అధ్యక్షుడిగా గెలిస్తే మస్క్ కు కేబినెట్ లో చోటిస్తా! ట్రంప్ ఇచ్చిన బంపర్ ఆఫర్!

Header Banner

అధ్యక్షుడిగా గెలిస్తే మస్క్ కు కేబినెట్ లో చోటిస్తా! ట్రంప్ ఇచ్చిన బంపర్ ఆఫర్!

  Tue Aug 20, 2024 10:53        U S A

టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ పై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే ఎలాన్ మస్స్కు (Elon Musk) కేబినేట్ లో చోటిస్తానని అన్నారు. లేనిపక్షంలో సలహాదారుడిగానైనా నియమించుకుంటానని ట్రంప్ అన్నారు. అతడు చాలా తెలివైన వ్యక్తి అంటూ ప్రశంసలు కురిపించారు. విద్యుత్ వాహనాలపై ఇస్తున్న 7,500 డాలర్ల ట్యాక్స్ క్రెడిట్ను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తానని పేర్కొన్నారు. విద్యుత్ వాహన విక్రయాలను ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం ఇస్తోన్న ట్యాక్స్ క్రెడిట్ను రద్దు చేసే యోచనలో ట్రంప్ (Trump) ఉన్నారు. ట్యాక్స్ క్రెడిట్లు, పన్ను ప్రోత్సాహకాలు సాధారణంగా ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూర్చే అంశాలు కావని అభిప్రాయపడ్డారు. ఒకవేళ క్రెడిట్ రద్దు అమల్లోకి వస్తే.. మస్క్ కు ఉన్న ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు గణనీయమైన ఫలితాలు రావచ్చు.

 

ఇంకా చదవండిగేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు ఉన్న వారికి అదిరిపోయే శుభవార్త! అకౌంట్లలోకి డబ్బులు! అదెలా అని అనుకుంటున్నారా?

 

ట్రంప్ అధికారంలోకి వస్తే క్రెడిట్ రద్దు గురించి నిబంధనల్లో మార్పు చేయనున్నట్లు తెలుస్తోంది. లేదా దాన్ని పూర్తిగా రద్దు చేసేలా కాంగ్రెస్లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ట్రంప్ (Trump) తెలిపారు. అధిక ధరల వల్ల విద్యుత్తు కార్లకు అంతగా గిరాకీ లేదని అభిప్రాయపడ్డారు. అయితే, ఇప్పటికీ పెట్రోల్ కార్లు, హైబ్రిడ్ కార్లు ఇంకా కొత్తగా ఏది వచ్చినా వాటివైపు సానుకూలంగానే ఉన్నట్లు తెలిపారు. మస్కు (Musk) కీలక పదవి ఇస్తానని ట్రంప్ అనడం ఇది తొలిసారేం కాదు. 2016లో గెలిచిన సమయంలో రెండు కీలక సలహా మండళ్లకు మస్క్ ను ఎంపిక చేశారు. కానీ, పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి బయటకు రావాలనే ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2017లోనే ఆయన రాజీనామా చేశారు.

 

ఇంకా చదవండివైసీపీలో ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా మిగలరు! అందరూ మాతో టచ్ లోనే ఉన్నారు! ఎప్పుడు వస్తారంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

తనను కేబినేట్ లోకి తీసుకుంటానన్న ట్రంప్ ప్రతిపాదనపై ఎలాన్ మస్క్ స్పందించారు. 'డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ'కి నేతృత్వం వహించేందుకు రెడీగా ఉన్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆ పదవిలో ఉన్నట్లు.. ప్రసంగిస్తున్నట్లుగా ఉన్న ఓ ఫొటోని కూడా పోస్ట్ చేశారు. ప్రభుత్వ పెట్టుబడులను క్రమబద్ధీకరించి.. వృథాను అరికట్టేలా ఓ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ట్రంప్ ఇటీవల జరిగిన చర్చలో మస్క్ ప్రతిపాదించారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆధార్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికీ అదిరే శుభవార్త! అంగన్‌వాడీసచివాలయాల్లో ఈ నెల 20 నుంచి!

 

18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు మహిళలకు గుడ్ న్యూస్! గొప్ప అవకాశం.. ఇప్పుడు మిస్ చేసుకుంటే ఇక అంతే!

 

విజయ్ సాయి రెడ్డి కుటుంబ సభ్యులు ఘోర పరాజయం! టిడిపి ఎంపీ ఏకగ్రీవంగా ఎన్నిక! సెప్టెంబర్ 8న అధికారికంగా!

 

కేశినేని చిన్నికి కీలక పదవి! వచ్చే నెల 8న అధికారిక ప్రకటన!

 

అక్కాచెల్లెమ్మలకు చంద్రబాబు భారీ శుభవార్త! రక్షాబంధన్ కానుక అదరహో?

 

రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్! మరో కీలక మార్పు! ఇక ఆ సమస్యకు చెక్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!

 

కొత్త ఇల్లు కట్టుకునే వారికి చంద్రన్న కానుక! బాబు సర్కార్ ఐడియా అదిరింది! అధికారులకు కీలక ఆదేశాలు జారీ!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants