రోజురోజుకీ మితిమీరుతున్న కిమ్ ఆగడాలు! దక్షిణ కొరియా లోకి 600 చెత్తతో నిండిన బెలూన్లు విడుదల! భయంతో స్థానికులు!

Header Banner

రోజురోజుకీ మితిమీరుతున్న కిమ్ ఆగడాలు! దక్షిణ కొరియా లోకి 600 చెత్తతో నిండిన బెలూన్లు విడుదల! భయంతో స్థానికులు!

  Sun Jun 02, 2024 13:33        Others

ఉత్తర కొరియా నుంచి చెత్తతో కూడిన బెలూన్లు దక్షిణ కొరియా గ్రామాల్లో పడుతున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా బెలూన్ల కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. అయితే తాజాగా శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు దాదాపు 600 కు పైగా చెత్తతో కూడిన బెలూన్లు ఉత్తర కొరియా సరిహద్దు గ్రామాల నుంచి దక్షిణ కొరియా వైపుగా గాల్లో ఎగిరినట్లు సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. క్రింద పడిన తరువాత బెలూన్లకు కట్టి ఉన్న కవర్లను ఓపెన్ చేయగా వాటిలో సిగరెట్ పీకలు, స్క్రాప్లు, వ్యర్థ కాగితం, వినైల్ ఉన్నాయి, అయితే ఎటువంటి ప్రమాదకరమైన పదార్థాలు మాత్రం లేవని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఆదివారం తెలిపారు.

 

WhatsApp Image 2024-06-02 at 13.31.16.jpeg

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

గాల్లో నుంచి ఏదైనా పడినట్లయితే ఆ వస్తువుల పట్ల జాగ్రత్త వహించాలని, ఉత్తర కొరియాకు చెందినవిగా అనుమానిస్తున్న వస్తువులను తాకవద్దని, బదులుగా వాటిని మిలిటరీ లేదా పోలీసు కార్యాలయాలకు నివేదించాలని సైన్యం ప్రజలకు సూచించింది. ఈ బెలూన్ల కారణంగా ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరిగినట్లు సమాచారం లేదు. సియోల్లో నగరానికి సమీపంలోని ఆకాశంలో ఉత్తర కొరియా నుండి ఎగురుతున్నట్లు అనుమానించబడిన గుర్తు తెలియని వస్తువులు కనుగొన్నామని, సైన్యం వాటికి ప్రతిస్పందిస్తోందని ప్రభుత్వ అధికారులు తెలిపారు.

 

WhatsApp Image 2024-06-02 at 13.33.23.jpeg

 

తెలుగు తమ్ముడికి 8 కోట్లు - దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం డ్రాలో గెలుపు! మరో ఇద్దరు భారతీయులకు కారు, బైకు! అదృష్టం ఉంటే అలా ఉండాలి 

 

ఇంతకుముందు మంగళవారం రాత్రి నుండి బుధవారం వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో 260 ఉత్తర కొరియా బెలూన్లను కనిపెట్టారు. ప్రస్తుతం అవి నేలపై పడిపోవడంతో వాటిని క్లియర్ చేయడానికి దక్షిణ కొరియా సైన్యం, స్థానిక అధికారులు శ్రమిస్తున్నారు. వాటిలో పేలుడు పదార్థాలు ఉన్నాయో కనిపెట్టడానికి బాంబ్ స్క్వాడ్ బృందాలను పంపారు. బెలూన్లకు కట్టిన కవర్లో ఎక్కువగా వివిధ రకాల చెత్త, పేడను ఉన్నాయి, అయితే రసాయన, జీవ లేదా రేడియోధార్మిక పదార్థాలు వంటి ప్రమాదకరమైన పదార్థాలు లేవని మిలిటరీ తెలిపింది.

 

ఇవి కూడా చదవండి: 

ఆలస్యమైన విమానం... దానికి పరిహారం! 29 వేల వోచర్! ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం! 

 

ప్రపంచంలోనే అత్యంత అల్లకల్లోల వాతావరణం (టర్బ్యులెన్స్) ఉండే విమాన మార్గాలు! ఈ 5 బాగా డేంజరస్! సింగపూర్ ఎయిర్ లైన్స్ ప్రమాదం అందుకే! 

 

సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న సాక్షి! ఆ ఛానల్ లో మాత్రమే ఇలా! 

 

ప్రపచవ్యాప్తంగా అత్యుత్తమ బడ్జెట్ ఎయిర్ లైన్స్! ఇండియాకు సంబంధించి! 

 

భారత్ నుండి యూఏఈ వెళ్తున్నారా! అయితే ఇది మీ కోసమే! సేమ్ ఎయిర్ లైన్లో రిటర్న్ టికెట్ తప్పదు! 

 

ఢిల్లీ-వారణాసి విమానంలో బాంబు బెదిరింపుపై సమీక్ష! ఆరుగురు సిబ్బందిని తొలగించిన ఇండిగో! కారణం తెలిస్తే అవాక్కవుతారు! 

 

భావోద్వేగంతో - ABV అధర్మాన్ని ఎదుర్కోవటమే వృత్తిగా! చట్టాన్ని కాపాడేందుకే కృషి! లక్షల మంది అభిమానంతో, పూర్తి సంతృప్తితో...

 

మాస్కోకు భారీగా పెరుగుతున్న భారతీయ పర్యాటకులు! మరిన్ని సౌకర్యాలను కల్పిస్తున్న రష్యా ప్రభుత్వం! గత సంవత్సరంతో పోలిస్తే! 

 

ఆ రెండు విషయాల్లో ఎమిరేట్స్ ఒకటవ స్థానంలో! ప్రీమియం ఎకానమీ కేక! ఓవర్ ఆల్ లో మాత్రం నెంబర్ 1 అదే! 

 

ఎయిర్‌లైన్స్ రేటింగ్స్ ర్యాంకింగ్స్‌లో ఎయిర్ న్యూజిలాండ్ అగ్రస్థానం! టాప్ 5 స్థానాలలో ఏవంటే? 

            

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #NorthKorea #SouthKorea #Seoul #Trash #TrashBalloons