సింగాపుర్: మలేషియా సరిహద్దుల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్! ప్రభుత్వం నిర్వహిస్తున్న తనిఖీలు! దాడుల నేపధ్యంలో!

Header Banner

సింగాపుర్: మలేషియా సరిహద్దుల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్! ప్రభుత్వం నిర్వహిస్తున్న తనిఖీలు! దాడుల నేపధ్యంలో!

  Tue May 21, 2024 18:44        Singapore

జోహార్ బారు: మలేషియాతో సరిహద్దు క్రాసింగ్‌ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని సింగపూర్ నిర్ణయంతో కాజ్‌వే మరియు రెండవ లింక్‌లో భారీగా ట్రాఫిక్ జామ్‌ అయ్యింది. ప్రయాణించే చాలా మంది వాహనదారులు రెండు నుండి మూడు గంటల ట్రాఫిక్ లో చీకక్కుకున్నారు. మే 17న ఉలు తిరం పోలీస్ స్టేషన్‌పై దాడి జరిగిన వెంటనే తనిఖీలు ప్రారంభించినట్లు వారు తెలిపారు. సింగపూర్ అధికారులు ఆదివారం ఉదయం నుంచి అన్ని వాహనాలపై క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.

 

“ప్రజలకు చాలా అసౌకర్యం కలిగించే ఇలాంటి తనిఖీలు ఎందుకు నిర్వహించాలి? ఆదివారం నాలుగు గంటల పాటు కాజ్‌వే వద్ద జామ్‌లో ఇరుక్కుపోయాను, అని కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. “మోటారు సైకిళ్లను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పోలీసులు, కస్టమ్స్ మరియు ఇమ్మిగ్రేషన్‌కు చెందిన చాలా మంది ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సింగపూర్ చెక్‌పోస్టుల వద్ద ఉన్నారు, ”అని ఒకరు అన్నారు, మే 25 మరియు జూన్ 23 మధ్య రాబోయే సింగపూర్ పాఠశాల సెలవుల సమయంలో ట్రాఫిక్ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మలేషియా వైపు ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ ఎలాంటి సమస్యలు లేకుండా సాఫీగా సాగిందన్నారు. రోజూ సింగపూర్‌కు బస్సులో ప్రయాణించే ఒక ప్రయాణీకుడు, ఆదివారం నుండి ట్రాఫిక్ రద్దీ మరింత పెరిగింది అన్నారు. "జామ్ కారణంగా బస్సులు కాజ్‌వేను దాటలేకపోవడంతో వేలాది మంది ప్రజలు చిక్కుకుపోయారు" అని తెలిపారు.

 

ఉలు తిరం పోలీస్ స్టేషన్‌లో 21 ఏళ్ల యువకుడి దాడిలో ఇద్దరు పోలీసులు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో దాడి చేసిన వ్యక్తి కూడా చనిపోయాడు. దాడి తర్వాత చెక్‌పోస్టులతో సహా భద్రతా చర్యలను పెంచినట్లు సింగపూర్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ప్రకటించింది. భద్రతా చర్యలను పెంచడం వల్ల తమ చెక్‌పోస్టుల ద్వారా వెళ్లే ప్రయాణికులు కొంత ఆలస్యమవుతారని మంత్రిత్వ శాఖ తెలిపింది.

 

ఇవి కూడా చదవండి: 

UAE: కల్తీ మాంసం అమ్ముతున్నారని ప్రముఖ సూపర్ మార్కెట్ సీల్ చేసిన అధికారులు! కల్తీలపై ప్రజలకు విజ్ఞప్తి! కఠిన శిక్షలు 

 

 

ఎమిరేట్స్ విమానాన్ని ఢీకొన్న 36 ఫ్లెమింగోలు! తృటిలో తప్పిన అతిపెద్ద ప్రమాదం! ఎమర్జెన్సీ ల్యాండింగ్... అసలేమైందంటే 

 

కువైట్: వేసవిలో బహిరంగ ప్రదేశాల్లో పని చేయడం నిషేధం! పబ్లిక్ అథారిటీ ఆదేశాలు! ఆ వేళల్లో చేస్తే భారీ జరిమానాలు! 

 

ఢిల్లీ లో NRI డా. లోకేష్ ను అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు! 41A CRPC నోటీసులు జారీ! ఈ నెల 30 న హాజరు కావాలి! హైదరాబాదుకు తిరిగి ప్రయాణం! 

 

ధోనీ రిటైర్మెంట్ పై సీఎస్కే ఏం చెబుతుంది! ధోనీ ఆఖరి ఐపీఎల్ ఇదేనా! చదివేయండి! 

 

బేబీ బంప్ తో దీపికా పదుకొనే! ఎంత క్యూట్ గా ఉందో! ఒక లుక్ వేయండి! 

 

ఎగిరే కారు వచ్చేసింది.. అలా గాల్లో తేలిపోవచ్చు! వీడియో వైరల్! దీని రేట్ ఎంతో తెలుసా! 

 

అమెరికాలో అరుదైన గౌరవం దక్కించుకున్న తెలుగు మ‌హిళ! కాలిఫోర్నియాలో మొట్టమొదటి సారిగా! ఎవరు ఆమె! 

 

బ్రిటన్ లో ఆర్ధిక సంక్షోభం... కానీ! భారీగా పెరిగిన రిషి సునాక్ ఆస్తులు! కారణం ఏమిటి! 

                  

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Singapore #SingaporeNews #SingaporeUpdates #IndianMigrants #teluguMigrants