బ‌య‌ట ఈ పండ్లు క‌నిపిస్తే విడిచిపెట్ట‌కుండా తెచ్చుకోండి! అనేక లాభాలు పొంద‌వ‌చ్చు!

Header Banner

బ‌య‌ట ఈ పండ్లు క‌నిపిస్తే విడిచిపెట్ట‌కుండా తెచ్చుకోండి! అనేక లాభాలు పొంద‌వ‌చ్చు!

  Tue Nov 19, 2024 10:52        Life Style

మార్కెట్‌లో మ‌న‌కు అనేక ర‌కాల పండ్లు ల‌భిస్తుంటాయి. అయితే వాటిలో కేవ‌లం మ‌నం కొన్ని పండ్ల‌ను మాత్ర‌మే తింటుంటాం. కొన్ని పండ్ల‌ను అస‌లు చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తాం. కానీ అలాంటి పండ్ల గురించి తెలిస్తే మీరు ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. అవును, ఎందుకంటే చాలా మంది అంత‌గా ప‌ట్టించుకోని ఆ పండ్లే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. ఇక అలాంటి పండ్ల‌లో పియ‌ర్ పండు కూడా ఒక‌టి. ఇవి గ్రీన్ లేదా ప‌సుపు రంగులో మ‌న‌కు ద‌ర్శ‌న‌మిస్తుంటాయి. మార్కెట్‌లో మ‌న‌కు ఇవి క‌నిపిస్తాయి. కానీ ధ‌ర ఎక్కువ అని చెప్పి చాలా మంది ఈ పండ్ల‌ను తిన‌రు. కానీ ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఈ పండ్ల‌తో మ‌నం అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.


అనేక పోష‌కాలు..
పియర్స్ పండ్ల‌లో పోష‌కాలు స‌మృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా ఫైబ‌ర్‌తోపాటు విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల ఈ పండ్ల‌ను తింటే మ‌నం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటాం. పియ‌ర్స్ పండ్ల‌లో రెండు ర‌కాల ఫైబ‌ర్‌లు ఉంటాయి. సాల్యుబుల్‌, ఇన్‌సాల్యుబుల్ ఫైబ‌ర్‌లు రెండూ ఇందులో ఉంటాయి. అందువ‌ల్ల ఈ పండ్ల‌ను తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్ర‌ణ‌లోకి వ‌స్తాయి. ఈ పండ్ల‌లో ఉండే ఫైబ‌ర్ జీర్ణ‌వ్య‌వ‌స్థ ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తుంది. దీంతో మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. 

 

ఇంకా చదవండినేడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! 

 

ఇంకా చదవండివ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టుఎవరెవరికి అంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


గుండె ఆరోగ్యానికి..
పియ‌ర్స్ పండ్ల‌లో అధికంగా ఉండే ఫైబ‌ర్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిల‌ను ఈ పండ్లు త‌గ్గిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. ర‌క్త స‌ర‌ఫరా పెరుగుతుంది. దీని వ‌ల్ల గుండె జ‌బ్బులు, హార్ట్ ఎటాక్స్ వ‌చ్చే అవ‌కాశాలు తగ్గుతాయి. పియ‌ర్స్ పండ్ల‌లో ఉండే ప్రీ బ‌యోటిక్ ఫైబ‌ర్ వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ‌లో ఉండే మంచి బాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీంతో జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. రోగ నిరోధక వ్య‌వ‌స్థ ప‌టిష్టంగా మారుతుంది. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. దీంతోపాటు బ‌రువు కూడా నియంత్ర‌ణ‌లో ఉంటుంది.


అధిక బ‌రువుకు..
పియ‌ర్స్ పండ్ల‌లో ఉండే ఫైబ‌ర్‌, నీటి శాతం వ‌ల్ల ఈ పండ్ల‌ను తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌కుండా ఉంటుంది. దీంతో ఆహారం త‌క్కువగా తింటారు. ఫ‌లితంగా ఇది బ‌రువు త‌గ్గేందుకు స‌హాయం చేస్తుంది. పియ‌ర్స్ పండ్ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గుతారు. ఈ పండ్ల‌లో యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా ఈ పండ్ల‌లో ఉండే పాలిఫినాల్స్ క‌ణాలు నాశ‌నం అవ‌కుండా చూస్తాయి. ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో క్యాన్స‌ర్, గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. పియ‌ర్స్ పండ్ల‌లో సార్బిటాల్ అనే స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది నాచుర‌ల్ లాక్సేటివ్‌గా ప‌నిచేస్తుంది. అందువ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. రోజూ సుఖ విరేచ‌నం అవుతుంది. జీర్ణ‌వ్య‌వ‌స్థ ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. ఇలా ఈ పండ్ల‌తో అనేక ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. క‌నుక మీకు మార్కెట్‌లో ఈ పండ్లు క‌నిపిస్తే విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రూ.లక్షా 80 వేల జీతంతో సొంత జిల్లాలో ఉద్యోగం! పరీక్ష లేకుండా నేరుగా జాబ్ పొందండి! అస్సలు మిస్ అవ్వదు!

 

మంత్రివర్గం పలు బిల్లులకు గ్రీన్ సిగ్నల్! ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. ఎంతమంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ!

 

టీటీడీ కీలక నిర్ణయం! నిత్య అన్నప్రసాదం మెనులో అదనంగా మరో పదార్థం!

 

ఏపీ శాసనసభలో ఏడు కీలక బిల్లులకు ఆమోదం! నూతన మార్పులకు గ్రీన్ సిగ్నల్!

 

మార్చికల్లా మరో 500 ఎస్బీఐ శాఖల ప్రారంభం! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్: కొత్త ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారాకొత్త విధానం - మంత్రి కీలక వ్యాఖ్యలు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #LifeStyle #Foods #health #Diet #Broccoli