మీలో ఈ ల‌క్ష‌ణాలు ఉన్నాయా! అయితే మీకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న‌ట్లే!

Header Banner

మీలో ఈ ల‌క్ష‌ణాలు ఉన్నాయా! అయితే మీకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న‌ట్లే!

  Wed Nov 20, 2024 12:00        Health

శ‌రీరంలో అధికంగా కొలెస్ట్రాల్ పేరుకుపోతే గుండె జ‌బ్బులు వ‌స్తాయ‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. శ‌రీరంలో కొలెస్ట్రాల్ నిల్వ‌లు ఎక్కువైతే ర‌క్త‌నాళాల్లో పూడిక‌లు ఏర్ప‌డుతాయి. ఫ‌లితంగా ర‌క్త స‌ర‌ఫ‌రాకు ఆటంకం క‌లుగుతుంది. దీంతో బీపీ పెరుగుతుంది. ఇది దీర్ఘ‌కాలంలో ఉంటే హార్ట్ ఎటాక్ లేదా కార్డియాక్ అరెస్ట్‌కు దారి తీస్తుంది. అప్పుడు ప్రాణాలు పోతాయి. ప్ర‌స్తుతం చాలా మంది ఈ ర‌కంగానే ఎక్కువ‌గా చ‌నిపోతున్నారు. హార్ట్ ఎటాక్ లేదా కార్డియాక్ అరెస్ట్ వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటున్నా చాలా మంది మాత్రం కొలెస్ట్రాల్ స్థాయిలు పెర‌గ‌డం వ‌ల్లే వాటి బారిన ప‌డుతున్నారు. అయితే శ‌రీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉంటే శ‌రీరం మన‌కు కొన్ని ల‌క్ష‌ణాల‌ను తెలియ‌జేస్తుంది. ఇవి అంద‌రిలోనూ క‌నిపించ‌క‌పోవ‌చ్చు. కానీ కొలెస్ట్రాల్ మ‌రీ ఎక్కువైతే మాత్రం అంద‌రిలోనూ ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. వీటిని ప‌రిశీలించి ముందుగానే జాగ్ర‌త్త ప‌డితే హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవ‌చ్చు.

 

ఆక్సిజ‌న్ అంద‌దు..
శ‌రీరంలో కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ మ‌రీ ఎక్కువ‌గా ఉంటే క‌ణాల‌కు ఆక్సిజ‌న్ స‌రిగ్గా అంద‌దు. ర‌క్త‌నాళాల్లో కొలెస్ట్రాల్ చేరి ర‌క్త స‌ర‌ఫ‌రాకు ఆటంకం ఏర్ప‌డుతుంది. దీంతో క‌ణాల‌కు ర‌క్తం చేర‌దు. ఆక్సిజ‌న్ ల‌భించ‌దు. ఫ‌లితంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర‌వుతాయి. దీన్నే atherosclerosis అని కూడా అంటారు. చిన్న‌పాటి వ్యాయామం లేదా శారీర‌క శ్ర‌మ చేసినా, కొన్ని సార్లు ఎలాంటి శారీర‌క శ్ర‌మ చేయ‌క‌పోయినా కూడా కొంద‌రికి శ్వాస తీసుకోవ‌డం క‌ష్టంగా ఉంటుంది. ఇలా గ‌నుక ఎవ‌రికైనా జ‌రుగుతుంటే వెంట‌నే కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవాలి. కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువ‌గా ఉంటేనే ఈ ల‌క్ష‌ణం క‌నిపిస్తుంది. క‌నుక ఈ ల‌క్ష‌ణం క‌నిపించిన వెంట‌నే అప్ర‌మ‌త్తం అవ్వాల్సి ఉంటుంది. లేదంటే హార్ట్ ఎటాక్ బారిన ప‌డ‌తారు. 

 

ఇంకా చదవండిఆరవ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టు విడుదల! ఏ ప్రముఖులకు చోటు దక్కిందంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

వికారం, వాంతికి వ‌చ్చిన‌ట్లు ఉండ‌డం..
శ‌రీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉంటే వికారం, వాంతికి వ‌చ్చిన‌ట్లు ఉండ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. కొంద‌రికి జీర్ణ స‌మ‌స్య‌ల కార‌ణంగా కూడా ఇలా జ‌రుగుతుంది. అయితే నిరంత‌రాయంగా ఈ స‌మ‌స్య‌లు గ‌న‌క ఉంటే కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ ఎక్కువ‌గా ఉన్నాయేమోన‌ని అనుమానించాలి. వెంట‌నే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించి ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. ఇక కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ ఎక్కువ‌గా ఉంటే చేతులు, కాళ్లు చ‌ల్ల‌గా ఉంటాయి. చేతులు, కాళ్ల‌లో ర‌క్త స‌ర‌ఫ‌రా స‌రిగ్గా జ‌ర‌గ‌దు. క‌నుక ఆయా భాగాల్లో చ‌ల్ల‌గా ఉంటే ఏమాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు. 

 

గాయాలు, పుండ్లు..
శ‌రీరంలో కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ ఎక్కువ‌గా ఉంటే పాదాల్లో అయ్యే గాయాలు లేదా పుండ్లు త్వ‌ర‌గా మాన‌వు. ఆ భాగంలో ర‌క్త స‌ర‌ఫ‌రా స‌రిగ్గా జ‌ర‌గ‌దు క‌నుక గాయాలు లేదా పుండ్లు మానేందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంది. ఈ ల‌క్ష‌ణం ఎవ‌రిలో అయినా ఉన్నా కూడా దాన్ని అధిక కొలెస్ట్రాల్‌గా అనుమానించాల్సిందే. వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌లిసి కొలెస్ట్రాల్ ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. ఒక‌వేళ కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉన్న‌ట్లు ప‌రీక్ష‌ల్లో తేలితే వెంట‌నే డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు చికిత్స తీసుకోవాలి. దీంతో హార్ట్ ఎటాక్‌ను ముందుగానే అడ్డుకోవ‌చ్చు. ప్రాణాల‌ను కాపాడుకోవ‌చ్చు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

శుభవార్త చెప్పిన చంద్రబాబు సర్కార్! ఏపీలో మూడు రోజులపాటు ఉచిత బస్సు సేవలు - ఎందుకు అంటే!

 

ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

రాజధాని అమరావతిపోలవరం రాష్ట్రానికి రెండు కళ్లు లాంటివి! ఎత్తుకు పై ఎత్తు - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

ఎమ్మెల్యే కట్టుకున్న చీరపై రఘురామకృష్ణరాజు ఆసక్తికర ప్రశ్న! ఏం అడిగారంటే!

 

నేడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

రూ.లక్షా 80 వేల జీతంతో సొంత జిల్లాలో ఉద్యోగం! పరీక్ష లేకుండా నేరుగా జాబ్ పొందండి! అస్సలు మిస్ అవ్వదు!  

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Health #Diet #Cholesterol