న్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో రాష్ట్ర మంత్రి భేటీ! పలు అంశాలపై చర్చ!

Header Banner

న్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో రాష్ట్ర మంత్రి భేటీ! పలు అంశాలపై చర్చ!

  Sun Sep 29, 2024 09:29        U S A

న్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమైన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

మాస్టర్ కార్డు స్ట్రైవ్ ప్లాట్ ఫాం ద్వారా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కలుగుతున్న ప్రయోజనాలపై పై చర్చ

ఆంధ్రప్రదేశ్ లో మాంస ఎగుమతి ఆధారిత కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అప్ సైడ్ ఫుడ్స్ కంపెనీ ప్రతినిధి ఉమా ఒలేటి సంసిద్ధత.

కృత్రిమ మేద యూనివర్సిటీ ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలపై సౌమిత్ చింతలతో చర్చించిన మంత్రి కొండపల్లి 

 

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు అలర్ట్! ఇకపై ఆ కొత్త రూల్ అమలు!

 

న్యూయార్క్/అమరావతి: 28-09-2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ న్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించాల్సిన ఆర్థిక ప్రగతి, కృత్రిమ మేధ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా కలిగే ప్రయోజనాలు, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకోసం మాస్టర్ కార్డు కేంద్రం ద్వారా సాధిస్తున్న ఆర్థిక ప్రగతి తదితర అంశాలపై ఆయా రంగ ప్రముఖులతో శుక్రవారం ప్రధానంగా చర్చించారు. 

 

ఇంకా చదవండి: గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9 

 

సామాజిక ఆవిష్కరణలో కృత్రిమ మేధస్సు ప్రయోజనాలు అర్థం చేసుకోవడానికి సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సాంకేతిక మరియు సమ్మిళిత అభివృద్ధి కేంద్రం "మాస్టర్ కార్డ్ కేంద్ర కార్యాలయం"లో పలువురు ప్రతినిధులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమావేశమయ్యారు. మాస్టర్‌కార్డ్ కేంద్ర కార్యాలయంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి కోసం రుణాలు ఇచ్చే సంస్థ ప్రతినిధులతోపాటు లబ్దిదారులు పలువురు మంత్రిని కలిసి తమ ఆర్థిక ప్రగతికి,తాము సాధించిన విజయాలు తదితర అంశాలపై చర్చించారు. 

 

అప్‌సైడ్ ఫుడ్స్ కు చెందిన ఉమా వలేటి మంత్రితో సమావేశమయ్యారు, ఆయనకు చెందిన కంపెనీ సాంకేతికతతో మాంస పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు చేస్తోందని తెలిపారు. అప్‌సైడ్ పుడ్స్ ఆంధ్రప్రదేశ్ లో ఎగుమతి ఆధారిత తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు ఆ కంపెనీ ప్రతినిథులు మంత్రికి తెలియజేశారు. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్రప్రదేశ్ లో దూరదృష్టి గల నాయకుడు చంద్ర బాబు నాయుడు ఏర్పాటు చేయనున్న కృత్రిమ మేద ఫంక్షనల్ యూనివర్సిటీ గురించి నిపుణుడు సౌమిత్ చింతలతో కలిసి మెటా కంపెనీ ఎజెండా ద్వారా యువతలో నైపుణ్యాన్ని పెంపొందించడం పై మంత్రి చర్చించారు. ఆంధ్రప్రదేశ్ లో కృత్రిమ మేధ ద్వారా డిజిటల్ ఉద్యోగాలను పొందడం, బెంచ్‌మార్క్ డేటాసెట్‌లను నిర్మించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. దీనివల్ల చుట్టూ మరిన్ని మోడల్‌లు మరియు అప్లికేషన్‌లు నిర్మించబడతాయని సౌమిత్ చింతల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు వివరించారు.

 

WhatsApp Image 2024-09-29 at 08.54.26.jpeg

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గ్యాస్ ధరల్లో మార్పులు! అక్టోబర్‌ నుంచి అమల్లోకి వచ్చే మార్పులు ఇవే! 

 

ఏపీ ఆలయాల్లో ఇకపై వాళ్లు మాత్రమే పట్టు వస్త్రాలు సమర్ఫించాలి! చంద్రబాబు సర్కార్ సంచలన ఆదేశాలు! 

 

ఆంధ్రులకు సంతోషాన్ని కలిగించే శుభవార్త! భారీ పెట్టుబడులతో తిరిగి రానున్న లులు (LULU)! ఒకటి కాదు రెండు కాదు ఏకంగా.. చంద్రబాబుతో కంపెనీ యజమాని! 

 

సీఎం చంద్రబాబు, బీజేపీ సీనియర్ నేత భేటీ! రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులపై కీలక చర్చ! 

 

తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడానికి ఏమిటీ సమస్య? నిబంధనల్ని నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణ! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants