స్పేస్ఎక్స్-ఇస్రో భాగస్వామ్యంలో ఘన విజయం! జీశాట్-ఎన్2 కక్ష్యలో ప్రవేశం!

Header Banner

స్పేస్ఎక్స్-ఇస్రో భాగస్వామ్యంలో ఘన విజయం! జీశాట్-ఎన్2 కక్ష్యలో ప్రవేశం!

  Wed Nov 20, 2024 10:39        Others

భారత అధునాతన సమాచార ఉపగ్రహం జీశాట్-ఎన్2 మంగళవారం విజయవంతంగా భూ కక్ష్యలోకి చేరింది. స్పేస్ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్-9 రాకెట్ ద్వారా అమెరికాలోని కేప్ కెనావెరాల్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. 4,700 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని మోసుకెళ్లగల రాకెట్ భారత్ వద్ద లేకపోవడంతో విదేశీ సంస్థపై ఆధారపడాల్సి వచ్చింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వద్ద ఉన్న శక్తిమంతమైన రాకెట్ ఎల్బీఎం-3కి 4వేల కిలోల బరువైన ఉపగ్రహాన్ని మోసుకెళ్లే సామర్థ్యం మాత్రమే ఉంది. ఇస్రోకు, ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ఎక్స్కు మధ్య ఇదే తొలి వాణిజ్య భాగస్వామ్యం. భారత్ గతంలో ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన రాకెట్ల ద్వారా భారీ ఉపగ్రహాలను ప్రయోగించేది. ఇప్పుడు ఆ సంస్థ వద్ద క్రియాశీల రాకెట్లు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయోగించిన 34 నిమిషాల తర్వాత జీశాట్-ఎన్2 ఉపగ్రహం నిర్దేశిత భూ అనువర్తిత బదిలీ కక్ష్య (జీటీవో)లోకి చేరింది. ఆ వెంటనే దాన్ని ఇస్రోకు చెందిన మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ (ఎంసీఎఫ్).. నియంత్రణలోకి తీసుకుంది.



ఇంకా చదవండిఆరవ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టు విడుదల! ఏ ప్రముఖులకు చోటు దక్కిందంటే?



ఉపగ్రహంలోని అన్ని వ్యవస్థలూ సవ్యంగా ఉన్నాయని ప్రాథమిక డేటా సూచిస్తోందని ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) పేర్కొంది. జీశాట్-ఎన్2 హైథ్రోపుట్ కమ్యూనికేషన్ ఉపగ్రహం. దీనివల్ల భారత్లో బ్రాడ్ బ్యాండ్ సేవలకు మరింత ఊతం లభిస్తుంది. విమానాల్లో ఇంటర్నెట్ సంధానత పెరుగుతుంది. భారత్లోని మారుమూల ప్రాంతాలైన అండమాన్ నికోబార్, లక్షద్వీప్, ఈశాన్య రాష్ట్రాల్లో కమ్యూనికేషన్ సేవలు మెరుగవుతాయి. ఈ ఉపగ్రహం 48 జీబీపీఎస్ వేగాన్ని కలిగి ఉంది. ఇందులో 32 స్పాట్ బీమ్లలు, వైడ్బ్యాండ్ కేఏx కేఏ ట్రాన్స్పాండర్లు ఉన్నాయి. ఇది చిన్నపాటి యూజర్ టెర్మినళ్లతో భారీ సంఖ్యలో వినియోగదారులకు సేవలు అందించగలదు. ఈ ఉపగ్రహం 14 ఏళ్ల పాటు సేవలందిస్తుందని భావిస్తున్నారు.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


రాజధాని అమరావతి
పోలవరం రాష్ట్రానికి రెండు కళ్లు లాంటివి! ఎత్తుకు పై ఎత్తు - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

ఎమ్మెల్యే కట్టుకున్న చీరపై రఘురామకృష్ణరాజు ఆసక్తికర ప్రశ్న! ఏం అడిగారంటే!

 

నేడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

రూ.లక్షా 80 వేల జీతంతో సొంత జిల్లాలో ఉద్యోగం! పరీక్ష లేకుండా నేరుగా జాబ్ పొందండి! అస్సలు మిస్ అవ్వదు!

 

మంత్రివర్గం పలు బిల్లులకు గ్రీన్ సిగ్నల్! ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. ఎంతమంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ!

 

టీటీడీ కీలక నిర్ణయం! నిత్య అన్నప్రసాదం మెనులో అదనంగా మరో పదార్థం!

 

ఏపీ శాసనసభలో ఏడు కీలక బిల్లులకు ఆమోదం! నూతన మార్పులకు గ్రీన్ సిగ్నల్!

 

మార్చికల్లా మరో 500 ఎస్బీఐ శాఖల ప్రారంభం! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్: కొత్త ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారాకొత్త విధానం - మంత్రి కీలక వ్యాఖ్యలు!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... రైతుల కోసం వాట్సాప్ నెంబర్! ఆ వివరాలు మీ కోసం!

 

ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్విజయవాడవైజాగ్.. భారీగా విమానాల సర్వీసులు పెంపు!

 

గుడ్ న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధర! ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరు!Don't Miss

 

వైసీపీకి మరో బిగ్ షాక్: విద్యార్థిని ఫిర్యాదు.. మాజీ మంత్రిపై కేసు నమోదు! ఎందుకో తెలుసా?

 

వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #bharath #INDIA #isro #spacex #experiment #todaynews #flashnews #latestupdate