అంబరాన్నంటిన సింగపూర్ తెలుగు సమాజం వారి బతుకమ్మ సంబరాలు! వేల సంఖ్యలో తెలుగువారి సందడి!

Header Banner

అంబరాన్నంటిన సింగపూర్ తెలుగు సమాజం వారి బతుకమ్మ సంబరాలు! వేల సంఖ్యలో తెలుగువారి సందడి!

  Mon Oct 07, 2024 20:16        Singapore

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో ౹

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, సింగపూర్ గౌరమ్మ ఉయ్యాలో ౹౹

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం స్థానిక టాంపినీస్ సెంట్రల్ పార్క్ లో సింగపూర్ బతుకమ్మ సంబరాలు అట్టహాసంగా నిర్వహించబడ్డాయి. పితృ అమావాస్యనాడు ప్రారంభమై, తొమ్మిది రోజుల పాటు కొనసాగి, చివర్లో సద్దుల బతుకమ్మతో ముగిసే ఈ వేడుకల్లో, మహిళలు పూలనే గౌరమ్మగా పేర్చి రోజుకో బతుకమ్మగా పూజించి ఆశీస్సులు పొందడం సంప్రదాయం.

 

ఇంకా చదవండిగల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ఈ వేడుకలకు సింగపూర్ లోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఆడపడచులు, పిల్లలు, మరియు పెద్దలు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. పూలతో తయారు చేసిన అందమైన బతుకమ్మలను మధ్యలో ఉంచి, అందరూ కలిసి వలయాకారంలో జానపద పాటలు పాడుతూ, ఆడుతూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ఆనందంగా వేడుక జరుపుకున్నారు. సాంప్రదాయ వస్త్రధారణలో చిన్నాపెద్దా అందరూ ఆడిపాడి ఈ వేడుకను మరింత రంగరించారు. ఈ సందర్భంగా సింగపూర్ స్థానికులు కూడా వేడుకను ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత బతుకమ్మలను శాస్త్రోక్తంగా నిమజ్జనం చేశారు. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

 

సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతిని తెలియజేసే విశిష్టతను ఉటంకించారు. ఈ పండుగ తెలుగువారి ఐక్యతను ప్రపంచమంతా చాటుతుందనీ, సింగపూర్ లో కూడా ఈ సంబరం నిర్వహించడం వల్ల తెలుగువారంతా ఒక్కటైనట్లు అనిపిస్తోందని అన్నారు. తెలుగు సమాజంలో సభ్యత్వం తీసుకోవాలని, అందరూ కలిసి ఈ సంస్కృతి పునరుద్ధరణకు కృషి చేయాలని కోరారు. 

 

కార్యక్రమ నిర్వాహకులు పుల్లనగారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ఆర్ ఆర్ హెచ్ సి , నార్పాణి టాంపినీస్ సిసి ఐఎఇసి వంటి స్ధానిక సంస్ధల సహకారంతో సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో నిర్వహించబడిందని చెప్పారు. ముఖ్యంగా బతుకమ్మల అందం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉత్తమంగా అలంకరించిన మూడు బతుకమ్మలకు ప్రత్యేక బహుమతులు అందజేశారు, అలాగే ఈ సంవత్సరం 8 ప్రోత్సాహక బహుమతులు కూడా ప్రధానం చేశారు. కొత్త సుప్రియ సారధ్యంలో నడుస్తున్న ‘అమ్మ చారిటబుల్’ సంస్థ సహకారంతో ఈ బహుమతులు అందించామన్నారు. 

 

ఇంకా చదవండిసీఎం చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమీక్ష! రైల్వే, వరద నిధులపై చర్చ! 

 

గౌరవ కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి సుమారు 2000 మంది హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారని, వారికి కార్యక్రమానంతరం కుంభకర్ణ, Mr. బిరియాని, ఫ్లేవర్స్, తందూర్ లాంజ్, ఆంధ్రకర్రీ, మరియు బంజార రెస్టారెంట్ వంటి వారి భాగస్వామ్యం లో భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వేడుకను విజయవంతం చేసేందుకు సహకరించిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాల మాధ్యమాల ద్వారా సుమారు 6000 మంది ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారని, 10 మంది లక్కీ విజేతలకు వెండి మరియు ఇతర ఆకర్షణీయ బహుమతులు అందజేశారని చెప్పారు. 

 

సింగపూర్ లో తెలుగు వాసుల ఐక్యతను చాటుతూ, వారి సాంస్కృతిక భావాలను పదిలపరిచిన ఈ బతుకమ్మ వేడుక సింగపూర్ తెలుగు సమాజానికి మరింత గౌరవం తీసుకొచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. 

 

 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీఐఐసీమారిటైం బోర్డు నూతన ఛైర్మన్లను అభినందించిన హోంమంత్రి! రూ.2,350 కోట్ల పెట్టుబడులు, 4,300 మందికి ఉపాధి!

 

ఏపీ మహిళలకు అలర్ట్.. ఉచిత సిలిండర్ల కోసం వెంటనే ఇది చెయ్యండి! Don't miss..!

 

ఏపీ రైతులకు మరో శుభవార్త.. మంచి నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు! కొన్ని జిల్లాల్లో 100 కిలోమీటర్లకు పైగా!

 

ఇసుక విధానంపై సోషల్ మీడియాలో ప్రచారం! చంద్రబాబు వార్నింగ్! ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా!

 

డ్వాక్రా సంఘాలకు సీఎం అదిరిపోయే కానుక.. ఇక మహిళలకు పండగే పండగ!

 

ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణం రాష్ట్రంలో సంచలనం! మేనేజర్ మోసపూరిత చర్యలతో కోట్లు మాయం! బాధితులు ఆందోళనలో!

 

ఇసుక దందాలో చేతులు కలిపిన పోలీసు అధికారులపై వేటు! ఏకంగా ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను విఆర్‌కు!

 

ఆ సమస్యలు ఉన్నవారు బంగాళాదుంపలు తినకపోవడమే మంచిది! ఇంతకీ ఏంటా సమస్య?

 

అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు వైరల్! పరువునష్టం దావాతో కోర్టులో నాగార్జున!

 

హిందూ ఆలయాలపై దాడులు! తిరుమల వివాదంపై కేంద్రమంత్రి హాట్ కామెంట్స్! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Singapore #SingaporeNews #SingaporeUpdates #IndianMigrants #teluguMigrants