డయాబెటిస్ ఉన్న వారు ప్రతి రోజూ మధ్యాహ్నం ఇలా చేయండి! షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి!

Header Banner

డయాబెటిస్ ఉన్న వారు ప్రతి రోజూ మధ్యాహ్నం ఇలా చేయండి! షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి!

  Sat Aug 24, 2024 08:00        Health

ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ బాధితుల సంఖ్య పెరుగుతోందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఐసీఎంఆర్ అధ్యయనం ప్రకారం చూస్తే.. మన దేశంలో 2019 లోనే 7 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ప్రజెంట్ ఈ సంఖ్య 10.1 కోట్లకు పెరిగింది. 13.6 కోట్ల మంది ప్రీ డయాబెటిస్ లిస్టులో ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. అంటే వీరు త్వరలో డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడంవల్ల డయాబెటిక్ బాధితులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించుకోవచ్చు. అవేంటే చూద్దాం.

 

ఇంకా చదవండిజగన్ కు జర్క్ ఇచ్చిన సీబీఐ! కోర్టులో సీబీఐ కౌంటర్ తో మాజీ సీఎం షాక్! 

 

ఆలస్యంగా తినడం: డయాబెటిక్ పేషెంట్లకు మధ్యాహ్న భోజనం చాలా ముఖ్యం. అయితే ఈ సమయంలో తగిన కేర్ తీసుకోకపోతే బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగే చాన్సెస్ కూడా ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా మరీ ఆలస్యంగా తినడమో, ఒక్కో రోజు ఒక్కో విధంగా తినడమో చేస్తే చక్కెర స్థాయిల్లో హెచ్చు తగ్గులు సంభవిస్తుంటాయి. కాబట్టి ప్రతి రోజూ సమయానికి తినాలి. అలాగే భోజనం ముగిసిన తర్వాత రెండు లేదా మూడు గంటలకు షుగర్ టెస్టు చేసుకోవడంవల్ల మెడిసిన్ వాడకంలో జాగ్రత్త పడవచ్చు.

 

ఒకే సారి కడుపు నిండుగా తినడం: కొందరు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ చేయకుండా లంచ్ టైమ్ లోనే ఫుల్లుగా తినేస్తుంటారు. పోషకాల గురించి కూడా పెద్దగా పట్టించుకోరు. అయితే ఎంత ఫుల్లుగా తిన్నా తగిన పోషకాలు లేని ఆహారం డయాబెటిస్ వచ్చే రిస్కును పెంచుతుంది. కాబట్టి కార్బో హైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు ఇలా అన్ని రకాల పోషకాలు మధ్యాహ్న భోజనంలో ఉండేలా చూసుకోవాలి.

 

ఇంకా చదవండి: కొత్త రేషన్ కార్డులు.. కీలక అప్‌డేట్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం! దరఖాస్తు ఆ నెలలో ముగియనుంది! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

చిరు తిళ్లకు దూరంగా ఉండండి: ప్రస్తుతం చాలా మంది చిరుతిళ్లపై ఆసక్తి చూపడం మనం గమనిస్తుంటాం. ఇవి తక్షణ రుచిని, సంతృప్తిని ఇవ్వగలవు. కానీ ఆరోగ్యానికి మాత్రం మేలు చేయవు. చాలా మంది లంచ్ టైమ్ లో కూడా అన్నం, రొట్టెలు వంటివి కాకుండా ఫాస్ట్ ఫుడ్ తింటుంటారు. దీనివల్ల మధుమేహం రిస్క్ పెరుగుతుంది.

 

భోజనం తర్వాత డ్రింక్స్: కొందరు భోజనం చేసిన వెంటనే టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ లేదా ఇతర పానీయాలు తాగుతుంటారు. ముఖ్యంగా శీతల పానీయాల్లో కార్బోనేటెడ్, చక్కెర పానీయాలే ఎక్కువగా ఉంటాయి. పైగా అవి రక్తంలో షుగర్ లెవల్స్ పెరగడానికి కారణం అవుతాయి. కాబట్టి వెంటనే ఈ అలవాటు మానుకోవాలని నిపుణులు చెప్తున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు! మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి!

 

ఏపీలో 15వేల సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు - గుడ్ న్యూస్ చెప్పిన లోకేష్! ఐటీలో ప్రస్తుతం అంతర్జాతీయంగా!

 

మా రాష్ట్రానికి చంద్రబాబు బ్రాండ్ అంబాజిడర్ఆయనే మాకు హీరోమంత్రి భరత్! కరోనా వైరస్ మహమ్మారి తాండవం!

 

టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం! వెల్లువెత్తిన విజ్ఞప్తులు!

 

కోల్‌క‌తా వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌న‌! వెలుగులోకి మ‌రో సంచ‌ల‌న విష‌యం!

 

అందుకే నేను ఎక్కువగా తమిళంలో నటించడం లేదు! సంగీత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్!

 

తల్లులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు సర్కార్! అకౌంట్లలో రూ.15 వేలు!

   

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Health #Diabetes #SugarLevels #BloodSugar #DiabetesPatients