తస్మాత్ జాగ్రత్త! ఫేషియల్ వల్ల వ్యాపిస్తున్న హెచ్ఐవీ! కానీ దాని ఆదరణ మాత్రం తగ్గడంలేదు!
Sat Apr 27, 2024 12:08 Life Style, U S Aన్యూ మెక్సికోలో ఓ స్పాలో ‘వాంపైర్ ఫేషియల్’ ఫేషియల్‌ను చేయించుకున్న ముగ్గురు మహిళలు హెచ్ఐవీ బారిన పడే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వాంపైర్ ఫేషియల్ అనేది మెక్సికోలో చాలా పేరు పొందింది. ఇది చాలా చవక. ఫేషియల్ సమయంలో ఓ వ్యక్తి చేతి నుంచి రక్తం తీసి, అందులోంచి ప్లేట్లెట్లను వేరు చేస్తారు. ఆ తర్వాత దానిని మైక్రోనీడిల్స్ ను ఉపయోగించి రోగి ముఖానికి పూస్తారు. ఇది చాలా చవక కావడంతో దీనికి ఆదరణ పెరుగుతోంది. అయితే, పరిశుభ్రంగా లేని వాతావరణంలో చేసే ఈ ప్రక్రియ ఆరోగ్యంపై తీవ్ర ప్రమాదం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, ఇటీవల ఈ ఫేషియల్ చేయించుకున్న ముగ్గురు మహిళలు హెచ్ఐవీ బారినపడే అవకాశం ఉందని పేర్కొంది. గతంలో ఇలానే వాంపైర్ ఫేషియల్ చేయించుకున్న చాలామంది హెచ్ఐవీ బారినపడినట్టు తేలింది. దీంతో ఆ స్పాలను మూసివేశారు. 2018లో ఇందుకు సంబంధించిన తొలి కేసు నమోదైంది. ఓ మధ్యవయస్కురాలైన మహిళ హెచ్ఐవీ బారినపడింది. ఆమెకు డ్రగ్స్ అలవాటు కానీ, హెచ్ఐవీ కలిగిన వ్యక్తులతో లైంగిక సంబంధాలు కానీ లేవు. రక్తమార్పడి కూడా చేయించుకోలేదు. అయినప్పటికీ ఈ ఫేషియల్ తర్వాత ఆమె హెచ్ఐవీకి గురైంది.
ఇవి కూడా చదవండి:
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండవల్లి శ్రీదేవి! చంద్రబాబు కీలక ఆదేశాలు
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి
#AndhraPravasi #USA #LifeStyle #Facial #VampireFacial #Trending
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.