ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణం రాష్ట్రంలో సంచలనం! మేనేజర్ మోసపూరిత చర్యలతో కోట్లు మాయం! బాధితులు ఆందోళనలో!

Header Banner

ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణం రాష్ట్రంలో సంచలనం! మేనేజర్ మోసపూరిత చర్యలతో కోట్లు మాయం! బాధితులు ఆందోళనలో!

  Fri Oct 04, 2024 08:48        Others

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని ఐసీఐసీఐ బ్రాంచిలో భారీ కుంభకోణం జరిగింది. గతంలో మేనేజర్గా పనిచేసిన నరేశ్, గోల్డ్ అప్రైజర్ హరీశ్ ఆధ్వర్యంలో రూ.కోట్ల నగదును ఖాతాదారుల ఎకౌంట్లలోంచి తస్కరించినట్లు గుర్తించారు. ఈ విషయం బయటపడటంతో గురువారం బాధితులు పెద్దఎత్తున బ్యాంకుకు వచ్చి ఆందోళనకు దిగారు. పట్టణానికి చెందిన పొత్తూరి కోటేశ్వరమ్మ రూ.45 లక్షలు డిపాజిట్ చేశారు. ఏడాది తర్వాత మేనేజర్ నరేశ్ రెన్యూవల్ చేస్తున్నానని చెప్పి, సొమ్మును తన ఖాతాకు బదిలీ చేసుకున్నారు. మరో నలుగురికి సంబంధించిన రూ.79 లక్షల్లో.. ఓడీ పేరుతో 90 శాతం సొమ్మును నరేశ్ తన ఖాతాకు మళ్లించుకున్నారు. ఖాతాదారులకు అనుమానం రాకుండా, ఇటీవలి వరకు రూ. లక్షకు రూ.వెయ్యి చొప్పున బ్యాంకు వేసినట్లే వడ్డీ జమచేశారు. ఇటీవల ఆ సొమ్ము జమకావడం ఆగిపోవడంతో ఖాతాదారులు బ్యాంకు వద్ద ఆందోళన చేశారు. ఈ మోసంలో గోల్డ్ అప్రైజర్ హరీశ్ పాత్ర ఉందని ఆరోపించారు. ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారం తాకట్టు రుణాల్లో మోసం జరిగినట్లు వాపోయారు. ఐసీఐసీఐ బ్యాంక్ విజయవాడ జోనల్ మేనేజర్ సందీప్ మెహ్రా, రీజినల్ మేనేజర్ రమేశ్ ఖాతాదారుల నుంచి వివరాలు సేకరించారు. 14 మంది ఖాతాదారులు రూ.6.90 కోట్ల నగదు, 115 సవర్ల బంగారం మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు. షేక్ బాజిబీ అనే మహిళ పేరిట పెద్దమొత్తంలో డిపాజిట్లు, బంగారం రుణాలు ఉన్నాయి. ఆమె ఖాతాల్లోంచి భారీగా మళ్లించుకున్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తీవ్ర జ్వరంతో తిరుమలలోనే ఉండిపోయిన డిప్యూటీ సీఎం! వారాహి సభ ఉంటుందా? లేదా?

 

పిచ్చి ఆకులు అనుకోని పడేస్తున్నారా? వాటితో ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు!

 

తిరుమల లడ్డూ వివాదంపై పెరిగిపోతున్న ఉత్కంఠ! సుప్రీం కోర్టులో విచారణ వాయిదా!

 

బీజేపీకి షాక్ ఇచ్చిన మాజీ ఎంపీ! ఐదేళ్లలో నాలుగో సారి పార్టీ చేంజ్!

 

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు షాక్‌! మరో 14 రోజులు రిమాండ్‌ పొడిగింపు!

 

గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. సంక్రాంతి నుంచి మరో కొత్త పథకం! తాను చేసిన పనికి గుర్తింపు!

 

హత్యకు గురైన పవన్ కల్యాణ్ బౌన్సర్! ఎవరుఎందుకు చేశారు..! అసలేం జరిగింది..

 

చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కొత్త మలుపు! విచారణకు మళ్లీ పోలీసుల నోటీసులు!

 

ఏపీ లో కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్! నియామక ప్రక్రియ వేగవంతం! హోం శాఖ అనిత కీలక ప్రకటన!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


 


   #andhrapravasi #bank #robbery #highamount #scam #managerfruad #icicibank #chilukaluripet #bigscam #todaynews #flashnews #latestupdate