పాకిస్థాన్‌లో రెండు తెగల మధ్య ఘర్షణ! 11 మంది దుర్మరణం!

Header Banner

పాకిస్థాన్‌లో రెండు తెగల మధ్య ఘర్షణ! 11 మంది దుర్మరణం!

  Sun Oct 13, 2024 15:15        Others

పొరుగు దేశం పాకిస్థాన్‌లో మరోసారి రెండు తెగల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సున్నీ, షియా ముస్లింలకు మధ్య జరిగిన ఈ ఘర్షణల్లో 11 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పాకిస్థాన్‌లోని ఖైబర్‌ ఫక్తుంఖ్వా ప్రావిన్స్‌లోగల కుర్రమ్‌ జిల్లాలో ఈ ఘర్షణలు జరిగాయి. దాంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

 

ఇంకా చదవండిజగనాసుర దుష్ట పాలన నుండి విముక్తి! వరద విపత్తుపై విజయం! వేల ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు ఆంధ్ర వైపే.. శుభాకాంక్షలతో మంత్రి లోకేష్! 

 

సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు రెండు వర్గాల వారిని చెదరగొట్టారు. ఎవరూ గుంపులుగా బయటికి రాకుండా కర్ఫ్యూ విధించారు. శనివారం ఉదయం ఒక వర్గానికి చెందిన వ్యక్తులు మరో వర్గానికి చెందిన వారే లక్ష్యంగా కాల్పులు జరపడంతో ఇద్దరు మరణించారు. ఈ విషయం జిల్లా అంతటా వ్యాపించి ఘర్షణలు చెలరేగాయి. పలుచోట్ల ఒకవర్గంపై మరో వర్గం కాల్పులు జరుపుకున్నారు. ఈ ఘర్షణలు 11 మందిని బలితీసుకున్నాయి. 

 

ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

పాకిస్థాన్‌లోని ఖైబర్‌ ఫక్తుంఖ్వా ప్రావిన్స్‌లో గత నెలలో కూడా సున్నీ, షియా ముస్లిం తెగల మధ్య ఘర్షణలు జరిగాయి. ఆ ఘర్షణల్లో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనను మరువకముందే ఇప్పుడు మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో ఎంతో కాలంగా సున్నీ, షియా తెగల ముస్లింలు కలిసి మెలిసి జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు తరచూ రెండు తెగల మధ్య ఘర్షణలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీపై ద్రోణి ప్రభావం! భారీ వర్ష సూచన! వాతావరణ శాఖ హెచ్చరిక!

 

సత్యసాయి జిల్లాలో అత్త, కోడలిపై ఘోర అత్యాచారం! నిందితులపై కఠిన చర్యలకు డిమాండ్!

 

మహిళలకు యూనియన్ బ్యాంక్ బంపరాఫర్! రేషన్ కార్డు ఉంటే చాలు, ఉచితంగానే!

 

రూ.40 వేల కోట్లతో "ప్రాజెక్టు-77"! విశాఖపట్నానికే ఆ ఛాన్స్!

 

తిరుమలతో సమానంగా శ్రీశైలం! అభివృద్ధిపై దృష్టి పెట్టిన ప్రభుత్వం! కేబినెట్ లో చర్చ!

 

ఉద్యోగులకు షాకిచ్చిన టిక్‌టాక్‌! వందలాది మందిపై వేటు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Pakisthan #India #Clashes #Dead #Murder