ఆస్ట్రేలియా: 74 సం. వృద్ధురాలికి దేశ బహిష్కరన! మైగ్రేషన్ యాక్ట్ సెక్షన్ 109 అమలు! ప్రవాసులు జరా భద్రం!

Header Banner

ఆస్ట్రేలియా: 74 సం. వృద్ధురాలికి దేశ బహిష్కరన! మైగ్రేషన్ యాక్ట్ సెక్షన్ 109 అమలు! ప్రవాసులు జరా భద్రం!

  Mon Feb 12, 2024 19:06        Australia

ఆస్ట్రేలియా: నార్తన్ న్యూ సౌత్ వేల్స్ లో నివసిస్తున్న 74 ఏళ్ల మేరీ ఎల్లిస్ ను ఇటీవల దేశం నుంచి బహిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మేరీ పుట్టింది లండన్లోనైనా ఆమెకు 31 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆస్ట్రేలియా వచ్చింది. ఆమెకు ఆస్ట్రేలియాలో డ్రైవింగ్ లైసెన్స్, ఐడి కార్డ్, మెడికేర్ కార్డ్, పెన్షన్ కార్డ్ అన్ని ఉన్నాయి. ఆమెకు ఒక కొడుకు ఇద్దరు మనవరాలు ఉన్నారు వారు ఆస్ట్రేలియన్ పౌరులు అయ్యారు. ఆమె ఎంతో మందికి సహాయం చేసింది. సీనియర్ వాలంటీర్ అవార్డుకి నామినేట్ కూడా అయింది.

 

ఆమె తప్పుడు డాక్యుమెంట్లతో దేశంలోకి ప్రవేశించింది అని ప్రభుత్వం తెలిపింది. ఇప్పుడు అదే కారణంతో ఆమెను దేశ బహిష్కరణ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియాలో నివసించే హక్కు లేని వాళ్ళు ఆస్ట్రేలియా వదిలి వెళ్లిపోవాలని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

 

ఆస్ట్రేలియా పౌరులు కాని వారు వీసా దరఖాస్తులు చేసుకునే సమయంలో అడిగే ప్రశ్నలకు సరైన సమాచారం ఇవ్వాలి. తప్పుడు సమాచారం ఇస్తే ఆస్ట్రేలియన్ మైగ్రేషన్ యాక్ట్ సెక్షన్ 109 ప్రకారం వారి వీసా రద్దు అయ్యే అవకాశం ఉంది.

 

కావున ఎవరైనా గానీ తప్పుడు సమాచారాన్ని ఇస్తే తర్వాత మీరే ఇబ్బందుల్లో పడతారు. ఇలాంటి దరఖాస్తులు చేసేటప్పుడు సరైన సమాచారం ఇవ్వడం మంచిది.

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Pravasi #AndhraPravasiNews #NRINews #AustraliaNews #AustraliaUpdates #TeluguNews #TeluguMigrants