సింగపూర్, హాంగ్‌కాంగ్ విధించిన నిషేధంపై! ఎమ్‌డీహెచ్ మసాలా స్పందన! 100 శాతం సేఫ్!

Header Banner

సింగపూర్, హాంగ్‌కాంగ్ విధించిన నిషేధంపై! ఎమ్‌డీహెచ్ మసాలా స్పందన! 100 శాతం సేఫ్!

  Sun Apr 28, 2024 09:44        Others

క్రిమిసంహారకాలు ఉన్న కారణంతో ఎమ్‌డీహెచ్ మసాలాలను సింగపూర్, హాంగ్‌కాంగ్ నిషేధించడంపై సంస్థ తాజాగా స్పందించింది. తమ మసాలా ఉత్పత్తుల్లో ఇథిలిన్ ఆక్సైడ్ క్రిమిసంహారకం ఉందన్నది నిరాధారణ ఆరోపణ అని పేర్కొంది. అవన్నీ అవాస్తవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. తమ ఉత్పత్తులు 100 శాతం భద్రమైనవని వినియోగదారులు, వ్యాపారులకు భరోసా ఇచ్చింది. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

తమకు నిషేధానికి సంబంధించి సింగపూర్ లేదా హాంగ్‌కాంగ్ నుంచి అధికారికంగా ఎటువంటి సమాచారం అందలేదని ఎమ్‌డీహెచ్ పేర్కొంది. అంతేకాకుండా, స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఆహార నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐకి వద్ద కూడా నిషేధానికి సంబంధించిన సమాచారం లేదని పేర్కొంది. కాబట్టి, ఎమ్‌డీహెచ్‌ మసాలాల్లో క్రిమిసంహారకాలు ఉన్నాయన్న ఆరోపణలు నిరాధారమని పేర్కొంది. మసాలాల ఉత్పత్తి నుంచి అమ్మకాల వరకూ ఏదశలోనూ తాము క్రిమిసంహారకాలు వాడమని స్పష్టం చేసింది. 

 

జగన్ సర్కార్ కు మరో షాక్! సీఈసీ కీలక ఆదేశాలు! వారి బదులుగా ప్రభుత్వ ఉద్యోగులు 

 

సింగపూర్‌తో పాటు హాంగ్‌కాంగ్ కూడా ఎమ్‌డీహెచ్, ఎవరెస్ట్ మసాలు నిషేధం విధించాయన్న వార్త ఇటీవల సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రెండు బ్రాండ్ల ఉత్పత్తుల్లో ఇథిలిన్ ఆక్సైడ్ ఉండడంతో నిషేధించినట్టు తెలిపాయి. ప్రజలు ఎవరెస్టు ఉత్పత్తులను కొనుగోలు చేయొద్దని హాంగ్‌కాంగ్ ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఉత్పత్తులను దేశంలో అమ్మొద్దని వ్యాపారులను కూడా ఆదేశించింది.

 

ఇవి కూడా చదవండి:

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండవల్లి శ్రీదేవి! చంద్రబాబు కీలక ఆదేశాలు 

 

ఎన్నారై టిడిపి ద్వారా లక్ష అంతర్జాతీయ ఉద్యోగాలు! 5,000 మంది ఎన్నారై లతో NRISE -AP ప్రచార కార్యక్రమం ప్రారంభం! డా. రవి వేమూరి ఆధ్వర్యంలో! 

 

పల్నాడు ప్రజల పాలిట పెన్నిధి! ఆస్తిలో సగానికి పైగా పేద విద్యార్థులకు స్కాలర్ షిప్స్! యువ రాజకీయవేత్తలకు ఆదర్శం శ్రీ కృష్ణ దేవరాయలు! 

 

EC నోటీసుకు స్పందించిన NRI TDP అమెరికా కోఆర్డినేటర్ జయరాం! వైసిపి తప్పుడు ప్రచారం! టిడిపి కోసం కృషి చేయాలి! 

 

ఎన్నారైలు గుంట నక్కలు - సాక్షి పేపర్! విరుచుకుపడిన ఎన్నారై టిడిపి యూఎస్ఏ సభ్యులు! ఎన్నారైలకు క్షమాపణ చెప్పాలి 

 

ఓట్లు అడిగే YCP నేతలకు వీటికి సమాధానం అడగండి! రాష్ట్రాన్ని ముంచిన వారికి "రాయి" తో కాదు "ఓటు" తో సమాధానం! 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #FoodProducts #Singapore #HongKong #masalaProducts