కిర్గిస్తాన్ లో ఉంటున్న భారతీయ పౌరులకు! విదేశాంగ శాఖ సూచనలు! తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి!

Header Banner

కిర్గిస్తాన్ లో ఉంటున్న భారతీయ పౌరులకు! విదేశాంగ శాఖ సూచనలు! తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి!

  Sun May 19, 2024 21:00        Others

19.05.2024
తాడేపల్లి


కిర్గిజ్ స్తాన్ (బిష్కెక్)లో ఉంటున్న భారతీయ పౌరులకు భారత విదేశాంగ శాఖ ముఖ్య గమనిక:

తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి


కిర్గిజ్ స్తాన్ దేశంలో, ఒక ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారతీయ పౌరులు,విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే కిర్గిజ్ స్తాన్ లోని భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్ 0555710041 ను సంప్రదించాలని సూచిస్తూ భారత విదేశాంగ శాఖ 18.05.24 తేదీన మార్గదర్శకాలు జారీ చేసింది. భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తోంది అని తెలిపింది. విద్యార్థులు వసతి గృహాల్లోనే ఉండాలని, భారత రాయబార కార్యాలయంతో నిత్యం అందుబాటులో ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ ఈ విషయాన్ని నిన్ననే అధికారిక వెబ్ సైట్, సామాజిక మాధ్యమాలైన ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

విదేశీ యాత్రలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఏపీఎన్ఆర్టీఎస్ ఎప్పటికప్పుడు కేంద్రప్రభుత్వమ్ గైడ్లైన్స్ అనుసరిస్తూ, పరిస్థితిని తెలుసుకుంటోంది. నిన్న (18.05.24) నలుగురు (04) తెలుగు విద్యార్థులు ఏపీఎన్ఆర్టీఎస్ హెల్ప్ లైన్ ను సంప్రదించారు. అల్లర్లు జరుగుతున్న ప్రదేశాల నుండి భారతీయ/తెలుగు విద్యార్థులందరూ సురక్షిత ప్రదేశాలలో ఉన్నారని తెలిపారు.

 

భారతీయ విద్యార్థులు మెడిసిన్ చదవడానికి ఎక్కువ సంఖ్యలో కిర్గిజ్ స్తాన్ వెళ్తారు. అందులో తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు. ఇప్పటివరకు భారతీయ విద్యార్థులపై ఏటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినట్టు నివేదిక లేదు.

 

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రజలు, విద్యార్థులు ఏపీఎన్ఆర్టీఎస్ 24/7 హెల్ప్ లైన్ నంబర్లు +91 863 2340678, +91 8500027678 (W) మరియు కిర్గిజ్ స్తాన్ లోని భారత రాయబార కార్యాలయం హెల్ప్ లైన్ నంబర్ 0555710041 ను సంప్రదించగలరు. ఏపీఎన్ఆర్టీఎస్ ఇమెయిల్స్: info@apnrts.com; helpline@apnrts.com; ద్వారా కూడా సంప్రదించగలరు.

 

చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
ఏపీఎన్ఆర్టీఎస్

 

ఇవి కూడా చదవండి: 

ఐర్లాండ్ వెళ్ళాలి అనుకునే వారికి శుభవార్త! వర్క్ మరియు డిపెండెంట్ వీసాలు సులభతరం! ఆకర్షణీయమైన పథకాలు 

 

సింగపూర్‌లో మరోసారి కరోనా కలకలం! కొత్తగా 25,900 కేసులు నమోదు! మాస్క్ తప్పనిసరి! 

 

కెనడా: అంతర్జాతీయ విద్యార్ధులకు గుడ్ న్యూస్! రెండు సంవత్సరాల పోస్ట్-స్టడీ వర్క్ పొడిగింపు! ఆనందంలో స్టూడెంట్స్! 

 

తస్మాత్ జాగ్రత్త... విశాఖలో పట్టుబడ్డ గ్యాంగ్! విదేశాల్లో ఐటీ ఉద్యోగాలని ఘరానా మోసం! ముగ్గురు ఏజెంట్ లు అరెస్ట్! 

 

ఏపీలో భారీగా కేంద్ర బలగాల మోహరింపు! అల్లర్ల నేపథ్యంలో! స్ట్రాంగ్ రూమ్ ల వద్ద కాపలా! 

 

చంద్రబాబు దంపతుల విదేశీ పర్యటన! వారం రోజులపాటు అమెరికాలో! నేటి నుండి మొదలు! 

 

జమ్మలమడుగులో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సమీక్ష! ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులను! 

 

కిర్గిస్తాన్ లోని భారతీయ విద్యార్ధులు ఇళ్లలోనే ఉండాలి! మంత్రి జై శంకర్ హెచ్చరికలు! అత్యవసర పరిస్థితుల్లో ఎంబసీ ని సంప్రదించాలి! 

 

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు! AI పరంగా మొదటి స్థానం! రానున్న కాలం లో భారత దేశానిదే! 

 

సింగపూర్: మలేషియాలో ఉన్నా, లేదా వెళ్తున్న వారు జాగ్రత్త పడాలి! విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్ర హెచ్చరికలు! బాంబు దాడి నేపథ్యంలో! 

 

భారతీయులకు ఈ 10 దేశాలకు వీసాలు లేకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు గడిపే అవకాశం! ఆ దేశంలో ఏకంగా ఆరు నెలలు!

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #TeluguMigrants #StudentsAbroad #MEA #Foreign #AbroadStudies #Kyrgyzsthan