరో బిగ్ షాక్: విద్యార్థిని ఫిర్యాదు.. మాజీ మంత్రిపై కేసు నమోదు! ఎందుకో తెలుసా?
వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #LifeStyle #Stress #Depression #Foods #Diet
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.