H-1B వీసాల‌పై అమెరికా కీల‌క ప్ర‌క‌ట‌న‌.. తాజా అప్‌డేట్‌ ఇదే! భారతీయ టెక్ రంగానికి గొడ్డలిపెట్టు!

Header Banner

H-1B వీసాల‌పై అమెరికా కీల‌క ప్ర‌క‌ట‌న‌.. తాజా అప్‌డేట్‌ ఇదే! భారతీయ టెక్ రంగానికి గొడ్డలిపెట్టు!

  Tue Dec 17, 2024 20:44        U S A

అమెరికాలో స్థిరపడాలి, నాలుగు డాలర్లు వెనకేసుకుని ఊళ్లో గుర్తింపు తెచ్చుకోవాలన్నది చాలా మంది నేటి భారతీయ యువతకు తరతరాలుగా వచ్చిన ఇన్పిరేషన్. అక్కడి డాలర్లతో ఇక్కడ స్థలాలు, భూములు, వ్యాపారాల ద్వారా స్థిరపడిన కుటుంబాలు కోకొల్లలు. కానీ కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లోకి అడుగుపెడుతున్న వేళ ఇకపై అమెరికా కలలు కష్టతరంగా మారిపోతున్నాయి. అలాగే ట్రంప్ గ్రీన్ కార్డుల విషయంలోనూ రూల్స్ మార్చాలని చూస్తున్న వేళ అమెరికా వీసాల విషయంలో అనేక మార్పులు చోటుచేసుకోబోతున్నాయని తెలుస్తోంది. H-1B వీసా ప్రోగ్రాం సమగ్ర నియంత్రణ సవరణకు సంబంధించిన ప్రతిపాదన ప్రస్తుతం వైట్‍హౌస్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ సమీక్షలో ఉందని బ్లూమ్‍బెర్గ్ నివేదించింది.

 

 ఇంకా చదవండి: విశ్వవిఖ్యాత "తబలా" విధ్వంసుడు, పద్మ విభూషణ్, పండిట్ జాకీర్ హుస్సేన్ ఇక లేరు! అమెరికాలో ఘటన! 73 ఏళ్ల వయస్సులో!

 

గత సంవత్సరం యూఎస్ పౌరసత్వం అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి సాంకేతిక పరిశ్రమ ప్రధానంగా ఉపయోగించే స్పెషాలిటీ ఆక్యుపేషన్ వీసాల కోసం డిగ్రీ అవసరాలతో సహా అర్హత ప్రమాణాలను సర్దుబాటు చేసే డ్రాఫ్ట్ నిబంధనలను జారీ చేసిన సంగతి తెలిసిందే. గతంలో హెచ్1బీ వీసాలను లాటరీ పద్దతిలో అందించటం వల్ల ప్రతి దరఖాస్తుదారునికి వీసా పొందేందుకు అవకాశం కల్పించబడింది. అయితే కొత్త సంవత్సరం ప్రారంభం అవటానికి ముందు ప్రస్తుతం తిరిగి మార్పులకు అమెరికా శ్రీకారం చుట్టడం గమనార్హం. ఏటా హెచ్1బీ వీసాలను గరిష్ఠంగా 85,000 అందించటానికి పరిమితం చేయబడింది. గత సంవత్సరం వ్యవసాయ, వ్యవసాయేతర కాలానుగుణ కార్మికులకు సేవలందించే తాత్కాలిక H-2A, H-2B వీసా కార్యక్రమాల్లో అక్రమ రుసుములు, ఇతర దుర్వినియోగాలపై అమెరికా దృష్టి సారించింది.

 

ఇంకా చదవండి: ట్రూత్ సోషల్ సీఈవోకు ఇంటెలిజెన్స్ బోర్డు ఛైర్మన్ పదవి! ట్రంప్ పాలనలో కొత్త వ్యూహాలు!

 

ప్రతిపాదిత నిబంధనలలో కార్మికుల రక్షణలను ఉల్లంఘించినట్లు గుర్తించిన యజమానులపై ఏకంగా 4 ఏళ్ల పాటు నిషేధం వంటి జరిమానాలను డ్రాఫ్ట్ రూపంలో విడుదల చేసిన ఒక నియమంలో వెల్లడించింది. ఈ సీజనల్ వీసా ప్రోగ్రామ్‌లకు అర్హులైన దేశాల జాబితాను ఏటా ప్రచురించాల్సిన అవసరాన్ని కూడా ప్రతిపాదన తొలగించటం గమనార్హం. వాస్తవానికి H-1B వీసా ప్రోగ్రామ్ అమెరికా యజమానులు తాత్కాలికంగా విదేశీ ఉద్యోగులను ప్రత్యేక వృత్తుల్లో నియమించుకోవడానికి అనుమతిస్తుంది. ఈ క్రమంలో వారికి సైద్ధాంతిక, ఆచరణాత్మక నైపుణ్యం అవసరం. దీనికోసం సదరు వ్యక్తులు బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హతను కలిగి ఉండాలి. ముఖ్యంగా ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, మెడిసిన్, ఎడ్యుకేషన్, బిజినెస్, లా అండ్ ఆర్ట్స్ వంటి వాటికి మాత్రమే పరిమితం కాకుండా దీనికింద అర్హత గల ఫీల్డ్‌లు ఉన్నాయి. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం అమెరికాలోని దిగ్గజ టెక్ కంపెనీలైన గూగుల్, అమెజాన్, ఇన్ఫోసిస్, ఐబీఎమ్ వంటి ప్రముఖ కంపెనీలు 2024లో తక్కువ H-1B వీసాలను స్పాన్సర్ చేశాయని వెల్లడైంది. 2023 ఆర్థిక సంవత్సరంలో జారీ చేయబడిన మొత్తం 386,000 H-1B వీసాల్లో భారతీయ పౌరులు 72.3% దక్కించుకోవటం గమనార్హం.

 

ఇంకా చదవండి: అమెరికా అధ్యక్షుడికి బిగ్ షాక్! హష్ మనీ కేసులో దోషిగా!

 

ఈ ఆర్థిక సంవత్సరం ప్రధానంగా టాప్ ఐటీ కంపెనీలకు అందించిన హెచ్1బీ వీసాల ఆమోదం సంఖ్య భారీగా 7299కి తగ్గించబడింది. ఇదే సంఖ్య 2015 ఆర్థిక సంవత్సరంలో పరిశీలిస్తే ఏకంగా 14,792గా ఉన్న సంగతి తెలిసిందే. జనవరి 20 ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి తన మెుదటి టర్మ్ అధ్యక్ష సమయంలో మాదిరిగా నిర్బంధ ఇమ్మిగ్రేషన్ విధానాలను పునరుద్ధరిస్తే హెచ్1బీ వీసాల తిరస్కరణ రేటు తిరిగి పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జనవరి 20న అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్న వేళ అమెరికాలోని యూనివర్సిటీలు అప్రమత్తం అయ్యాయి. 2017లో మెుదటి సారి ట్రంప్ గెలిచినప్పుడు ఎదురైన పరిస్థితుల దృష్యా తమ విదేశీ విద్యార్థులను ముందుగానే అప్రమత్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో విదేశాల్లో ఉన్న విద్యార్థులు ట్రంప్ అధ్యక్షుడిగా జనవరిలో బాధ్యతలు చేపట్టే సమయానికి భౌతికంగా అమెరికాలో ఉండాలని సూచిస్తున్నాయి. ఇదే క్రమంలో ఇతరదేశాల్లో ఉన్న తమ సిబ్బందికి కూడా ఇదే తరహా సూచనలు చేసాయి. ఈ క్రమంలో యేల్ యూనివర్శిటీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అండ్ స్కాలర్స్ ఆఫీస్ ఇటీవల ఇమ్మిగ్రేషన్ పాలసీ మార్పులపై ఉన్న ఆందోళనలను పరిష్కరించడానికి వెబినార్‌ కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే.

 

ఇంకా చదవండి: వైసీపీకి బిగ్ షాక్! ఆళ్ల నాని సైకిలెక్కేస్తున్నారా ? రేపు ఉదయం 11 గంటలకి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

4 రోజుల పాటు కొనసాగనున్న భువనేశ్వరి పర్యటన! ఎక్కడ అంటే!

 

ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు హైకోర్టు గుడ్ న్యూస్! రూల్ 3(ఎ) సవరణకు గ్రీన్ సిగ్నల్!

 

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు... మోహన్ బాబు భార్య సంచలన లేఖ!

 

ఏపీ ప్రజల కోసం మరో పథకం తెచ్చిన చంద్రబాబు! వారందరికీ ఫ్రీగా రూ.2వేల.. వైసీపీ సర్కార్ వాటిలో!

 

ఆ కేసులో పేర్ని నానికి బిగ్ షాక్! ఎట్టకేలకు లుక్‌ అవుట్‌ నోటీసు!

 

మరో గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! అమరావతి లో 24,276 కోట్ల పనులకు ఆమోదం! టెండర్ల ప్రక్రియ మొదలు! ఇక వారికి పండగే!

 

ఏపీకి మూడ్రోజుల వర్ష సూచన... ఆ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు!

 

నేడు (16/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీ ప్రజలకు భారీ శుభవార్త! వారి గుండెల్లో నిలిచిపోనున్న CBN! ఒక్కొక్కరికి... ఎప్పటి నుంచి అంటే?

 

ఏపీకి మూడ్రోజుల వర్ష సూచన... ఆ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు!

 

పవన్ హామీని నిలబెడుతున్న చంద్రబాబు - సచివాలయంలో భేటీ! కీలక ఉత్తర్వులు..!

 

ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టిన చరిత్ర జగన్ ది! రాష్ట్రానికి చేసిన ద్రోహం క్షమించేది లేదు!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్తగా నాలుగు లైన్ల రహదారి ప్రాజెక్టులకు మోక్షం! ఆ రూట్లలోనే..ఆ జిల్లా వారికి పండగ!

 

నేడు (16/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

2025 ఏడాదికి ఏపీ సర్కార్ సెలవుల జాబితా విడుదల! 21 ఐచ్ఛిక సెలవులు..

 

ఏపీలో కొత్త యూనివర్సిటీ.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ఎక్కడ అంటే?

 

ప్రజలకు బిగ్ అప్డేట్ ఇచ్చిన కేంద్రం! త్వరలోనే కొత్త రూ.1000 నోట్లు.. RBI ఏం చెప్పింది?

 

ఆర్జీవీ నోటి దూల తగ్గలా.. రేవంత్ రెడ్డి పై కారు కూతలు!

 

కావాలని కొట్టలేదు - ఐయామ్ సారీ! జర్నలిస్ట్ సంఘాలకి క్షమాపణలు.. వెంట విష్ణు కూడా..

 

రఘురామకృష్ణ చిత్రహింసల కేసులో కిలక మలుపు! గుంటూరు జీజీహెచ్లో...!

 

వైకాపా మాజీ ఎంపీ హౌస్ అరెస్ట్ సంచలనం! పులివెందులలో పోలీసుల ప్రత్యేక నిఘా!

 

18 వేల మందికి అమెరికా డీపోర్టేషన్! ఆందోళనలో భారతీయులు! టాప్ కేటగిరి తెలుగు వారే!

 

మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు! అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం!

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. ఇక వారికే పెన్షన్లు - అలా కట్ చేయండి! కలెక్టర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #USA #H1BVisa #India #Students #USANews #Government #Update #H1B