ఇదెక్కడి సైకోఇజం రా బాబు! పాటలు వింటే ఉరితీస్తారా! పూర్తి కథ ఏంటో చూసేయండి!
Fri Jun 28, 2024 20:13 Othersఉత్తర కొరియా-దక్షిణ కొరియాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం ఉందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ప్రజల విషయంలో చాలా కఠిన నిబంధనలు అమలు చేస్తారు. ఆ దేశంలో శత్రు దేశాల గురించి మంచిగా మాట్లాడటం కానీ, వారి సంస్కృతిని పాటించడం కానీ చేసినట్లయితే కఠినంగా శిక్షిస్తారు. ఈ క్రమంలో దక్షిణ కొరియాకు చెందిన పాటలు విన్నాడని, ఆ దేశ సినిమాలు చూశాడనే ఆరోపణలతో ఒక వ్యక్తిని బహిరంగంగా ఉరి తీసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇటీవల దక్షిణ కొరియా ఒక నివేదికను విడుదల చేసింది. దీనిలో ఉత్తర కొరియా మానవ హక్కుల గురించి వెల్లడించింది. ఈ నివేదికలో పేర్కొన్న దాని ప్రకారం, 2022లో దక్షిణ హ్వాంగేహే ప్రావిన్స్కు చెందిన 22 ఏళ్ల వ్యక్తి 70 దక్షిణ కొరియా పాటలు విన్నాడని, అలాగే, ఆ దేశానికి చెందిన 3 సినిమాలు చూశాడని, వాటిని ఇతరులకు షేర్ చేశాడని, అతన్ని బహిరంగంగా ఉత్తర కొరియా ఉరితీసింది. ఉత్తర కొరియా తన పౌరులు వినియోగించే సమాచారంపై ఎల్లప్పుడు నిఘా వేస్తూ, కఠినమైన నియంత్రణ కలిగి ఉంది.
ఇంకా చదవండి: మాచర్లకు పట్టిన పీడ వదిలింది! గుండా సన్నాసి పిన్నెల్లి అరెస్ట్! కఠినంగా శిక్షించాలి
శుత్రు దేశాలకు చెందిన సినిమాలు, పాటలు ఇతర ఎంటర్టైన్మెంట్, పాశ్చాత్య సంస్కృతి వినియోగానికి సంబంధించి కఠినమైన నియమాలను అమలు చేస్తుంది. ఒకవేళ ఎవరైనా వాటిని ఉల్లంఘించినట్లయితే చాలా కఠినమైన శిక్షలు వేస్తారు. మరోవైపు దక్షిణ కొరియా పేర్కొన్న మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలను ఉత్తర కొరియా ఖండించింది. ఆ దేశం కావాలనే తమపై తప్పుడు ప్రచారాలు చేస్తుందని, మా నాయకత్వాన్ని అణగదొక్కే ప్రయత్నాలు చేస్తుందని పేర్కొంది. ఇదిలా ఉంటే, ఉత్తర కొరియాలో పాశ్చాత్య సంస్కృతిపై నియంత్రణ అనేది మాజీ నాయకుడు కిమ్ జోంగ్-ఇల్ ఆధ్వర్యంలో ప్రారంభం కాగా, ఆ తర్వాత ఆయన కుమారుడు కిమ్ జోంగ్ ఉన్ ఆధ్వర్యంలో మరింత తీవ్రమైంది.
ఇవి కూడా చదవండి:
ఒకరి ఐఆర్‌సీటీసీ ఐడీతో ఇతరులకు టికెట్స్ బుక్ చేస్తే జైలుశిక్ష విధిస్తారా? రైల్వే సమాధానం ఇదే!
గ్రీన్ సిగ్నల్ కోసం ట్రాఫిక్ లో ఎదురుచూస్తున్న ఆవు! వైరల్ అవుతున్న వీడియో!
మాల్దీవుల అధ్యక్షుడికి వ్యతిరేకంగా క్షుద్రపూజలు! ఇద్దరు మంత్రుల అరెస్టు!
మోడీ సర్కార్ ను ఇరుకున పెట్టేలా భారీ స్కెచ్! ఇండియా కూటమి కీలక నిర్ణయం!
వాలంటీర్లకు షాక్ ఇచ్చిన ఏపీ సర్కార్! అలా చేస్తే కఠిన చర్యలు!
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను లాభాల బాట పట్టించే ప్రయత్నం! కేంద్ర మంత్రి తో పురందేశ్వరి చర్చలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #NorthKorea #SouthKorea #Seoul #KimJong #Kim
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.