ఒమన్: భారత ఎంబసీ నిద్రపోతుందా? పార్కుల్లో, బీచుల్లో నివాసం ఉంటున్న తెలుగు ఆడవాళ్లను పట్టించుకోదా...

Header Banner

ఒమన్: భారత ఎంబసీ నిద్రపోతుందా? పార్కుల్లో, బీచుల్లో నివాసం ఉంటున్న తెలుగు ఆడవాళ్లను పట్టించుకోదా...

  Sat Jul 20, 2024 11:45        Oman

By - చప్పిడి. రాజ శేఖర్ 
Ex Director (Operations) APNRT
NRI TDP cell Co-Ordinator (TDP Central Office)

 

ఒమన్: భారతదేశంలోని ఏ ఊర్లో అయినా ఏదైనా ఇబ్బంది వస్తే దానికి సంబంధించిన ఆఫీసులు లేదా పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇస్తాము. అదే విదేశాల్లో ఉన్నప్పుడు ఏదైనా కష్టం వస్తే వెంటనే గుర్తొచ్చే పేరు భారత రాయబార కార్యాలయం అదే ఎంబసీ.

సహాయం చేయడానికి ఎవరూ లేనప్పుడు అందరూ తప్పనిసరిగా ముందు ఆశ్రయించాల్సింది ఎంబసీ నే. అదే ఎంబసీ మనల్ని పట్టించుకొకపోతే ఏం చేయాలి...

 

 

ఒమన్ లో బ్రతుకు తెరువు కోసం అని వెళ్ళిన వారికి ఏదైనా ఇబ్బంది వస్తే ఇండియన్ ఎంబసీ అస్సలు పట్టనట్టు వ్యవహరిస్తుంది అని ఈమధ్య తరచుగా వినిపిస్తుంది. అలాగే చాలామంది విమర్శలు చేస్తున్నారు.

తమ బాధను చెప్పుకొని సహాయం అడగడానికి ఎంబసీకి వస్తే వారిని పట్టించుకునే నాధుడే కరువయ్యారు అని, చిరు ఉద్యోగాల కోసం వచ్చినటు వంటి వారు ఆక్రోశిస్తున్నారు. రోజుల తరబడి అక్కడే ఎదురు చూడాల్సిన పరిస్థితి అయిపోయింది అని అక్కడికి వెళ్ళిన వాళ్ళు తెలుపుతున్నారు.

 

ఇంకా చదవండి: మాజీ సీఎం జగన్ కాన్వాయ్ కు బ్రేక్ వేసిన పోలీసులు! వారికి నో ఎంట్రీ!

  

"అసలు ఇబ్బందులు పడే వారు ఎంబసీకి ఎందుకు వస్తారు?"

అక్కడ ఇళ్ళలో పని చేసేవారి ఇంటి ఓనర్స్ నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. సరిగ్గా జీతాలు ఇవ్వకపోవడం, తిండి పెట్టక పోవడం, పని మనుషుల్ని వేధించడం, మానసికంగా మరియు శారీరకంగా వాడుకోవటం, హింసించడం, ఇలా ఒక్కొక ఇంట్లో ఒక్కో రకమైన హింసలు. ఎంతోకొంత డబ్బులు సంపాదించు కోవాలని ఆశగా వెళ్ళిన కొంతమంది అక్కడ ఎంతో నరకం అనుభవిస్తునారు. పోనీ ఇదంతా వదిలేసి వెళ్లిపోదాం అనుకుంటే వారి పాస్ పోర్ట్ లు వారి దగ్గర ఉండవు, ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఆ నరకం నుంచి ఎలా బయట పడాలో తెలియక, ఎంతో మంది నిస్సహాయ స్థితిలో నలిగి పోతున్నారు. పని మనిషి ని ఓనర్ల చేతికి అప్పగించేసి ఏజెంట్లు చేతులు దులిపేసు కుంటున్నారు.

 

ఆ బాధలు తట్టుకోలేక ధైర్యం చేసి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇంట్లో నుంచి పారిపోయి వస్తే పరిణామాలు ఎలా ఉంటాయో తెలిసి కూడా వారు ఆ పని చేస్తున్నారు అంటేనే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్ధం అవుతుంది. అలా పారిపోయి ఏ దిక్కూ తోచక ఎంబసీని ఆశ్రయిస్తే వారు రోజుల తరబడి ఆఫీసు చుట్టూ తిప్పుకుంటున్నారు. అలా పారిపోయి వచ్చిన వాళ్ళని ఇండియన్ ఎంబసీ ఎందుకు ఆదుకోదు?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

"అసలు ఇండియన్ ఎంబసీ ఎందుకు ఆదుకోవాలి?"

పరాయి దేశంలో ఉన్నప్పుడు ఆ దేశంలో ఉన్న భారత పౌరులు అందరి బాధ్యత ఇండియన్ ఎంబసీది. ఎంబసీ లో అన్నీ సమస్యలకు పరిష్కారం ఉంటుంది. అన్నీ అవసరాలకు అనుగుణంగా స్టాఫ్ ను ఏర్పాటు చేస్తారు. ఎంబసీ తప్ప ఆ నిస్సహాయులకు వేరే దారి ఉండదు.

 

"నిస్సహాయులకు ఎంబసీ ఎందుకు ఆర్ధిక సహాయం చేయాలి?"

ఎంబసీ లో ఏ పని కోసం వెళ్ళినా డాక్యుమెంటేషన్ చార్జీల తో పాటు ICWF (ఇండియన్ కమ్యూనిటి వెల్ఫేర్ ఫండ్) ఫండ్ కొరకు కొంత మొత్తం వసూలు చేస్తారు. ఈ ICWF నిధుల్ని అక్కడ వారి సంక్షేమం కోసం ఉపయోగించాలి. ఈ ICWF నిల్వలు ప్రతి దేశంలో ఉన్న ఎంబసీలో చాలనే ఉంటుంది. ఒక వేళ ఆ దేశం లో ఉన్న ఎంబసీలో ICWF నిల్వలు తక్కువ అయితే వేరే ఎంబసీ నుంచి తీసకునే అవకాశం కూడా ఉంది. సహాయం కోసం వచ్చిన వారిని ఆదుకోవడం కోసం ఆ డబ్బును ఖర్చు చేయాలి. అలాంటప్పుడు ఈ ఇబ్బందులకు ఆ డబ్బును ఎందుకు ఉపయోగించటం లేదు?

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

సహాయం కోసం వచ్చిన వాళ్ళని తిండి తిప్పలు లేకుండా పార్కుల్లో, బీచుల్లో, ఆఫీసు బయట పడుకునే లా చేస్తున్నారు. అసలు ఇన్ని ఇబ్బందులు ఎంబసీ కి కనిపించడం లేదా? అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు. ఈ సమస్యలను తీర్చ వలసిన బాధ్యత వారికి లేదా? ఆడవవాళ్ళకు ఆశ్రయం కూడా కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో ఇండియన్ ఎంబసీ ఉందా? ఏ ఆదారం లేక చాలామంది ఆడవాళ్లు ఎంబసీ చుట్టుపక్కల ఉన్నటువంటి పార్కుల్లో, బీచ్ లో రాత్రులు చలికి పగలు ఎండ వేడిని భరిస్తూ ఏ గతీ లేకుండా రోడ్డు మీద నివాసిస్తున్నారంటే భారతదేశపు ఆడవాళ్లు అంత చీప్ గా ఉన్నారా? ఎంబసీ దృస్టిక్ వచ్చినా కూడా పట్టించుకోక పోవడాన్ని ఏమనాలి? ఏమనుకోవాలి?

 

ఒమన్ లో ఉన్న భారత ఎంబసీ కి, మరియు భారతీయ అంబాసిడర్ గారికి ఆంధ్ర ప్రభాసి తరఫున మరియు ఒమన్ లో నివాసం ఉంటున్న భారతీయుల తరఫున మరియు వారి కుటుంబ సభ్యుల తరఫున వారికి ప్రత్యేక అభ్యర్థన ఏమంటే తక్షణం బయట రోడ్ల మీద, పార్కుల్లో మరియు బీచ్ లో ఉన్నటువంటి ఆడవారిని అందరిని ఎంబసీ షెల్టర్ లోకి తీసుకువచ్చి త్వరితగతిన వారి యొక్క న్యాయ పరమైన సమస్యలను కంప్లీట్ చేసి వారి స్వస్థలాలకు పంపాలని ప్రార్థిస్తున్నాము.

 

ఈ వార్త చూసిన ప్రతి ఒక్కరూ ఈ సమస్యను కొంచెం పట్టించుకోని ఈ న్యూస్ ను ఇండియన్ ఎంబసీ దృష్టికి వెళ్లి, సమస్య పరిష్కారం అయ్యేంత వరకు అందరికీ షేర్లు చేయ వలసిందిగా ఆంధ్ర ప్రవాసి తరఫునుంచి కోరుకుంటున్నాము.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సౌదీలో మరో తెలుగు వ్యక్తి అనుభవిస్తున్న నరకం! స్పందించిన మంత్రి లోకేష్!

 

తస్మా జాగ్రత్త! ఎలక్ట్రిక్ హీటర్‌ నీళ్లతో స్నానం చేస్తున్నారా? అయితే మీరు తెలుసుకోవాల్సిన నిజాలు!

 

తెలుగు రాష్ట్రాలలో మహిళలకు గుడ్ న్యూస్! భారీగా తగ్గిన బంగారం ధర!

 

ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన విమాన సేవలు! కారణం ఏంటంటే!

 

చంద్రబాబు బెయిల్ పిటిషన్! విచారణ మరోసారి వాయిదా!

 

అమెరికాకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం! రష్యాకు దారి మళ్లింపు! ఎందుకో తెలుసా?

   

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Gulf #GulfNews #Omaan #OmanNews #OmanCrimes #GulfCrimes #TeluguPeopleInOman #OmanMaids #CrimesInOman #RunAwayMaid