సింగపూర్: అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు! తెలుగు సమాజం ఆధ్వర్యంలో! వేలాది మంది భక్తిశ్రద్ధలతో!
Tue Sep 10, 2024 08:39 Singaporeప్రపంచవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో భాద్రపద శుక్ల చవితిని పురస్కరించుకుని జరుపుకునే వినాయక చవితి పండుగను ఈ ఏడాది కూడా సింగపూర్‌లోని తెలుగు వారు సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో కిండల్ కిడ్స్ పాఠశాల సభామందిరంలో సశాస్త్రీయంగా కల్పోక్తరీతిలో ఘనంగా నిర్వహించారు. శనివారం సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమైన ఈ పూజ కార్యక్రమంలో వినాయక షోడషోపచార, ఏకవింశతి, దూర్వాయుగ్మ, అష్టోత్తర శతనామావళి పూజలతో పాటు , వినాయకోత్పత్తి, శమంతకమణోపాఖ్యానం వంటి కథా శ్రవణాలతో కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి. సుస్మిత కొల్లి అందర్నీ ఆకట్టుకునేలా పూజా వేదికను అలంకరణ చేశారు. విద్యార్థి బృందం దేవుని పాటలతో అందరినీ అలరించింది. పూజ అనంతరం అందరికీ ప్రసాద వితరణ జరిగింది. గణపతి లడ్డూ వేలంలో లక్ష్మి మరియు కరణ్ దంపతులు లడ్డూను దక్కించుకున్నారు. కార్యక్రమం చివరగా నిమజ్జనంతో ముగిసింది.
ఇంకా చదవండి: సింగపూర్: ఇకపై ఏజెంట్ ల వద్ద పడిగాపులు అవసరం లేదు! ఒక్కరోజులో టూరిస్ట్ వీసా! ఆన్ లైన్ లో స్వయంగా మీరే!
కార్యక్రమ నిర్వాహకులు శ్రీమతి సుప్రియ మాట్లాడుతూ, పూజలో పాల్గొన్న పిల్లలు, ప్రోత్సాహం అందించిన తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్న పిల్లలు మరియు పెద్దలు ప్రత్యక్షంగా పాల్గొని భక్తి మరియు శ్రద్ధలతో పూజలు నిర్వహించడమే కాకుండా ఫేస్బుక్ మరియు యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా 7,500 మందికి పైగా వీక్షించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగు సమాజం ఉపాధ్యక్షులు జ్యోతీశ్వర్ రెడ్డి పర్యవేక్షించారు.
తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం నిర్వహించడం దైవసంకల్పం అని, ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రకృతి విపత్తుల నుండి త్వరగా కోలుకోవాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం నిర్వహణకు ప్రధానంగా సహకరించిన కిండల్ కిడ్స్ పాఠశాల యాజమాన్యానికి, విగ్రహ దాతలు పుట్టి ప్రసాద్, ముద్దం విజ్జేందర్, తాటిపల్లి విజయబాబు, కొత్తమాసు రాజశేఖర్ కు, పూజారి శ్రీ శ్రవణ్ బల్కి గారికి, ప్రసాదాలు అందించడానికి సహకరించిన దాతలకు, కమిటీ సభ్యులకు, సేవాదళ కార్యకర్తలకు గౌరవ కార్యదర్శి అనిల్ కుమార్ పోలిశెట్టి కృతజ్ఞతలు తెలిపారు.
ఇంకా చదవండి: తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్! వీటి ధరలు భారీగా తగ్గింపు! నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రూ.2 లక్షలు తక్కువకే కొత్త కారు కొనేయండి! మళ్లీ మళ్లీ రాని భారీ ఆఫర్లు!
అదిరే గుడ్ న్యూస్! విశాఖపట్నం, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు!
చంద్రబాబును అరెస్ట్ చేసి నేటికి ఏడాది! ఆరోజు ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారు! మంత్రి ఫైర్!
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం! ఆ వ్యాపారవేత్తకు బెయిల్!
ఎమ్మెల్యే తృటిలో తప్పిన పెను ప్రమాదం! ఆలపాడు - కొల్లేటికోట రహదారి పూర్తిగా!
జగన్ ట్వీట్ కు బ్రహ్మాజీ కౌంటర్! ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం!
మరోసారి భారీ వర్షం... వెంటనే ఖమ్మం బయల్దేరిన డిప్యూటీ సీఎం! 15 సెంటీమీటర్ల వర్షపాతం!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!
వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొనసాగుతున్న వైసీపీ నేతల రాజీనామాల పర్వం! కారణం?
మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!
టాప్ లెస్‌గా హైదరాబాదీ అమ్మాయి.. కుర్రాళ్లకు క్రాక్! సోషల్ మీడియా షేక్!
భార్యకు షాకిచ్చిన దువ్వాడ.. వాణి పోరాటం వృథానేనా! సోషల్ మీడియాలో ట్రోల్!
ఇక వరదలకు చెక్.. బుడమేరుకు రిటైనింగ్ వాల్ ప్రణాళిక! మంత్రుల కీలక వ్యాఖ్యలు!
స్టార్ హీరోలను మించి! ఏపీ, తెలంగాణాలకు రియల్ హీరో సోనూసూద్ భారీ విరాళం!
హైదరాబాదులోని అమెరికా కౌన్సిలేట్లో ఉద్యోగ అవకాశాలు! వెంటనే అప్లై చేసుకోండి ఇలా! జీతం ఎంతంటే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Singpore #FestivalCelebrations #Indians #VinayakChavati
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.