18 వేల మందికి అమెరికా డీపోర్టేషన్! ఆందోళనలో భారతీయులు! టాప్ కేటగిరి తెలుగు వారే!

Header Banner

18 వేల మందికి అమెరికా డీపోర్టేషన్! ఆందోళనలో భారతీయులు! టాప్ కేటగిరి తెలుగు వారే!

  Fri Dec 13, 2024 17:46        U S A

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. అధికారం చేపట్టిన వెంటనే అక్రమ వలసదారులపై చర్యలు చేపడతానని వాగ్దానం చేశారు. వీటికి అనుగుణంగానే అధికారిక ఆదేశాలు ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా.. అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు కూడా అటువంటి వారి జాబితా రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో 18 వేల మంది ప్రవాస భారతీయులు అమెరికా డీపోర్టేషన్ (Deportation) ముప్పు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారికి సంబంధించి యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) ఇటీవల గణాంకాలు విడుదల చేసింది. మొత్తంగా 14.45 లక్షల మంది ఈ జాబితాలో ఉండగా.. 2,61,651 మందితో హోండరస్ మొదటిస్థానంలో నిలిచింది. గ్వాటెమాలా నుంచి రెండున్నర లక్షల మంది ఉండగా.. మెక్సికో, ఎల్ సాల్వెడార్ దేశాలకు చెందిన వారి సంఖ్య అధికంగా ఉంది. ఈ జాబితాలో 17,940 మంది భారతీయులు కూడా ఉన్నట్లు ఐఈసీ నివేదిక పేర్కొంది. దాదాపు 37 వేల మంది చైనీయులు ఈ ముప్పును ఎదుర్కొంటున్నారు.


ఇంకా చదవండివైసీపీకి వరుస షాక్ లు.. పార్టీకి రాజీనామా చేయనున్న మాజీ మంత్రి! దానికి కారణం అదేనా?



అమెరికాలో ప్రస్తుతం లక్షలాది మంది భారతీయులు అనధికారికంగా ఉంటున్నట్లు అంచనా. సరైన పత్రాలు లేని వీరంతా చట్టబద్దత కోసం ప్రయత్నిస్తున్నారు. ఐసీఈ నుంచి క్లియరెన్స్ వచ్చేందుకు ఏళ్ల సమయం పడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో గత మూడేళ్లలో అక్రమ మార్గాల్లో అగ్రరాజ్యంలో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తూ వేల మంది భారతీయులు పట్టుబడటం ఆందోళనకర విషయం.
అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోన్న ట్రంప్.. బాధ్యతలు చేపట్టిన వెంటనే భారీ స్థాయిలో డిపోర్టేషన్ ఆపరేషనన్ను చేపడతానని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో భారత అధికారుల నుంచి సరైన సహకారం లేదని ఐసీఈ పేర్కొనడం ప్రవాసుల్లో ఆందోళనకు కారణమైంది. వీటిని పరిష్కరించేందుకు దౌత్యపరమైన మార్గాలను ఇరు దేశాలు అన్వేషిస్తున్నట్లు సమాచారం.
ఇదిలాఉంటే, చట్టబద్ధంగా వలస వచ్చేవారికి మార్గం సులువు చేస్తానని కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన తల్లిదండ్రుల సంతానం (డ్రీమర్స్)లో చాలామంది ఇక్కడే పుట్టి పెరిగారని, వారిలో అనేక మంది గొప్ప ఉద్యోగాలు, వృత్తులు చేస్తున్నారని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. వారి సమస్యను పట్టించుకుంటానని ట్రంప్ చెప్పడం భారతీయులకు కాస్త ఊరట కలిగించే విషయం.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:



ఏపీ ప్రజలకు అలర్ట్.. ఇక వారికే పెన్షన్లు - అలా కట్ చేయండి! కలెక్టర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు!

 

నేడు (13/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

దివ్వెల మాధురికి లైవ్ లో ప్రపోజ్ చేసిన దువ్వాడ! ప్రేమా.తెగింపా.తెర వెనుక..

 

వైసీపీకి మరో షాక్‌! మాజీ మంత్రి రాజీనామా చేసిన గంటల్లోనే మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. ఆధారాలతో దొరికేసిన మాజీ మంత్రి! ఐపీఎస్ తో సహాఅందుకు సహకరించిన వారి పేర్లను!

 

జిల్లా కలెక్టర్లతో ఏపీ ప్రభుత్వం కీలక సమావేశం! అదే మనకు శ్రీరామ రక్ష - ఎవరైనా అతిక్రమించి వ్యహరిస్తే!

 

గల్ఫ్: విదేశాల నుంచి వాపస్ వచ్చినవారి పునరావాసంపునరేకీకరణకు కృషి! ప్రాజెక్ట్ లక్ష్యాలుముఖ్య లబ్ధిదారులు..

 

నేడు (12/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల! ఎప్పటి నుంచీ ఎప్పటి వరకుఅంటే?

 

కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం - నేడురేపు ఏపీలో భారీ వర్షాలు! ఆ జిల్లాల్లో ఒక్కసారిగా మారిన వాతావరణం!

 

మంత్రి లోకేశ్ ను మెచ్చుకున్న చంద్రబాబు! ఎందుకు అంటే! ప్రతి సంక్షోభంలోనూ అవకాశాలు..

 

ఆయన మా నాన్న కాదు.. ఆ హక్కు లేదు -మంచు మ‌నోజ్! ఏడు నెల‌ల కూతురును కూడా!

 

 గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ 2024 లిస్ట్‌! నెటిజన్లు ఎక్కువగా ఏమి వెతికారో తెలుసాపవన్ కల్యాణ్ స్థానం ఎంతంటే?

 

వైన్ షాపులపై గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! బెల్ట్ షాపుల యజమానులపై.. ఇక కిక్కు ఎక్కాల్సిందే!

 

ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పరీక్ష లేకుండానే ఎంపిక! ఈ అర్హతలు ఉంటే చాలు.. Don't Miss

 

నామినేటెడ్ పోస్టులు అన్నీ ఒకే సారి విడుదలఎప్పుడు అంటే?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #america #donaldtrump #Indians #ice #deportion #todaynews #flashnews #latestupdate