కిర్గిస్తాన్ లోని భారతీయ విద్యార్ధులు ఇళ్లలోనే ఉండాలి! మంత్రి జై శంకర్ హెచ్చరికలు! అత్యవసర పరిస్థితుల్లో ఎంబసీ ని సంప్రదించాలి!

Header Banner

కిర్గిస్తాన్ లోని భారతీయ విద్యార్ధులు ఇళ్లలోనే ఉండాలి! మంత్రి జై శంకర్ హెచ్చరికలు! అత్యవసర పరిస్థితుల్లో ఎంబసీ ని సంప్రదించాలి!

  Sat May 18, 2024 21:49        Others

న్యూ ఢిల్లీ: కిర్గిస్తాన్ లో విదేశీ విద్యార్థులపై దాడులు జరిగిన తీరు కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఓ హాస్టల్లో జరిగిన దాడుల్లో పలువురు పాకిస్థానీ విద్యార్థులు గాయపడ్డారు. దీంతో కిర్గిస్తాన్ లోని భారత పౌరులు ఇళ్లలోనే ఉండాలని భారత్ సూచించింది.

 

తాము భారతీయ విద్యార్థులతో సంప్రదింపులు జరుపుతున్నామని, ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని కిర్గిస్తాన్ లోని భారత కాన్సులేట్ ఎక్స్ (X) లో పేర్కొంది. అయినప్పటికీ విద్యార్థులు ప్రస్తుతానికి ఇళ్లలోనే ఉండాలని, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఎంబసీని సంప్రదించాలని సూచించింది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా దీనిపై స్పందించారు. రాయబార కార్యాలయంతో నిరంతరం టచ్లో ఉండాలని భారత విద్యార్థులకు ఆయన సూచించారు. కాగా, పాకిస్థాన్ విద్యార్థులపై జరిగిన దాడులపై పాక్ ప్రధాని షెహబాబ్ షరీఫ్ కూడా స్పందించారు.

 

కిర్గిస్తాన్ లోని బిష్కెక్లో పాకిస్థానీ విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఎక్స్ లో పేర్కొన్నారు. అవసరమైన సాయం అందించాలని తాను పాక్ రాయబారిని ఆదేశించానని చెప్పారు. తన కార్యాలయం కూడా ఎంబసీతో టచ్ లో ఉందని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలిపారు.

 

ఇవి కూడా చదవండి: 

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు! AI పరంగా మొదటి స్థానం! రానున్న కాలం లో భారత దేశానిదే! 

 

సింగపూర్: మలేషియాలో ఉన్నా, లేదా వెళ్తున్న వారు జాగ్రత్త పడాలి! విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్ర హెచ్చరికలు! బాంబు దాడి నేపథ్యంలో! 

 

భారతీయులకు ఈ 10 దేశాలకు వీసాలు లేకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు గడిపే అవకాశం! ఆ దేశంలో ఏకంగా ఆరు నెలలు! 

 

ఓరి దేవుడో! పిల్ల ఏనుగుకు ఇంత సెక్యూరిటీ నా! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో! 

 

ఉప్పును తగ్గిస్తే 25 లక్షల ప్రాణాలు కాపాడొచ్చు! ప్రజలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన! 

 

అమెరికా: 12 సెకన్లలో 200 కోట్లు కొట్టేసిన స్టూడెంట్లు! వెలుగులోకి వచ్చిన హైటెక్ మోసం! 

 

టేకాఫ్‌కు ముందు టగ్ ట్రక్‌ను ఢీకొట్టిన ఎయిర్ ఇండియా విమానం! విచారణకు ఆదేశించిన డీజీసీఏ! 

  

ప్రపంచ దేశాలలో విస్తృతంగా వ్యాపిస్తున్న భారత సంస్కృతి! చీరకట్టుతో జపనీయుల మనసు దోచిన యువతి! 

  

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #TeluguMigrants #StudentsAbroad #MEA #Foreign #AbroadStudies