తాను మరణించి... ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపి! మరొకరికి ఆశను పంచిన జగదీష్ కుటుంబం!

Header Banner

తాను మరణించి... ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపి! మరొకరికి ఆశను పంచిన జగదీష్ కుటుంబం!

  Fri Oct 25, 2024 17:58        Others

కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కు మరణించి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబం మరో ముగ్గురు జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముందుకు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన జి.జగదీష్ (41) ఈనెల 22న ఇంట్లో ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో అతన్ని వెంటనే స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి.. తలలో తీవ్ర రక్తస్రావం జరుగుతున్నట్లు గుర్తించారు. మూడు రోజుల పాటు వైద్యులు ఎంతో ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. జగదీష్ బ్రెయిన్ డెడ్ అయినట్లు శుక్రవారం వైద్య బృందం కుటుంబసభ్యులకు తెలియజేసింది. ఆ తర్వాత అవయవదానంపై జగదీష్ భార్య, కుమారుడు, కుమార్తె, బంధువులకు వైద్య బృందం అవగాహన కల్పించింది. దీంతో వారు అవయవదానం చేసేందుకు అంగీకరించారు. ఈ విషయాన్ని రాష్ట్ర జీవన్దాన్ కో-ఆర్డినేటర్ డాక్టర్ కె.రాంబాబు దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన అవయవ దానానికి అనుమతులు జారీ చేశారు. జీవన్ దాన్ ప్రొటోకాల్ ప్రకారం సీనియార్టీ లిస్ట్ ఆధారంగా జగదీష్ కిడ్నీలు, ఊపిరితిత్తులను సేకరించి ముగ్గురు రోగులకు కేటాయించారు. చనిపోతూ మరో ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపినందుకు గర్వంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.



ఇంకా చదవండిఅమరావతికి మరో బిగ్ న్యూస్ - కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..! ఇక ఆ ప్రాజెక్టు వేగవంతం - వారికి పండగే పండగ!



అవయవ దానానికి ముందుకు రావడం అభినందనీయం: జీవన్ ధాన్ రాష్ట్ర కోఆర్డినేటర్
"గత కొద్ది నెలలుగా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల అవయవాలను దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకు రావడం అభినందనీయం. దీనికి గల కారణం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, జీవన్ దాన్ సిబ్బంది, ఆసుపత్రుల వైద్యులు కల్పిస్తున్న అవగాహన. జగదీష్ కుటుంబాన్ని ప్రతి ఒక్కరూ అభినందించటంతో పాటు ఆదర్శంగా తీసుకోవాలి. రాష్ట్రంలో వేల సంఖ్యలో అవయవాల కోసం ఎదురుచూస్తున్న రోగులు ఉన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన వారి కుటుంబసభ్యులు ముందుకు వచ్చి అవయవదానం చేస్తే రోగులు జీవితాల్లో కొత్త వెలుగులు నింపే అవకాశం లభిస్తుంది” అని అన్నారు.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


తల్లి
చెల్లి కలిసి సైకో జగన్‌కు రాసిన లేఖ ఇదే! ప్రపంచంలో ఎవరు ఇలా ఉండరేమో! బిగ్ ఎక్స్‌పోజ్ అంటూ టీడీపీ సంచలన ట్వీట్!

 

రూ.6 వేలకే ఐ ఫోన్రూ.5 వేలకే ఆండ్రాయిడ్ ఫోన్.. ల్యాప్‌టాప్ రూ.15 వేలు మాత్రమే!

 

ముందుబాబులకు డబల్ కిక్కిచ్చే న్యూస్.. రూ.99 క్వార్టర్ వచ్చేసిందోచ్! ఒకరికి ఎన్ని ఇస్తారంటే?

 

ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌గా ఎవర్ని ఎంపిక చేశారు అంటే! కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు!

 

ఏపీలో విద్యార్థులకు లోకేష్ శుభవార్త! అకౌంట్లలో డబ్బులు జమ! గత ప్రభుత్వం రూ.3500 కోట్ల!

 

మంత్రి కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం కేసులో కోర్టు కీలక నిర్ణయం! టాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా!

 

ఏపీలో విద్యార్థులకు లోకేష్ శుభవార్త! అకౌంట్లలో డబ్బులు జమ! గత ప్రభుత్వం రూ.3500 కోట్ల!

 

జగన్‌పై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం! ఇదే తీరు కొనసాగిస్తే ఊరుకునేది లేదు!

 

రైల్వే ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్! దానా ఎఫెక్ట్‌.. 23, 24, 25 తేదీల్లో సుమారు 70 రైళ్లు క్యాన్సిల్‌!

 

ఏపీలో ఫ్రీ గ్యాస్ సిలిండర్లు.. కావాల్సిన అర్హతలుడాక్యుమెంట్స్ ఇవే! దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే!

 

మీ పేరుతో ఎక్కువ సిమ్ కార్డులు ఉన్నాయాభారీ జరిమానామూడేళ్ల జైలు శిక్ష తప్పదు! ఎందుకో తెలుసా?

 

మహిళలు తస్మాస్ జాగ్రత్త.. ఈ లక్షణాలు ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు! 30 నుంచి 52 సంవత్సరాల..

 

విజయవాడ మెట్రోని అమరావతికి అనుసంధానం చేయాలి! కేంద్రరాష్ట్ర మంత్రుల కీలక భేటీ!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #donar #braindead #todaynews #flashnews #latestupdate