కెనడా: అర్ధాంతరంగా 600 భారతీయుల ఉద్వాసన! ప్రభుత్వ వైఖరికి నిరసనగా సంపూర్ణ నిరాహార దీక్ష తో ఉద్రిక్తతలు! ప్రశ్నార్ధకంగా మారిన వారి జీవితాలు

Header Banner

కెనడా: అర్ధాంతరంగా 600 భారతీయుల ఉద్వాసన! ప్రభుత్వ వైఖరికి నిరసనగా సంపూర్ణ నిరాహార దీక్ష తో ఉద్రిక్తతలు! ప్రశ్నార్ధకంగా మారిన వారి జీవితాలు

  Wed May 29, 2024 13:49        World

కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్(పీఈఐ) స్థానిక ప్రభుత్వం విదేశీ కార్మికులను తగ్గించాలని తీసుకున్న నిర్ణయంతో అక్కడ పని చేస్తున్న భారతీయుల్లో ఆందోళన నెలకొంది. దీంతో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా చార్లెస్ టౌన్ లో భారతీయులు నిరాహార దీక్ష చేపట్టారు. అయితే మూడు రోజుల నుంచే ఈ కార్యక్రమం చేపడుతున్నప్పటికీ ఇక నుంచి సంపూర్ణ నిరాహార దీక్ష చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు. ద్రవ పదార్థాలు కూడా తీసుకోమని స్పష్టం చేశారు. ఇమిగ్రేషన్ నిబంధనల్లో మార్పుల కారణంగా సుమారు 50 మంది కార్మికులు ఇప్పటికే కెనడాను విడిచిపెట్టి వెళ్లిపోయారని, మరి కొందరు నిరసనకారులు వేధింపులను ఎదుర్కున్నారని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. భారత కార్మికుల డిమాండ్ లను ప్రభుత్వం పట్టించుకోకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని నిరసన కారులు హెచ్చరించారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

వలస కార్మికుల సంఖ్యను 2,100 నుంచి సుమారు 1,600కి తగ్గించాలని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. అంతేగాక శాశ్వత నివాస సంఖ్యను కూడా 25 శాతం తగ్గించనున్నట్లు తెలిపింది. సర్వీస్ వర్కర్ల సంఖ్య 2023లో 800 ఉంది, ప్రస్తుతం దానిని 200కి తగ్గించింది. ఇది ప్రాంతీయ నామినీ ప్రోగ్రామ్ లో విదేశీ నామినీల సంఖ్యను కూడా తగ్గిస్తుంది. మారిన విధానం ప్రకారం రాబోయే వలసదారుల సంఖ్యను తగ్గించాల్సి ఉన్నందున నిర్మాణం, ఆరోగ్య సంరక్షణ వంటి కొన్ని రంగాలకు అనుకూలంగా ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

 

వీసా ఇవ్వలేదని ఎంత పని చేశారో చూడండి! వైరల్ అవుతున్న పంజాబీ ఫ్యామిలీ! నెటిజన్ల ఫన్నీ కామెంట్స్! 

 

ఇటీవలి సంవత్సరాలలో ప్రావిన్స్ లో రికార్డు స్థాయిలో పెరిగిన జనాభాను నియంత్రించడానికి వలసలను తగ్గించాల్సిన అవసరం ఉందని పీఈఐ ప్రభుత్వం వెల్లడించింది. జనాభా పెరుగుదల గృహ సంక్షోభానికి దోహదపడిందని, ప్రావిన్స్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై కూడా ఒత్తిడి తెచ్చిందని అభిప్రాయపడింది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విదేశీయులు నిరసనలకు దిగారు. ఈ మార్పులు సేవా పరిశ్రమతో పాటు యజమానులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని చెబుతున్నారు.

 

ఇవి కూడా చదవండి: 

ప్రపంచం లోనీ 50 సుసంపన్న నగరాలు! భారత్ నుండి 2 నగరాలకు స్థానం! అన్ని దేశాలు వాటి వైపే! 

 

ప్రజలపై ఇప్పటికే ఉన్న భారం సరిపోదు అన్నట్లు! కొత్తగా ఆర్బీఐ నుంచి మరో రూ.2 వేల కోట్లు! అప్పులతో మునిగిపోతున్న ఏపీ! 

 

సీఎం జగన్ పై దాడి కేసులో నిందితుడికి బెయిల్! సతీశ్ కు విజయవాడ కోర్టు ఆదేశాలు! పీఎస్ లో సంతకం చేయాలి! 

 

కువైట్: PACI అధికారి షాక్ ఇచ్చిన కోర్టు! లంచం తీసుకుంటూ రెడ్ హాండెడ్ గా! కఠిన శిక్ష తప్పదు! 

 

దుబాయ్ సందర్శించాలి అనుకుంటున్నారా! అయితే మీరు తప్పకుండా తెలుసుకోవాలి! చాలా డబ్బు సేవ్ చేయవచ్చు! 

 

ఆంధ్రుల ఆత్మగౌరవంతో తల ఎత్తుకొని నిలబడి ఎదిరించే ధైర్యాన్ని ఇచ్చిన అన్న ఎన్టీఆర్ గురించి దశాబ్దాల వారీగా! 101 వ జయంతి సందర్భంగా! 

 

ఏపీలో కొనసాగుతున్న సెంటిమెంట్ గురించి విన్నారా! ఆ 4 స్థానాల్లో ఎవరు గెలుస్తారో! 

                                       

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #World #Canada #India #IndianMigrangts #TeluguMigrants